Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

PBKS vs CSK: పంజాబ్ రికార్డుకు చెన్నై బ్రేక్

పంజాబ్ కింగ్స్ చేతిలో వరుస పరాజయాలకు చెన్నై సూపర్ కింగ్స్ ఎట్టకేలకు బ్రేక్‌లు వేసింది. ధర్మశాల వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌పై 28 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో తమపై పంజాబ్ సాధించిన వరుస అయిదు విజయాలకు ముగింపు లభించింది. అంతేగాక ఈ గెలుపుతో సీఎస్కే ప్లేఆఫ్స్ అవకాశాలను మెరుగు పర్చుకుంది. అయిదో స్థానం నుంచి మూడో స్థానానికి ఎగబాకింది.

తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లకు 167 పరుగులు చేసింది. రవీంద్ర జడేజా (46; 26 బంతుల్లో, 3x4, 2x6) టాప్ స్కోరర్. రుతురాజ్ గైక్వాడ్ (32; 21 బంతుల్లో, 4x4, 1x6), డారిల్ మిచెల్ (30; 19 బంతుల్లో, 2x4, 1x6) కీలక పరుగులు సాధించారు. శివమ్ దూబె, ఎంఎస్ ధోనీ ఎదుర్కొన్న తొలి బంతికే పెవిలియన్‌కు చేరారు. పంజాబ్ బౌలర్లలో రాహుల్ చాహర్ (3/23), హర్షల్ పటేల్ (3/24) చెరో మూడు వికెట్లతో సత్తాచాటారు.

PBKS vs CSK Chennai Super Kings Triumph Over Punjab Kings


అనంతరం ఛేదనలో పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 139 పరుగులే చేసింది. ఛేజింగ్‌లో ఏ దశలోనూ పంజాబ్ విజయం దిశగా సాగలేదు. తొమ్మిది పరుగులకే కీలక రెండు వికెట్లు కోల్పోయింది. జానీ బెయిర్‌స్టో (7; 6 బంతుల్లో), రొసో (డకౌట్, 3 బంతుల్లో)ను తుషార్ దేశ్‌పాండేను ఔట్ చేసి పంజాబ్‌ను ఆదిలోనే దెబ్బతీశాడు. ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన శశాంక్ సింగ్ (27; 20 బంతుల్లో, 4x4)తో కలిసి ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (30; 23 బంతుల్లో, 2x4, 2x6) ఇన్నింగ్స్ చక్కదిద్దడానికి ప్రయత్నించాడు.

62/2తో పంజాబ్ కాస్త కోలుకుంటున్నట్లుగా కనిపించింది. కానీ సీఎస్కే బౌలర్లు పుంజుకోవడంతో పంజాబ్ బ్యాటర్లు ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయారు. అలా వచ్చి ఇలా పెవిలియన్‌కు క్యూ కట్టారు. దీంతో 78 పరుగులకు పంజాబ్ కింగ్స్ ఏడు వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత సీఎస్కే విజయానికి ఎక్కువసేపు సమయం పట్టదనిపించింది.

PBKS vs CSK Chennai Super Kings Triumph Over Punjab Kings

కానీ పంజాబ్ టెయిలెండర్లు పోరాడారు. ఓటమి అంతరాన్ని తగ్గించారు. హర్‌ప్రీత్ బ్రార్ (17; 13 బంతుల్లో, 2x4), రబాడ (11; 10 బంతుల్లో) అజేయంగా నిలిచి పంజాబ్‌ను ఆలౌట్ కాకుండా కాపాడారు. సీఎస్కే బౌలర్లలో రవీంద్ర జడేజా (3/20) మూడు, సిమర్జీత్ సింగ్ (2/16), తుషార్ దేశ్‌పాండే (2/35) చెరో రెండు వికెట్లు తీశారు.

Story first published: Sunday, May 5, 2024, 19:17 [IST]
Other articles published on May 5, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+