Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Shane Warne children: మీ లోటు పూడ్చ‌లేనిది.. ఐ ల‌వ్ యూ డాడీ.. తీవ్ర దుఃఖంలో షేన్‌వార్న్ పిల్లలు

Paying tribute to Shane Warne his children became emotional.
Shane Warne మృతి పై Thai Police Investigation..వెలుగులోకి ఆసక్తికర విషయాలు! | Oneindia Telugu

ఆస్ట్రేలియా దిగ్గ‌జ స్పిన్న‌ర్ షేన్ వార్న్ హ‌ఠాన్మ‌ర‌ణం ప్ర‌తి ఒక్క‌రిని క‌ల‌చివేస్తుంది. వార్న్ మ‌ర‌ణంతో ముఖ్యంగా అత‌ని కుటుంబం తీవ్ర దుఃఖంలో మునిగిపోయింది. ఈ క్ర‌మంలో షేన్ వార్న్‌కు నివాళులు అర్పించిన వార్న్ పిల్లలు తీవ్ర భావోద్వేగానికి లోన‌య్యారు. త‌మ తండ్రి లేని లోటు ఎప్ప‌టికీ పూడ్చ‌లేనిదంటూ తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేశారు. షేన్ వార్న్ త‌ల్లిదండ్రులు కూడా తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు. ఈ సంద‌ర్భంగా షేన్ వార్న్ పిల్లలు సోష‌ల్ మీడియాలో విడుద‌ల చేసిన ఓ లేఖ ప్ర‌తి ఒక్క‌రిని భావోద్వేగానికి లోనయ్యేలా చేస్తుంది. కాగా షేన్ వార్న్‌కు ఓ కుమారుడు, ఇద్ద‌రు కుమార్తెలు ఉన్న సంగ‌తి తెలిసిందే.

నాన్నే నాకు బెస్ట్ ఫ్రెండ్‌

నాన్నే నాకు బెస్ట్ ఫ్రెండ్‌

''మా నాన్న లేని లోటు ఎప్పటికీ పూడ్చ‌లేనిది ల‌వ్ యూ డాడీ'' అంటూ షేన్ వార్న్ కుమారుడు జాక్‌స‌న్ తీవ్ర భావోద్వేగానికి లోన‌య్యాడు. త‌న‌ నాన్నే త‌న‌కు బెస్ట్ ఫ్రెండ్ అంటూ చెప్పుకొచ్చాడు. తాను ఎప్పుడూ సంతోషంగా ఉండాల‌ని త‌న తండ్రి కోరుకుంటాడ‌ని, అందుకే తండ్రి లేక‌పోయిన‌ప్ప‌టికీ సంతోషంగా ఉండేందుకు ప్ర‌య‌త్నిస్తాన‌ని చెప్పుకొచ్చాడు. త‌న తండ్రి పోక‌ర్ టేబుల్ ప‌క్క‌న కూర్చొడం, గోల్ఫ్ కోర్స్‌లో వాకింగ్ చేయ‌డం, పిజ్జా తిన‌డం ఇలాంటివ‌న్ని ఇక నుంచి గ‌తంలో మాదిరిగా ఉండ‌బోవంటూ జాక్‌స‌న్ భావోద్వేగానికి లోన‌య్యాడు.

నీ నుంచి అది వార‌స‌త్వంగా వ‌చ్చింది

నీ నుంచి అది వార‌స‌త్వంగా వ‌చ్చింది

త‌న తండ్రిని చాలా మిస్స‌వుతున్నానంటూ షేన్‌వార్న్ పెద్ద కుమార్తె బ్రూక్ తీవ్ర భావోద్వేగానికి లోన‌యింది. ''నిజంగా నువ్వు గొప్ప తండ్రివి నాన్న‌. నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను. జీవితం చాలా క్రూర‌మైంది. నిన్ను త్వ‌ర‌గా తీసుకెళ్లింది'' అంటూ ఆవేదన వ్య‌క్తం చేసింది. తామిద్ద‌రం స‌రాదాగా న‌వ్వుతూ గ‌డిపిన క్ష‌ణాల‌ను ఎప్ప‌టికీ గుర్తు పెట్టుకుంటాన‌ని తెలిపింది. అలాగే త‌న తండ్రి, తాను చాలా విష‌యాల్లో సారూప్య‌త క‌ల్గి ఉన్న‌ట్లు చెప్పింది. తండ్రి నుంచి త‌న‌క‌ది వార‌స‌త్వంగా వ‌చ్చింద‌ని బ్రూక్ చెప్పుకొచ్చింది.

నాన్న అని పిల‌వ‌డం గ‌ర్వంగా ఉంటుంది

నాన్న అని పిల‌వ‌డం గ‌ర్వంగా ఉంటుంది

త‌న తండ్రిని నాన్న అని పిల‌వ‌డం ఎప్పటికీ గ‌ర్వంగా ఉంటుంద‌ని షేన్ వార్న్ చిన్న కూతురు స‌మ్మ‌ర్ చెప్పుకొచ్చింది. త‌న తండ్రిని ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాన‌ని, ఇప్ప‌టికే చాలా మిస్స‌వుతున్నాన‌ని ఆవేద‌న వ్య‌క్తం చేసింది. ''మిమ్మిల్ని గ‌ట్టిగా కౌగిలించుకుని ఆనంధించిన క్ష‌ణాలే నాకు చివ‌రివి అవుతాయ‌ని నేను ఊహించ‌లేదు. మీతో సంతోషంగా గ‌డ‌ప‌డానికి నాకు సెల‌వులు కావాలి. గుడ్ నైట్.. ఐ ల‌వ్ యూ డాడీ అని చెప్పాలి. మీరు మా ప‌క్క‌న ఉంటే మేమంతా సుర‌క్షితంగా ఉంటామ‌నే నమ్మ‌కం ఉటుంది. నువ్వు చ‌నిపోలేదు నాన్న‌. ఇక్క‌డి నుంచి మా హృద‌యంలోకి వెళ్లావు'' అని స‌మ్మ‌ర్ భావోద్వేగానికి లోనైంది.

 గుండెపోటుతో మ‌ర‌ణం

గుండెపోటుతో మ‌ర‌ణం

52 ఏళ్ల షేన్ వార్న్ ఈ నెల 4 గుండెపోటుతో హ‌ఠాన్మ‌ర‌ణం చెందారు. థాయిలాండ్‌లోని ఓ విల్లాలో అచేత‌నంగా ప‌డి ఉన్న వార్న్‌ను బ‌తికించేందుకు స్నేహితులు, వైద్యులు ప‌డిన శ్ర‌మ ఫ‌లించ‌లేదు. దీంతో క్రికెట్ ప్ర‌పంచం ఒక్క‌సారిగా ఉలిక్కిప‌డింది. త‌మ అభిమాన క్రికెట‌ర్ హ‌ఠాన్మ‌ర‌ణాన్ని త‌ట్టుకోలేక‌పోతుంది.

Story first published: Tuesday, March 8, 2022, 20:43 [IST]
Other articles published on Mar 8, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+