Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అలెన్ బోర్డర్ అవార్డుకి ఎంపికైన ఆసీస్ పేసర్ పాట్ కమిన్స్

Pat Cummins wins Allan Border Medal

హైదరాబాద్: ఆస్ట్రేలియా స్టార్ పేసర్ పాట్‌ కమిన్స్‌‍‌‌‌కు ప్రతిష్టాత్మక అలెన్‌ బోర్డర్‌ పతకం లభించింది. ఆస్ట్రేలియా వార్షిక జాతీయ క్రీడా అవార్డుల కార్యక్రమంలో కమిన్స్‌ ఉత్తమ పురుష క్రికెటర్‌గా అలెన్‌ బోర్డర్‌ అవార్డును గెలుచుకున్నాడు. ఏడేళ్ల క్రితం ఆస్ట్రేలియా జాతీయ జట్టులోకి అరంగేట్రం చేసిన పాట్ కమిన్స్‌ ప్రధాన పేసర్‌గా ఎదిగాడు. గాయాలు పాలైనా పునరాగమం చేసి సత్తా చాటాడు. తాజాగా భారత్‌తో టెస్టు సిరీస్‌లోనూ కమిన్స్‌ ఆకట్టుకున్నాడు.

2014లో మిచెల్‌ జాన్సన్‌ తర్వాత

2014లో మిచెల్‌ జాన్సన్‌ తర్వాత అలెన్‌ బోర్డర్‌ పతకం అందుకున్న బౌలర్‌గా కమిన్స్‌ అరుదైన ఘనత సాధించాడు. మహిళల క్రికెట్లో అలిస్సా హీలీ ఉత్తమ మహిళా క్రికెటర్‌గా బెలిండా క్లార్క్‌ అవార్డుని అందుకుంది. ఈ అవార్డుతో పాటు అలిస్సా వన్డే ఇంటర్నేషనల్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది ఇయర్‌, టీ20 ఇంటర్నేషనల్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డులను కూడా సొంతం చేసుకుంది.

ఈ ఏడాది ఉత్తమ టీ20 ఆటగాడిగా గ్లెన్‌ మాక్స్‌వెల్‌

గ్లెన్‌ మాక్స్‌వెల్‌ ఈ ఏడాది ఉత్తమ టీ20 ఆటగాడిగా, మాథ్యూ వేడ్‌ ఉత్తమ దేశవాళీ ఆటగాడిగా అవార్డులు దక్కించుకున్నారు. ఇక, టెస్ట్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది ఇయర్‌గా లియాన్‌, వన్డే ఇంటర్నేషనల్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది ఇయర్‌గా మార్కస్‌ స్టొయినిస్‌ దక్కించుకున్నారు.

దేళవాళీ ప్లేయర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ (ఉమెన్‌)గా హీదర్‌ గ్రాహమ్‌

దేళవాళీ ప్లేయర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ (ఉమెన్‌)గా హీదర్‌ గ్రాహమ్‌, బ్రాడ్‌మన్‌ యంగ్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది ఇయర్‌గా విల్‌ పుకోవ్‌స్కి, బెట్టి విల్సన్‌ యంగ్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది ఇయర్‌గా జార్జియా వారెమ్‌, కమ్యూనిటీ చాంపియన్‌గా మోజెస్‌ హెన్రిక్స్‌ ఎంపికయ్యారు.

Story first published: Tuesday, February 12, 2019, 12:17 [IST]
Other articles published on Feb 12, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+