Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐపియల్ బిడ్స్ మా ఫ్యామిలీ పాత్ర లేదు: శరద్ పవార్

Sharad Pawar
హైదరాబాద్: ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన ఐపియల్ వేలంలో ఫ్రాంచైజ్ బిడ్స్ లో తన కుటుంబ సభ్యుల పాత్ర లేదని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శరద్ పవార్ స్పష్టం చేశారు. ఐపియల్ జట్టు బిడ్డింగ్ లో తమ కుటుంబ సభ్యులెవరు కూడా పాల్గొనలేదని ఆయన చెప్పారు. పూణే జట్టు కోసం బిడ్డింగ్ లో పాల్గొన్న కన్ స్ట్రక్షన్ కంపెనీ సిటీ కార్పొరేషన్ లో పవార్ కుటుంబ సభ్యులకు 33.6 లక్షల వాటా ఉన్నట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో పవార్ శుక్రవారం మీడియాతో మాట్లాడారు.

బిడ్డింగ్ తో సిటీ కార్పొరేషన్ కు ఏ విధమైన సంబంధం లేదని ఆయన చెప్పారు. ఎంసిఎ, ఇతర కంపెనీల సహకారంతో దేశ్ పాండే పూణే జట్టు వేలంలో పాల్గొన్నట్లు ఆయన తెలిపారు.
Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+