INDvsAUS : స్పిన్నర్ల ఎంపికపై ఆసీస్ కెప్టెన్ కీలక వ్యాఖ్యలు!

భారత జట్టుతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం ఆస్ట్రేలియా రెడీ అవుతోంది. ఈ క్రమంలోనే ఆస్ట్రేలియా సారధి ప్యాట్ కమిన్స్ కీలక వ్యాఖ్యలు చేశాడు. భారత్‌లో సిరీస్ అనగానే అందరూ ఎక్కువగా స్పిన్నర్లే ప్రభావం చూపుతారని అనుకుంటారని కమిన్స్ చెప్పాడు.

టెస్టు క్రికెట్ చాలా కష్టం..
అలాగే మ్యాచులు చాలా టైట్‌గా జరుగుతాయని వివరించాడు. కానీ భారత్‌లో కూడా పేసర్లు చాలా కీలకం కాబోతున్నారని కమిన్స్ వెల్లడించాడు. 'టెస్టు క్రికెట్ చాలా చాలా కష్టమైంది. ఇది కూడా ఒక మంచి అనుభవం. ఒక్కోసారి మ్యాచులు చాలా కష్టంగా ఉంటాయని అర్థం చేసుకోవాలి. ఈ ఛాలెంజ్ ఎదుర్కోవడానికి రెడీ అవ్వాలి. భారత్‌కు వస్తే ఎక్కువగా స్పిన్ వికెట్ల గురించి చర్చ జరుగుతుంది. అలాగే టెస్టు మ్యాచులు చాలా వేగంగా మారిపోతాయి. కానీ ఎప్పుడూ అదే కరెక్ట్ కాదు' అని కమిన్స్ తెలిపాడు.

దాన్ని బాగా ఎంజాయ్ చేశా..
2011లో తొలి టెస్టు ఆడిన ప్యాట్ కమిన్స్.. ఆ తర్వాత ఆటకు దూరమయ్యాడు. తన రెండో మ్యాచును 2017లో ఆడాడు. ఇది కూడా ఛాలెంజ్ అని చెప్పిన కమిన్స్.. 'ఈ సమయంలో నా గురించి నాకు కొన్ని విషయాలు తెలిశాయి. ఆరేళ్లలో అది నా తొలి టెస్టు. దాంతో నేను ఎక్కడ ఉండాలో ఒక గ్యారంటీ ఉంది. అలాగే ఒక్కోసారి ఎన్ని ఓవర్లు వేసినా ఎలాంటి రివార్డు ఉండదు. కానీ అన్ని ఓవర్లు వేసి ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచడమే లక్ష్యం కావాలి. జట్టు కోసం ఆ పని చేయాల్సి వస్తుంది. చివరి టూర్‌లో అదే జరిగింది. ఈ అంశాన్ని బాగా ఎంజాయ్ చేశా కూడా' అని కమిన్స్ వివరించాడు.

స్పిన్నర్లు గ్యారంటీ కాదు..
అలాగే భారత్‌లో టెస్టు మ్యాచ్ అనగానే ఇద్దరు స్పిన్నర్లతో బరిలో దిగుతామని అనుకుంటే పొరపాటేనని చెప్పాడు. పిచ్, పరిస్థితులను బట్టి జట్టులో మార్పులు ఉంటాయని, వాటి ఆధారంగానే జట్టును ఎంపిక చేసుకుంటామని తెలిపాడు. 'ఇద్దరు స్పిన్నర్లు ఆడటం గ్యారంటీ అని చెప్పను. ఇది అక్కడి పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా తొలి టెస్టులో.. నాగ్‌పూర్ చేరుకున్న తర్వాత దీని గురించి ఆలోచిస్తాం. ఒక్కోసారి ఇలా స్పిన్నర్లపై ఫోకస్ పెట్టి.. ఎలాంటి పరిస్థితుల్లో అయినా క్వాలిటీ పేసర్లు ఎంత గొప్పగా ఆడారో మర్చిపోతాం. అది కరెక్ట్ కాదు' అని చెప్పాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications