Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

PBKS Probable Squad For IPL 2022: పంజాబ్‌లోకి అయ్య‌ర్‌, వార్న‌ర్‌, హోల్డ‌ర్‌.. పూర్తి జ‌ట్టు ఇదే

PK Probable Squad For IPL 2022: List of players to be bought by Punjab Kings in Mega Auction

బెంగ‌ళూరు: ఈ శనివారం, ఆదివార‌మే ఐపీఎల్ మెగా వేలం జ‌ర‌గ‌బోతుంది. ఈ నేప‌థ్యంలో ఇప్ప‌టికే జ‌ట్ల‌న్నీ వేలంలో అనుస‌రించాల్సిన వ్యూహాలపై ఓ కొలిక్కి వ‌చ్చాయి. అంతేకాకుండా కొనుగోలు చేయాల‌నుకునే ఆట‌గాళ్ల జాబితాతో పూర్తి జ‌ట్టునే త‌యారు చేసుకుంటున్నాయి. ఈ క్ర‌మంలో ఐపీఎల్‌లో ఇప్ప‌టివ‌ర‌కు ఒక్క‌సారి కూడా టైటిల్ గెల‌వ‌లేక‌పోయిన పంజాబ్ కింగ్స్ కూడా ఆ దిశ‌గా చ‌ర్య‌ల‌ను వేగ‌వంతం చేసింది. అలాగే వేలంలో కొనుగోలు చేయాల‌నుకునే ఆట‌గాళ్ల జాబితాతో ఓ జ‌ట్టునే త‌యారు చేసి పెట్టుకుంద‌ని స‌మాచారం.

రిటెన్ష‌న్ జాబితా

రిటెన్ష‌న్ జాబితా

ఈ సారి మెగా వేలానికి ముందు పంజాబ్ కింగ్స్ గ‌త ఆట‌గాళ్ల‌లో ఇద్ద‌రిని మాత్ర‌మే రిటైన్ చేసుకుంది. మిగ‌తా వాళ్లంద‌రినీ వేలంలోకి వ‌దిలేసింది. ఆ జట్టు రిటైన్ చేసుకున్న ఇద్ద‌రు ఆట‌గాళ్ల‌లో ఒక‌రు మ‌యాంక అగ‌ర్వాల్ కాగా, మ‌రొక‌రు అర్ష్‌దీప్ సింగ్‌గా ఉన్నారు. ఇందుకోసం వీరిద్ద‌రికి పంజాబ్ 16 కోట్ల రూపాయ‌లు చెల్లించ‌నుంది. దీంతో ఆ జ‌ట్టు ద‌గ్గ‌ర ఇంకా 74 కోట్ల రూపాయ‌లు మిగిలి ఉంటాయి. దీంతో ఈ సారి వేలానికి అత్య‌ధిక డ‌బ్బులతో వెళ్తున్న‌ పంజాబ్.. నిఖార్సైనా ఆట‌గాళ్ల‌ను కొనుగోలు చేయాల‌ని భావిస్తోంద‌ని సమాచారం.

కెప్టెన్‌గా అయ్య‌ర్‌

కెప్టెన్‌గా అయ్య‌ర్‌

ఈ సారి త‌మ జ‌ట్టు కెప్టెన్‌గా శ్రేయ‌స్ అయ్య‌ర్‌ను నియ‌మించాల‌ని పంజాబ్ కింగ్స్ నిర్ణ‌యించింద‌ని సమాచారం. అందుకే వేలంలో అయ్య‌ర్‌ను భారీ ధ‌ర పెట్టి కొనుగోలు చేయ‌బోతుంద‌ట‌. అలాగే ఇటీవ‌ల కాలంలో అంత‌ర్జాతీయ క్రికెట్‌లో అద‌ర‌గొడుతున్న వెస్టిండీస్‌ ఆల్‌రౌండ‌ర్‌ జేస‌న్ హోల్డ‌ర్‌, టీమిండియా ఆల్‌రౌండ‌ర్ దీప‌క్ చాహ‌ర్‌ను ఆ జ‌ట్టు వేలంలో కొనుగోలు చేయ‌బోతుంద‌ని స‌మాచారం.

