Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

యువకుల వల్లే విజయం: పవార్

Sharad Pawar
న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా గడ్డపై ఆస్ట్రేలియా క్రికెట్ జట్టును ఓడించి ప్రపంచానికి భారత కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తన సత్తాను చాటాడని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బిసిసిఐ) అధ్యక్షుడు శరద్ పవార్ ప్రశంసించారు. సిబీ సిరీస్ ను గెలుచుకున్న భారత వన్డే క్రికెట్ జట్టును బిసిసిఐ గురువారం ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల మైదానంలో సత్కరించింది. తమ క్రికెట్ హీరోలను వీక్షించడానికి పెద్ద యెత్తున ప్రజలు కదలివచ్చారు. ఈ ఏడాది భారత క్రికెట్ కు కలిసి వచ్చిందని, విరాట్ కోహ్లీ నేతృత్వంలోని అండర్ - 19 జట్టు ప్రపంచ కప్ ను గెలుచుకుందని పవార్ చెప్పారు. కొత్తవారికి జట్టులో అవకాశం కల్పించడం వల్ల ఫలితం ఉంటుందని ఈ విజయం ద్వారా రుజువైందని ఆయన అన్నారు. కొత్త వారికి అవకాశం ఇవ్వడం వల్ల జట్టు బలోపేతం అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. క్రికెట్ ఒక క్రీడ అనే విషయం మరిచిపోరాదని, ఇందులో జయాపజయాలు సహజమని, పరాజయం పాలైనా కూడా క్రికెటర్లను ప్రజలు ఇదే ఆదరంతో చూడాలని ఆయన అన్నారు.

ఆస్ట్రేలియాపై విజయాన్ని తమకు చిరకాలం ఒక జ్ఞాపకంగా చేశారని భారత వన్డే క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అన్నారు. తమకు ఇదే విధమైన ఆదరణ లభించాలని కోరుకుంటున్నామని ఆయన చెప్పారు. తాము ఆస్ట్రేలియా పర్యటన గడ్డు స్థితేనని, దాన్ని తాము అధిగమించామని ఆయన చెప్పారు. తాము ఇదే విధంగా ప్రేక్షకులను సంతోషపెట్టడానికి ప్రయత్నిస్తామని ఆయన అన్నారు. అండర్ - 19 ప్రపంచ కప్ విజేతలను ఆయన అభినందించారు. ఢిల్లీ క్రికెట్ అసోయేషన్ అధ్యక్షుడు అరుణ్ జైట్లీ స్వాగతం చెప్పారు.
Story first published: Thursday, March 6, 2008, 17:22 [IST]
Other articles published on Mar 6, 2008
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+