బ్రార్‌ను ముందే సిద్ధం చేశాం..ఏదైతే అనుకున్నామో అదే చేశాడు!గేల్ కెరీర్‌లోనే ఇలా ఆడి ఉండకపోవచ్చు: రాహుల్

అహ్మదాబాద్‌: ఐపీఎల్‌ 14వ సీజన్‌లో తొలి మ్యాచ్‌ ఆడిన పంజాబ్‌ కింగ్స్‌ స్పిన్నర్‌ హర్‌ప్రీత్‌ బ్రార్‌పై ఆ జట్టు సారథి కేఎల్ రాహుల్ ప్రశంసలు కురిపించాడు. బ్రార్‌ను ముందే సిద్ధం చేశామని, అహ్మదాబాద్‌ తరహా పిచ్‌ల్లో ఒక ఫింగర్‌ స్పిన్నర్‌ కావాలనే అతన్ని తీసుకున్నామని రాహుల్ తెలిపాడు. తమ అంచనాలను మించి బ్రార్‌ రాణించాడన్నాడు.

శుక్రవారం నరేంద్ర మోడీ మైదానంలో ఆల్‌రౌండ్‌ షోతో అదరగొట్టిన పంజాబ్‌ 34 పరుగుల తేడాతో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరును చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో రాహుల్‌ (91 నాటౌట్‌; 57 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్స్‌లు) ఇన్నింగ్స్‌ ఓ హైలైట్‌అయితే, బ్రార్‌ బౌలింగ్‌ (3/19) మరో హైలైట్‌.

ఫింగర్‌ స్పిన్నర్‌ కావాలనే తీసుకున్నాం

ఫింగర్‌ స్పిన్నర్‌ కావాలనే తీసుకున్నాం

మ్యాచ్ అనంతరం పంజాబ్‌ కింగ్స్‌ సారథి కేఎల్ రాహుల్ మాట్లాడుతూ... 'మేము బ్రార్‌ను ముందే సిద్ధం చేశాం. ఇలాంటి పిచ్‌లో ఒక ఫింగర్‌ స్పిన్నర్‌ కావాలనే అతన్ని తీసుకున్నాం. ఇక్కడ ఫింగర్‌ స్పిన్నర్లు వేసే లెంగ్త్‌ను ఆడటం చాలా కష్టంగా ఉంటుంది. మేము ఏదైతే అనుకున్నామో బ్రార్‌ అదే చేశాడు. అంతేకాదు చివరికి బ్యాటింగ్ కూడా బాగా చేశాడు. నేను యువ ఆటగాళ్లతో మాట్లాడటానికి ప్రయత్నిస్తున్నా. నా ఐపీఎల్ మరియు అంతర్జాతీయ క్రికెట్ అనుభవాలను వారితో పంచుకుంటున్నా. వారికి అపారమైన ప్రతిభ ఉంది. కానీ వారిని పరిస్థితుల్ని బట్టి ఆడే విధంగా సిద్దం చేయాలి. జట్టును ముందుండి నడిపించడం చాలా ముఖ్యం' అని అన్నాడు.

 గేల్‌ కెరీర్‌లోనే మొదటిసారి కావొచ్చు

గేల్‌ కెరీర్‌లోనే మొదటిసారి కావొచ్చు

'నేను ప్రతి ఆట గెలవడానికి ప్రయత్నిస్తాను. అవకాశం వచ్చినప్పుడు బౌలర్లపై ఒత్తిడి పెంచి భారీ లక్ష్యాలను నిర్ధేశిస్తా. ఈ రోజు అదే చేశా. ప్రతీ గేమ్‌లో సాధ్యమైనంతవరకూ ఏమి చేయాలో అది చేస్తున్నా. క్రిస్ గేల్‌కు ఇంకా ఆడే సత్తా ఉంది. కెప్టెన్‌గా ఆ విషయం నాకు తెలుసు. నేను 7-8 ఏళ్ల నుంచి గేల్‌తో ఆడుతున్నా. రోజు రోజుకీ మెరుగుపడుతూనే ఉన్నాడు. గేల్‌ మూడో స్థానంలో బ్యాటింగ్‌కు రావడం తన కెరీర్‌లోనే చేసి ఉండకపోవచ్చు. కానీ జట్టు కోసం ఇప్పుడు ఆ పని చేస్తున్నాడు. టాపార్డర్‌లో నాకు ఒత్తిడి తగ్గిస్తున్నాడు. జట్టు కోసం ఏదైనా చేస్తాడు గేల్‌' అని రాహుల్ చెప్పాడు.

PBKS vs RCB: మ్యాచ్ టర్నింగ్ పాయింట్.. బెంగళూరును ముంచిన ఆ తప్పిదాలు ఇవే!!

బ్యాటింగ్‌ యూనిట్‌లో విఫలమయ్యాం

బ్యాటింగ్‌ యూనిట్‌లో విఫలమయ్యాం

'పంజాబ్‌ బాగా ఆడింది. మా ప్లాన్‌లు వర్కౌట్‌ కాలేదు. ఎక్కువ చెత్త బంతుల్ని వేయడంతో అవి బౌండరీలుగా వెళ్లాయి. పంజాబ్‌ మంచి స్కోరు చేసింది. ఈ వికెట్‌పై లైన్‌ అండ్‌ లెంగ్త్‌ బాల్స్‌ను హిట్‌ చేయడం కష్టం. మేము భాగస్వామ్యాలు సాధించడం కోసం చూశాం. అలాగే స్టైక్‌రేట్‌ 110 కంటే ఎక్కువ ఉండాలనే కోరుకున్నాం.

మేము బ్యాటింగ్‌ యూనిట్‌లో విఫలమయ్యాం. ఎక్కడైతే మెరుగుపడాలో దానిపై దృష్టి పెడతాం. పాటిదార్‌ను ఫస్ట్‌డౌన్‌లో తీసుకురావాలనేది అందరం కలిసి నిర్ణయం తీసుకున్నాం. పాటిదార్‌ నాణ్యమైన క్రికెటర్‌. మేము 34 పరుగులతో ఓటమి చెందాం. ఓ దశలో 60 నుంచి 65 పరుగుల తేడాతో పరాజయం చెందుతామని అనుకున్నాం. అలా అయితే అది ఇంకా బాధించేది. హర్షల్‌-జెమీసన్‌లు బాగా ఆడారు. ఓటమి అంతరాన్ని తగ్గించారు' అని బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు.

హర్‌ప్రీత్‌ ఆల్‌రౌండ్‌ షో

హర్‌ప్రీత్‌ ఆల్‌రౌండ్‌ షో

ఈ మ్యాచులో కెప్టెన్‌ కేఎల్ రాహుల్‌ (91 నాటౌట్‌; 57 బంతుల్లో 7×4, 5×6), యూనివర్సల్ బాస్ క్రిస్‌ గేల్‌ (46; 24 బంతుల్లో 6×4, 2×6), యువ ఆటగాడు హర్‌ప్రీత్‌ బ్రార్ (25 నాటౌట్‌; 17 బంతుల్లో 1×4, 2×6) చెలరేగడంతో మొదట పంజాబ్‌ 5 వికెట్లకు 179 పరుగులు చేసింది. ఛేదనలో హర్‌ప్రీత్‌ (3/19) స్పిన్‌ మాయలో పడి బెంగళూరు 8 వికెట్లకు 145 పరుగులే చేసి ఓడింది. రవి బిష్ణోయ్‌ (2/17) కూడా అద్భుతంగా బౌలింగ్‌ చేశాడు. విరాట్ కోహ్లీ (35; 34 బంతుల్లో 3×4, 1×6) టాప్‌ స్కోరర్‌.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Saturday, May 1, 2021, 9:34 [IST]
Other articles published on May 1, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X