Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ: యూసఫ్‌ పఠాన్‌ స్టన్నింగ్ క్యాచ్ చూశారా? (వీడియో)

‘Pathan k hath hai thakur’: Rashid Khan stunned by Yusuf Pathan’s blinder

హైదరాబాద్: సయ్యద్‌ ముస్తాక్‌ ఆలీ ట్రోఫీ టీ20లో టీమిండియా వెటరన్ క్రికెటర్ యూసఫ్‌ పఠాన్‌ ఓ అద్భుతమైన క్యాచ్‌ పట్టి మళ్లీ వార్తల్లో నిలిచాడు. ఈ టోర్నీలో బరోడా తరఫున ఆడుతున్న యూసఫ్‌ శుక్రవారం గోవాతో జరిగిన మ్యాచ్‌లో ఓ అద్భుతమైన క్యాచ్ పట్టి అభిమానులను అలరించాడు.

గోవా కెప్టెన్‌ దర్శన్‌ మిశాల్‌ కవర్స్‌ మీదుగా ఆడిన షాట్‌ని ఆ సమయంలో అక్కడే ఫీల్డింగ్‌ చేస్తున్న యూసఫ్‌ పఠాన్ ఒక్కసారిగా గాల్లోకి అమాంతం ఎగిరి అందుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోని ఇర్ఫాన్ పఠాన్ తన ట్విట్టర్‌లో పోస్టు చేయగా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ మ్యాచ్‌లో గోవా 4 వికెట్ల తేడాతో గెలిచింది. బరోడా నిర్దేశించిన 150 పరుగుల విజయ లక్ష్యాన్ని గోవా 19.4 ఓవర్లలో ఛేదించడం విశేషం. కాగా, ఈ మ్యాచ్‌లో యూసఫ్ పఠాన్ రెండు బంతులు ఆడి డకౌట్‌గా వెనుదిరిగాడు.

కాగా, 2012లో చివరిసారి టీమిండియా తరఫున యూసఫ్‌ పఠాన్‌ ఆడాడు. ప్రస్తుతం దేశవాళీ టోర్నీల్లో బరోడా జట్టు తరుపున బరిలోకి దిగుతున్నాడు. ఇదిలా ఉంటే, ఇర్ఫాన్ పఠాన్ పోస్టు చేసిన వీడియోపై ఆప్ఘనిస్థాన్ క్రికెటర్ రషీద్ ఖాన్ ట్విట్టర్ వేదికగా స్పధించాడు. అదొక అద్భుతమైన క్యాచ్‌ అంటూ కొనియాడాడు.

Story first published: Saturday, November 9, 2019, 11:04 [IST]
Other articles published on Nov 9, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+