Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

PBKS VS CSK: పంజాబ్ కింగ్స్ ప్లేయర్‌కు బీసీసీఐ షాక్!

ఐపీఎల్ 2025లో తాజాగా జరిగిన హై ఓల్టేజ్ మ్యాచులో చెన్నై ఓడింది, పంజాబ్ గెలిచింది. అయితే గెలిచిన పంజాబ్ జట్టుకు ఓ షాక్ తగిలింది! ఆ జట్టు విజయంలో తనవంతు పాత్ర పోషించిన ఆల్‌రౌండర్‌ గ్లెన్‌ మాక్స్‌వెల్‌పై చర్యలు తీసుకుంది ఐపీఎల్ పాలక మండలి. మ్యాచు సమయంలో అతడి ప్రవర్తన తీరుకుగానూ జరిమానా విధించింది. అసలేం జరిగిందంటే?

కీలక వికెట్ తీసి..!
ఈ మ్యాచ్‌లో ఆరో స్థానంలో బరిలోకి దిగిన గ్లెన్‌ మాక్స్‌వెల్‌ విఫలమయ్యాడు. రెండు బంతులు ఎదుర్కొన్న అతడు.. అశ్విన్‌ బౌలింగ్‌లోనే అతడికే క్యాచ్‌ ఇచ్చి ఔట్ అయ్యాడు. అయితే బౌలింగ్ లో మాత్రం కీలక వికెట్ తీశాడు. రచిన్‌ రవీంద్ర వికెట్‌ తీసి పంజాబ్‌ కింగ్స్ విజయంలో తన వంతుగా ఉడుత సాయం అందించాడు. అయితే మ్యాచ్ సమయంలో అతడు కాస్త దురుసుగా ప్రవర్తించినట్లు తెలుస్తోంది.

PBKS vs CSK Glenn Maxwell fined 25 percent of his match fees For Violating IPL code of conduct

ఎందుకంటే మ్యాక్స్ వెల్ ఆర్టికల్‌ 2.2 లెవల్‌ 1 తప్పిదానికి పాల్పడినట్లు ఐసీసీ నోట్ విడుదల చేసింది. అతడు కూడా తన త్పపిదాన్ని ఒప్పుకున్నట్లు అందులో రాసింది. నిబంధనల ప్రకారం అతడి మ్యాచ్‌ ఫీజులో 25 శాతం కోత విధిస్తున్నాం అని లేఖలో రాసుకొచ్చింది. అలానే అతడి ఖాతాలో ఓ డీమెరిట్‌ పాయింట్‌ ను ఇచ్చింది. కానీ ఏ విషయంలో అతడికి జరిమానా విధించిందో స్పష్టంగా చెప్పలేదు.

అయితే ఆర్టికల్‌ 2.2 ప్రకారం చూస్తే.. ఓ క్రికెటర్ ఉద్దేశపూర్వకంగా మైదానంలో క్రికెట్ సామాగ్రి దెబ్బతినేలా ప్రవర్తిస్తే ఈ జరిమానా విధిస్తారు. కాబట్టి అతడు.. తన దురుసు ప్రవర్తనతో ఏదైనా క్రికెట్ సామాగ్రిని నాశనం చేసినట్లు తెలిసింది.

Story first published: Wednesday, April 9, 2025, 10:57 [IST]
Other articles published on Apr 9, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+