Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

4ఏళ్ల పాటు బీసీసీఐ ప్రసార హక్కులను పొందిన పేటీఎం

న్యూఢిల్లీ: టీమిండియా క్రికెట్ మ్యాచ్‌ల ప్రసార హక్కులను పేటీఎంకు చెందిన సంస్ధ వన్97 కమ్యూనికేషన్స్ సొంతం చేసుకుంది. వచ్చే నాలుగేళ్ల పాటు ప్రతి మ్యాచ్‌కు రూ. 2.42 కోట్ల చొప్పున ఈ వన్97 కమ్యూనికేషన్స్ సంస్ధ బీసీసీఐకి చెల్లించనుంది.

వన్97 కమ్యూనికేషన్స్‌కు ప్రతి మ్యాచ్‌కు రూ. 2.42 కోట్ల బిడ్‌తో 2019 వరకు ప్రసార హక్కులను కైవసం చేస్తూ బీసీసీఐ మార్కెటింగ్ కమిటీ గురువారం నిర్ణయం తీసుకుంది. దీంతో ఇకపై భారత్‌లో జరగనున్న రంజీ మ్యాచ్‌లు 'పేటీఎం రంజీ ట్రోఫీ'గా జరగనున్నాయి.

2019 వరకు బీసీసీఐ మొత్తం 86 మ్యాచ్‌లు (టెస్టులు, వన్డేలు, టీ20లు) నిర్వహించనుంది. ప్రసార హక్కులను పొందేందుకు గాను బిడ్‌లో మైక్సోమ్యాక్స్, పేటీఎంలు మాత్రమే పాల్గొన్నాయి. అయితే బిడ్‌లో పత్రాలను మైక్సోమ్యాక్స్ సమర్పించకపోవడంతో రద్దు చేశారు.

Story first published: Tuesday, November 14, 2017, 10:02 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+