ఓపెన‌ర్లుగా మ‌యాంక్, వార్న‌ర్‌

ఓపెన‌ర్లుగా మ‌యాంక్, వార్న‌ర్‌

ఈ సారి వేలంలో ఆస్ట్రేలియా డ్యాషింగ్ ఓపెన‌ర్ డేవిడ్ వార్న‌ర్‌ను పంజాబ్ కోనుగోలు చేయ‌బోతుంద‌ట‌. ఐపీఎల్‌లో అత్యంత విజ‌య‌వంత‌మైన ఆట‌గాడిగా ఉన్న వార్న‌ర్‌ను ఆ జ‌ట్టు భారీ ధ‌ర వెచ్చించి కొనుగోలు చేయ‌నుంద‌ట‌. మయాంక్ అగ‌ర్వాల్‌, డేవిడ్ వార్న‌ర్‌తో త‌మ ఇన్నింగ్స్‌ను ప్రారంభింప చేయాల‌ని భావిస్తోంద‌ట‌. ఇక మిడిలార్డ‌ర్‌లో దినేశ్ కార్తీక్‌ను కొనుగోలు చేయ‌నుంద‌ని స‌మాచారం. మంచి వికెట్ కీప‌ర్‌గా కార్తీక్‌కు చాలా అనుభ‌వం ఉంది. దీంతో అత‌డిని వికెట్ కీప‌ర్‌గా, మిడిలార్డ‌ర్ బ్యాట‌ర్‌గా వినియోగించుకోవాలని పంజాబ్ చూస్తోంద‌ట‌.

బౌల‌ర్లుగా బౌల్ట్‌, ష‌మీ, అశ్విన్‌

బౌల‌ర్లుగా బౌల్ట్‌, ష‌మీ, అశ్విన్‌

ఇక బౌల‌ర్లుగా న్యూజిలాండ్ స్టార్ పేస‌ర్ ట్రెంట్ బోల్ట్‌, టీమిండియా బౌల‌ర్లు మ‌హ్మ‌ద్ ష‌మీ, ర‌విచంద్ర‌న్ అశ్విన్‌ను కొనుగోలు చేయ‌నుంద‌ట‌. వీరిని లీగ్‌లో త‌మ ప్ర‌ధాన బౌల‌ర్లుగా వినియోగించుకోనుంద‌ని స‌మాచారం. వీరితోపాటు స్పిన్న‌ర్ కుల్దీప్ యాద‌వ్, బంగ్లాదేశ్ పేస‌ర్ ముస్తఫిజ‌ర్ ర‌హ్మాన్‌ను కొనుగోలు చేయ‌నుంద‌ని సమాచారం. అలాగే గ‌త సీజ‌న్లలో ముంబై ఇండియ‌న్స్ త‌ర‌ఫున రాణించిన స్పిన్న‌ర్ రాహుల్ చాహ‌ర్‌ను ఆ జ‌ట్టు కొనుగోలు చేయ‌నుంద‌ని తెలిసింది. అలాగే గ‌తంలో ముంబైకి ప్రాతినిధ్యం వ‌హించిన కృనాల్ పాండ్యాను కూడా ఈ సారి వేలంలో పంజాబ్ కొనుగోలు చేయ‌నుంద‌ని స‌మాచారం.

పాత ఆట‌గాళ్ల‌ను మ‌ళ్లీ కొనుగోలు

పాత ఆట‌గాళ్ల‌ను మ‌ళ్లీ కొనుగోలు

వీరితోపాటు గ‌త సీజ‌న్లో పంజాబ్‌కు ఆడిన వారిలో కొంద‌రిని వేలంలో ఆ జ‌ట్టు మళ్లీ కొనుగోలు చేయ‌నుంద‌ట‌. ఈ జాబితాలో ష‌మీ, షారూక్ ఖాన్, దీప‌క్ హుడా, పూర‌న్‌, సర్ఫ‌రాజ్ ఖాన్‌, జోర్దాన్‌, ఎడెన్ మాక్ర‌మ్ ఉన్నారు. మొత్తం 12 మంది భార‌త ఆట‌గాళ్లు, ఏడుగురు విదేశీ ఆట‌గాళ్ల‌తో జ‌ట్టును త‌యారు చేయాలని పంజాబ్ కింగ్స్ భావిస్తోంద‌ని స‌మాచారం.

పంజాబ్ కింగ్స్ స్క్వాడ్ (అంచ‌నా)

పంజాబ్ కింగ్స్ స్క్వాడ్ (అంచ‌నా)

మ‌యాంక్ అగ‌ర్వాల్, డేవిడ్ వార్న‌ర్‌, శ్రేయ‌స్ అయ్య‌ర్ (కెప్టెన్‌), దినేశ్ కార్తీక్, పూర‌న్‌, సర్ఫ‌రాజ్ ఖాన్‌, షారూక్ ఖాన్, జేస‌న్ హోల్డ‌ర్‌, దీప‌క్ చాహ‌ర్, ర‌వి చంద్ర‌న్ అశ్విన్, కుల్దీప్ యాద్, ముస్త‌ఫిజ‌ర్ ర‌హ్మాన్‌, కృనాల్ పాండ్యా, రాహుల్ చాహ‌ర్‌, మహ్మ‌ద్‌ ష‌మీ, అర్ష్‌దీప్ సింగ్‌, దీప‌క్ హుడా, క్రిస్‌ జోర్దాన్‌, ఎడెన్ మాక్ర‌మ్, బౌల్ట్‌.

Story first published: Tuesday, February 8, 2022, 15:19 [IST]
Other articles published on Feb 8, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+