Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సన్‌రైజర్స్‌‌ మాస్టర్ ప్లాన్.. ఈసారి నిరుడు లెక్కుండదు- గవాస్కర్

మరికొన్ని వారాల్లో ఐపీఎల్-2024 సీజన్ ప్రారంభం కానుంది. ప్రపంచ నంబర్ వన్ టీ20 లీగ్ అయిన ఐపీఎల్‌లో ఏ జట్టును తక్కువగా అంచనా వేయలేం. ప్రతి టీమ్ ఫేవరేట్‌గానే బరిలోకి దిగుతుంది. అయితే గత మూడు సీజన్లలో సన్‌రైజర్స్ హైదరాబాద్ నిరాశపరిచింది. పేలవమైన ఆటతో ప్లేఆఫ్స్‌కు చేరలేకపోయింది. కానీ ఈ సారి సన్‌రైజర్స్ సత్తాచాటుతుంది దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు.

ఐపీఎల్ వేలంలో SRH యాజమాన్యం తెలివిగా వ్యవహరించదని గవాస్కర్ కొనియాడు. ప్యాట్ కమిన్స్ ఎంపిక పదునైన వ్యూహమని అన్నాడు. ''ప్యాట్ కమిన్స్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ కొనుగోలుచేయడం తెలివైన ప్రణాళికగా భావిస్తాను. అయితే అతడి కోసం కాస్త ఎక్కువగానే ఖర్చు పెట్టారు. కానీ కమిన్స్ దక్కించుకోవడం మంచి ప్లాన్. అతడు జట్టును నాయకుడిగా నడిపించగలడు''

Pat Cummins was a smart buy that will make a huge difference- Sunil Gavaskar

''గతంలో ఎస్‌ఆర్‌హెచ్ కెప్టెన్సీలో కొన్ని సమస్యలు ఉండేవి. కీలక మ్యాచ్‌ల్లో వాళ్లు బౌలింగ్ ఆప్షన్స్‌ను మార్చడం ఆ జట్టుకు చేటు చేసింది. మ్యాచ్‌లను కోల్పోయింది. కానీ ఇప్పుడు కమిన్స్ జట్టులోకి వచ్చాడు. అతడికి కెప్టెన్సీ పగ్గాలు ఇస్తారని భావిస్తున్నా. అలా చేస్తే జట్టుకు ఎంతో సానుకూలంగా ఉంటుంది'' అని సునీల్ గవాస్కర్ పేర్కొన్నాడు.

గతేడాది డిసెంబర్‌లో జరిగిన ఐపీఎల్ మినీ వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ కీలక ఆటగాళ్లను కొనుగోలు చేసింది. ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ కోసం రూ. 20.50 కోట్లు వెచ్చించింది. బౌలర్, కెప్టెన్‌గానే కాకుండా బ్యాటుతోనే సత్తాచాటే సామర్థ్యం కమిన్స్‌కు ఉంది. కమిన్స్‌తో పాటు మరో ఆస్ట్రేలియా ప్లేయర్ ట్రేవిస్ హెడ్‌ను కూడా రూ.6.80 కోట్లకు దక్కించుకుంది. అలాగే శ్రీలంక స్టార్ స్పిన్నర్ హసరంగను సన్‌రైజర్స్ తక్కువ ధరకే సొంతం చేసుకుంది. రూ.1.50 కోట్లకు కొనుగోలు చేసింది.

వేలంలో సన్‌రైజర్స్ కొనుగోలు చేసిన ప్లేయర్లు:
ప్యాట్ కమిన్స్‌ (రూ. 20.50 కోట్లు), ట్రేవిస్‌ హెడ్‌ (రూ. 6.80 కోట్లు), జయదేవ్‌ ఉనద్కత్‌ (రూ. 1.60 కోట్లు), హసరంగ (రూ. 1.50 కోట్లు), జాతవేద్‌ సుబ్రమణ్యన్‌ (రూ. 20 లక్షలు), ఆకాశ్‌ సింగ్‌ (రూ. 20 లక్షలు)

సన్‌రైజర్స్ హైదరాబాద్ పూర్తి జట్టు:
అబ్దుల్ సమద్, ఎయిడెన్ మార్క్‌రమ్, రాహుల్ త్రిపాఠి, గ్లేన్ ఫిలిప్స్, హెన్రీచ్ క్లాసెన్, మయాంక్ అగర్వాల్, అన్‌మోల్ ప్రీత్ సింగ్, ఉపేంద్ర సింగ్ యాదవ్, నితీష్ కుమార్ రెడ్డి, షెహ్‌బాజ్ అహ్మద్, అభిషేక్ శర్మ, మార్కో జాన్సెన్, వాషింగ్టన్ సుందర్, సన్వీర్ సింగ్, భువనేశ్వర్ కుమార్, టీ నటరాజన్, మయాంక్ మార్కండే, ఉమ్రాన్ మాలిక్, ఫజలక్ ఫరూఖీ, ట్రేవిస్ హెడ్, హసరంగ, ప్యాట్ కమిన్స్, జయదేవ్ ఉనద్కత్, ఆకాశ్ సింగ్, జాతవేద్ సుబ్రమణ్యన్

Story first published: Tuesday, February 13, 2024, 15:00 [IST]
Other articles published on Feb 13, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+