Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

PBKS VS CSK: చెన్నై జట్టు కొంపముంచినా.. చరిత్ర సృష్టించిన ధోనీ!

Dhoni: ఐపీఎల్‌-2025లో చెన్నై సూపర్ కింగ్స్ పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. తాజాగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచులోనూ ఓడి.. ఈ సీజన్ లో వరుసగా నాలుగో పరాజయాన్ని అందుకుంది. ఆడిన ఐదు మ్యాచులో నాలుగింటిలో ఓడిపోవడంతో కేవలం 2 పాయింట్లతో పాయింట్స్ పట్టికలో 8వ స్థానంలో నిలిచింది. ఈ ప్రదర్శనతో సీఎస్కే అభిమానులంతా భోరున ఏడుస్తున్నారు. అయితే ఈ మ్యాచులో ఓడిపోయినప్పటికీ.. చెన్నై జట్టు స్టార్ బ్యాటర్ ధోనీ చరిత్ర సృష్టించాడు. ఓ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు.

అదేంటంటే?
తాజాగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచులో చెన్నై జట్టు 18 పరుగుల తేడాతో ఓడిపోయింది. అయితే ఈ మ్యాచులో ఐదో స్థానంలో వచ్చి ధోనీ... ఆశించినంత స్థాయిలో వేగంగా ఆడలేకపోయాడు. కానీ ఉన్న కాసేపైనా తన అభిమానుల్ని ఉర్రూతలూగించేలా.. కొన్ని షాట్లు ఆడాడు. 12 బంతుల్లో 225 స్ట్రైక్ రేటుతో 1 ఫోర్, 3 సిక్సుల సాయంతో 27 పరుగులు చేశాడు. చివరిగా ఆఖరి ఓవర్లో యశ్ ఠాకూర్ బౌలింగ్ లో చాహల్ చేతికి చిక్కి ఔటైపోయాడు. ఈ ప్రదర్శనతో.. కొంతమంది ధోనీ కొంపముంచాడు అని అంటుంటే.. మరికొంతమంది బానే ఆడాడని ప్రశంసిస్తున్నారు.

PBKS VS CSK Dhoni Creates History Becomes First Player as wicket keeper to take 150 catches in ipl

అరుదైన ఘనత ఇదే..
అయితే ఈ క్రమంలోనే చెన్నై దిగ్గజం ధోనీ అరుదైన ఘనతను అందుకున్నాడు. ఐపీఎల్‌లో వికెట్ కీపర్ గా తన 150వ క్యాచ్‌ను పట్టుకున్నాడు. పంజాబ్ కింగ్స్ బ్యాటర్ నేహల్ వధేరా బంతిని క్యాచ్‌ అందుకుని.. ఈ ఫీట్ టచ్ చేశాడు మహీ. తద్వారా ఐపీఎల్‌లో 150 క్యాచులు అందుకున్న తొలి వికెట్ కీపర్‌గా ధోనీ రికార్డుకెక్కాడు. ఈ ఫీట్‌ను ఇప్ప‌టివ‌ర‌కు ఇతర ఏ వికెట్ కీపర్ కూడా సాధించ‌లేక‌పోయారు. ఇక ధోనీ మొత్తంగా ఐపీఎల్‌లో 154 క్యాచ్‌లను అందుకున్నాడు. అందులో నాలుగు క్యాచులు ఫీల్డ‌ర్‌గా పట్టుకున్నవి. ఇక ధోనీ త‌ర్వాతి స్ధానంలో దినేశ్ కార్తీక్‌(137) కొనసాగుతున్నాడు.

ఐపీఎల్‌లో అత్య‌ధిక క్యాచ్‌లు అందుకున్న వికెట్ కీప‌ర్లు ఎవరంటే?
ధోనీ - 150 క్యాచ్‌లు
దినేశ్ కార్తీక్‌ - 137
వృద్ధిమాన్ సాహా - 87
రిషభ్ పంత్‌ - 76
క్వింటన్ డికాక్‌ - 66

Story first published: Wednesday, April 9, 2025, 8:53 [IST]
Other articles published on Apr 9, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+