3 లక్షల డాలర్లిస్తే: 'మహిళా మసాజ్ థెరపిస్ట్ 'నగ్న' కథ చెబుతా'
హైదరాబాద్: తన ప్రతిష్టను దెబ్బతీసేందుకే తప్పుడు కథనాలు ప్రచురించిందని ఆస్ట్రేలియాకు చెందిన ఫెయిర్ ఫాక్స్ మీడియాపై వెస్టిండిస్ విధ్వంసకర బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్ పరువు నష్టం దావా వేయడం... ఈ కేసులో గేల్‌కు కోర్టు అనుకూలంగా తీర్పునివ్వడం జరిగిన సంగతి తెలిసిందే.
ఈ కేసులో క్రిస్ గేల్ ఓ మహిళా మసాజ్ థెరపిస్ట్‌తో అసభ్యకరంగా ప్రవర్తించినట్లు ఆ మీడియా సంస్థ చేసిన ఆరోపణల్ని కోర్టు కొట్టివేస్తూ ఎన్ఎస్‌డబ్ల్యూ సుప్రీం కోర్టు గేల్‌కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. అయితే ఈ మొత్తం వ్యవహారంలో ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఖర్చు అవుతుందన్నాడు.
ఇందులో సినిమాను తలపించే మలుపులున్నాయని.. అవన్నీ చెప్పాలంటే తనకు కనీసం 3 లక్షల డాలర్లు చెల్లించాలని ట్విట్టర్‌లో ట్వీట్ చేశాడు. ఇది చెప్పేందుకు ప్రత్యేకంగా 60 నిమిషాలు పడుతుందని అన్నాడు. అలా కాదంటే తాను పుస్తకం రాసే వరకు ఎదురు చూడాల్సిందేని క్రిస్ గేల్ పేర్కొన్నాడు.

అసలేం జరిగింది?
2015 వరల్డ్ కప్‌కు ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ దేశాలు సంయుక్తంగా ఆతిథ్యమిచ్చాయి. ఈ వరల్డ్ కప్ సందర్భంగా క్రిస్ గేల్ డ్రస్సింగ్ రూమ్‌లో మహిళా మసాజ్ థెరపిస్ట్ రస్సెల్‌కు తన మర్మాంగాన్ని చూపించి అసభ్యంగా ప్రవర్తించాడని గతేడాది జనవరిలో ఫెయిర్‌ఫాక్స్ మీడియాకు చెందిన పత్రికలు సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్, ద ఏజ్, ద కాన్‌బెర్రా టైమ్స్ వరుస కథనాలు ప్రచురించాయి. ఈ వార్తలపై క్రిస్ గేల్ మసాజ్ థెరపిస్ట్‌తో నేను తప్పుగా ప్రవర్తించలేదని. మీడియాలో వచ్చిన ఆ వార్తలు నన్ను ఎంతగానో బాధించాయని పేర్కొన్నాడు. దీనిపై తాను పోరాడాల్సి ఉందని, ఫెయిర్ ఫాక్స్ మీడియా సంస్ధపై పరువు నష్టం దావా వేశాడు.

ఫెయిర్ ఫాక్స్ మీడియా యాజమాన్యంపై కోర్టు ఆగ్రహం
దీనిపై విచారణ జరిపిన ఎన్‌ఎస్‌డబ్ల్యూ సుప్రీంకోర్టు ఫెయిర్ ఫాక్స్ మీడియా యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టులో ఫెయిర్ ఫాక్స్ మీడియా క్రిస్ గేల్... మహిళా మసాజ్ థెరిపిస్ట్ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడనే దానికి ఆధారాలను కూడా చూపెట్టలేకపోయింది. ‘పాఠకులను ఆకట్టుకునే విధంగా వార్తలు రాస్తున్నారే తప్ప, అందులో ఎంతవరకు నిజం ఉన్నదో అనే దానిపై దృష్టి పెట్టడం లేదు. దేశానికి ప్రాతినిథ్యం వహించే వ్యక్తి పట్ల ఇలా ఎలా రాస్తారు' అని ఆగ్రహం వ్యక్తం చేస్తూ గేల్‌కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది.

ఆ 'నగ్న' కథ చెప్పాలంటే ఖర్చు
'మీకు చెప్పడానికి నాతో ఎంతో ఆసక్తికర కథ ఉంది. అరవై నిమిషాల ఇంటర్వ్యూలో ఆ వివాదాన్ని మీకు వివరిస్తాను. లేకపోతే నా తర్వాతి బుక్ విడుదల చేసే వరకు ఎదురుచూడాల్సిందే. ఆస్ట్రేలియాలో ఏం జరిగింది, నాపై నిషేధం విధించేందుకు కొందరు పెద్ద వ్యక్తులు రంగంలోకి దిగారు. నన్ను ఏ విధంగా బలిపశువును చేయాలని చూశారో ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలో చెబుతాను. సినిమా కథలా చెబుతాను. కనుక ఆ ఇంటర్వ్యూ ఖరీదు అక్షరాలా 3 లక్షల అమెరికన్ డాలర్లు అవుతుందంటూ' మసాజ్ థెరపిస్ట్ తో ఆ రోజు ఏం జరిగింది, ఆ తర్వాత తాను ఎదుర్కొన్న పరిస్తితులపై గేల్ ఈ విధంగా ట్వీట్లలో రాసుకొచ్చాడు.

ఆ రోజు రూమ్‌లో ఏం జరిగిందో చెప్పిన మహిళా మసాజ్ థెరపిస్ట్
మరోవైపు ఈ కేసు విచారణకు హాజరైన మహిళా మసాజ్ థెరపిస్ట్ ఆ రోజు ఛేంజింగ్ రూమ్‌లో ఏం జరిగిందో వివరించింది. 'టవల్ కోసం నేను డ్రెస్ చేంజింగ్ రూమ్‌కు వెళ్లాను. టవల్ కట్టుకొని ఉన్న గేల్ ఎదురుపడ్డాడు. ఏం వెతుకుతున్నావు అని అడిగాడు. టవల్ అని నేను చెప్పాను' అని ఆమె తెలిపింది. 'వెంటనే క్రిస్ గేల్ తన టవల్ విప్పి ఇదేనా అంటూ నగ్నంగా నా ముందు నుంచున్నాడు. ఈ సమయంలో క్రిస్ గేల్ మర్మాంగాన్ని కూడా చూశాను. వెంటనే చూపు తిప్పుకొని క్షమాపణలు చెప్పి అక్కడి నుంచి వచ్చేశాను. వెంటనే వెస్టిండీస్ జట్టు ఫిజియోథెరపిస్ట్‌కు జరిగింది చెప్పి కన్నీరుమున్నీరుగా ఏడ్చేశాను' అని ఆమె కోర్టులో వివరించడం విశేషం.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications