యూసుఫ్ పఠాన్ సెంచరీ వృధా, భారత్ ఓటమి: సిరీస్ దక్షిణాఫ్రికాకు

రోహిత్ (5) మరోసారి నిర్లక్ష్యం ప్రదర్శించాడు. కోహ్లి (2) ఫామ్ కొనసాగించలేకపోయాడు. ధోనీ (5), యువరాజ్ (8) వైఫల్యాన్ని కొనసాగించారు. బాగా ఆడుతున్న పార్థివ్ (38; 34 బంతుల్లో 6X4) కూడా పెవిలియన్ చేరాడు. 60 పరుగులకే సగం మంది పెవిలియన్‌కు. అప్పుడొచ్చాడు క్రీజులోకి యూసుఫ్. అతని ముందే మరో ముగ్గురు పెవిలియన్ చేరారు. రైనా (11), హర్భజన్ (13), పియూష్ చావ్లా (8) క్రీజులో నిలవలేకపోయారు. 119కి 8 వికెట్లు. ఇన్నింగ్స్ ముగియడానికి మరెంతో సమయం పట్టదనిపించింది. ఐతే జహీర్ అండతో యూసుఫ్ ఒక్కసారిగా చెలరేగిపోయాడు. భారీ షాట్లతో దక్షిణాఫ్రికా బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ప్లెసిస్ వేసిన 25వ ఓవర్లో 6, 4.. మోర్కెల్ వేసిన 29వ ఓవర్లో 6, 4.. రాబిన్ పీటర్సన్ వేసిన 30వ ఓవర్లో మరో సిక్స్.. కొట్టాడు. మెరుపు వేగంతో అర్ధశతకం పూర్తి చేసిన యూసుఫ్ కాసేపు విరామమిచ్చాడు. 34వ ఓవర్లో మళ్లీ విధ్వంసం మొదలైంది. బోథా బౌలింగ్‌లో రెండు సిక్సర్లు. తర్వాతి ఓవర్లో విశ్వరూపమే. రెండు సిక్సర్లు, రెండు ఫోర్లు. 68 బంతుల్లోనే 7 ఫోర్లు, 8 సిక్సర్లతో అతని శతకం పూర్తయింది. ఎనిమిదో వికెట్ పడే సమయానికి 140 బంతుల్లో 149 పరుగులు చేయాల్సిన టీమ్ ఇండియా.. 66 బంతుల్లో 51 పరుగులు అవసరమైన స్థితికి చేరుకుంది. ఐతే 36వ ఓవర్లో బంతి అందుకున్న మోర్కెల్ భారత్ ఆశలపై నీళ్లు చల్లాడు. అతని బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించిన యూసుఫ్.. ప్లెసిస్‌కు క్యాచ్ ఇచ్చాడు. దీంతో సంచలన ఇన్నింగ్స్‌కు తెరపడింది. తర్వాత మునాఫ్ (4 నాటౌట్)తో కలిసి కాసేపు పోరాడిన జహీర్ (24; 58 బంతుల్లో 3X4) సొత్సొబె బౌలింగ్‌లో ఔటవడంతో భారత ఇన్నింగ్స్ ముగిసింది.
భారత బౌలర్లకు కొరకరాని కొయ్యలా తయారైన ఆమ్లా మరోసారి రెచ్చిపోయాడు. అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తూ భారత్‌పై వన్డేల్లో తొలి శతకం సాధించాడు. స్మిత్ (7) మళ్లీ తడబడి జహీర్‌కు వికెట్ సమర్పించుకుంటే ఆమ్లా అలవాటైన తీరులో స్వేచ్ఛగా పరుగులు సాధిస్తూ పోయాడు. అతనికి వాన్‌విక్ నుంచి చక్కటి సహకారమందింది. ఈ జోడీ రెండో వికెట్‌కు 97 పరుగులు జోడించింది. ఐతే యువరాజ్ సింగ్ స్వల్ప వ్యవధిలో రెండు కీలక వికెట్లు పడగొట్టి, భారత్‌ను పోటీలోకి తెచ్చాడు. వాన్‌విక్ (56; 63 బంతుల్లో 8X4) క్యాచ్‌ను యువీ ఎడమ చేత్తో అందుకున్నాడు. కాసేపటికే డివిలియర్స్ (11)నూ పెవిలియన్ చేర్చాడు. మ్యాచ్ భారత్ చేతుల్లోకి వస్తున్న దశలో ఆమ్లా అడ్డుకట్టలా నిలిచాడు. డుమిని (35; 44 బంతుల్లో 1X4)తో సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పాడు. సెంచరీ కూడా పూర్తి చేశాడు. దక్షిణాఫ్రికా 42 ఓవర్లలో 226/3తో ఉన్న దశలో వరుణుడు అంతరాయం కలిగించాడు. దీంతో అంపైర్లు మ్యాచ్‌ను 46 ఓవర్లకు కుదించారు. ఆట తిరిగి మొదలయ్యాక దక్షిణాఫ్రికా టపటపా వికెట్లు కోల్పోయింది. మునాఫ్ వరుసగా డుమిని, ప్లెసిస్ (8), బోథా (2)లను పెవిలియన్ చేర్చాడు. పీటర్సన్ (4)ను జహీర్ బౌల్డ్ చేయగా.. స్టెయిన్ (0), మోర్కెల్ (0) రనౌటయ్యారు.
దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: స్మిత్ (సి) యూసుఫ్ పఠాన్ (బి) జహీర్ 7; ఆమ్లా నాటౌట్ 116; వాన్‌విక్ (సి) అండ్ (బి) యువరాజ్ 56; డివిలియర్స్ (స్టంప్డ్) ధోనీ (బి) యువరాజ్ 11; డుమిని (సి) అండ్ (బి) మునాఫ్ 35; ప్లెసిస్ (బి) మునాఫ్ 8; బోథా (సి) ధోనీ (బి) మునాఫ్ 2; పీటర్సన్ (బి) జహీర్ 4; స్టెయిన్ రనౌట్ 0; మోర్నీ మోర్కెల్ రనౌట్ 0; సొత్సొబె నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు 11 మొత్తం (46 ఓవర్లలో 9 వికెట్లకు) 250; వికెట్ల పతనం: 1-16, 2-113, 3-129, 4-231, 5-242, 6-244, 7-250, 8-250, 9-250
బౌలింగ్: జహీర్ 9-1-47-2; మునాఫ్ 8-0-50-3; చావ్లా 7-0-32-0; హర్భజన్ 8-0-33-0; యూసుఫ్ పఠాన్ 2-0-10-0; యువరాజ్ 8-0-45-2; రోహిత్ 2-0-14-0; రైనా 2-0-13-0
భారత్ ఇన్నింగ్స్: పార్థివ్ (సి) ప్లెసిస్ (బి) మోర్కెల్ 38; రోహిత్ (బి) సొత్సొబె 5; కోహ్లి (సి) డివిలియర్స్ (బి) మోర్కెల్ 2; ధోనీ (సి) స్మిత్ (బి) మోర్కెల్ 5; యువరాజ్ (సి) డుమిని (బి) స్టెయిన్ 8; రైనా (సి) మోర్కెల్ (బి) స్టెయిన్ 11; యూసుఫ్ పఠాన్ (సి) ప్లెసిస్ (బి) మోర్కెల్ 105; హర్భజన్ (సి) డుమిని (బి) బోథా 13; చావ్లా (బి) పీటర్సన్ 8; జహీర్ (సి) మోర్కెల్ (బి) సొత్సొబె 24; మునాఫ్ నాటౌట్ 4; ఎక్స్‌ట్రాలు 11 మొత్తం (40.2 ఓవర్లలో ఆలౌట్) 234;వికెట్ల పతనం: 1-21, 2-31, 3-45, 4-60, 5-60, 6-74, 7-98, 8-119, 9-219
బౌలింగ్: స్టెయిన్ 9-1-32-2; సొత్సొబె 7.2-0-57-2; మోర్నీ మోర్కెల్ 8-0-52-4; బోథా 8-0-33-1; రాబిన్ పీటర్సన్ 7-0-45-1; ప్లెసిస్ 1-0-13-0
Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications