Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

టాపార్డర్ కుప్పకూలుతుంటే నిలబడింది పూజారా ఒక్కడే!!

Patient Cheteshwar Pujara shows Indian teammates how it’s done in Adelaide Test

అడిలైడ్‌: టెస్టు సిరీస్‌లో మనోళ్లు సత్తా చాటుతారని ఊహించిన క్రీడాభిమానులంతా క్షణాల్లో నిరుత్సాహానికి గురైయ్యారు. మ్యాచ్ ఆరంభమైన రెండో ఓవర్లోనే రెండు పరుగులు చేసి తొలి వికెట్ కోల్పోయింది టీమిండియా. ఇలా మొదటి ఇన్నింగ్స్‌లో వరుస వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ భారత జట్టును చతేశ్వర పుజారా ఆదుకున్నాడు. కీలక సమయంలో క్రీజులో నిలదొక్కుకుపోయి తన మార్క్ ఆటతీరుతో హాఫ్‌ సెంచరీ సాధించాడు. 153 బంతుల్లో 4 ఫోర్ల సాయంతో పుజారా హాఫ్ సెంచరీని నమోదు చేశాడు.

టాపార్డర్ కుప్పుకూలుతున్న సమయంలో

టాపార్డర్ కుప్పుకూలుతున్న సమయంలో

ఈ క్రమంలోనే భారత్‌ స్కోరును 190 పరుగులు దాటించాడు. ఆసీస్‌ బౌలర్ల నుంచి దూసుకొచ్చిన పదునైన బంతులకు ఎదురొడ్డి నిలబడ్డ పుజారా మరొకసారి జట్టుకు ఆసరాగా నిలిచాడు. ఇది పుజారా కెరీర్‌లో 20వ టెస్టు హాఫ్‌ సెంచరీ. టాస్‌ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా 127 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి చిక్కుల్లో పడింది. లోకేష్‌ రాహుల్‌ (2), మురళీ విజయ్‌ (11), విరాట్‌ కోహ్లీ (3), అజింక్యా రహానె(13), రోహిత్‌ శర్మ(37), రిషబ్‌ పంత్‌(25)లు చేతులెత్తేసి పెవిలియన్‌కు చేరారు.

కాసేపటి వరకూ కాపాడిన రోహిత్-పంత్

కాసేపటి వరకూ కాపాడిన రోహిత్-పంత్

41 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి సతమతమవుతోన్న తరుణంలో రోహిత్‌-పంత్‌లు వికెట్ల పతనాన్ని కాసేపు ఆపగలిగారు. ఆపై వీరిద్దరూ సైతం వెనుదిరగడంతో టీమిండియా మరింత కష్టాల్లోకి వెళ్లింది. టీమిండియా కోల్పోయిన ఆరు వికెట్లలో హాజిల్‌వుడ్‌, నాథన్‌ లియాన్‌లు తలో రెండు వికెట్లు సాధించగా, స్టార్క్‌, కమిన్స్‌ చెరో వికెట్‌ దక్కించుకున్నారు. ఆసీ​స్‌ బౌలర్ల ధాటికి టీమిండియా టాప్‌ ఆర్డర్‌ కుప్పకూలింది.

 ఆరంభంలోనే చతికిలబడ్డ భారత్:

ఆరంభంలోనే చతికిలబడ్డ భారత్:

కంగారూ బౌలర్లు పదునైన బంతులు సంధించడంతో టీమిండియా త్వరగా వికెట్లు నష్టపోయింది. 15 పరుగుల​కే ఓపెనర్లు రాహుల్‌, విజయ్‌ పెవిలియన్‌కు చేరారు. తర్వాత వచ్చిన కెప్టెన్‌ కోహ్లి వెంటనే అవుటయ్యాడు. రహానే కూడా తక్కువ స్కోరుకే పెవిలియన్‌ చేరాడు. టెస్ట్‌ స్పెషలిస్ట్‌ పుజారా, రోహిత్‌తో కలిసి కాసేపు పోరాడాడు. ఈ జోడిని లియాన్‌ విడదీశాడు. క్రీజులో కుదురుకుంటున్న రోహిత్‌ను పెవిలియన్‌ను పంపాడు.

కుదురుకున్న పూజారా-అశ్విన్‌ల భాగస్వామ్యం

కుదురుకున్న పూజారా-అశ్విన్‌ల భాగస్వామ్యం

ఆపై కాసేపటికి రిషబ్‌ పంత్‌ను కూడా లియాన్‌ ఔట్‌ చేసి భారత్‌కు మరో షాకిచ్చాడు. వారిద్దరి జోడి అనంతరం పుజారా-అశ్విన్‌ నిలదొక్కుకోగా టీమిండియా 189 పరుగులు చేయగలిగింది. పూజారా 25పరుగులతో కమిన్స్ బౌలింగ్‌లో క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం పూజారా(75), ఇషాంత్ శర్మ(4)పరుగులతో క్రీజులో ఉన్నారు.

1
43623
Story first published: Thursday, December 6, 2018, 12:37 [IST]
Other articles published on Dec 6, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+