Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆరెంజ్ ఆర్మీకి బిగ్ షాక్: ప్యాట్ కమిన్స్ సంచలన నిర్ణయం!

ఐపీఎల్ 2026 ముగిసిన వెంటనే అన్ని ఫ్రాంచైజీలు ఇప్పటికే తదుపరి సీజన్ కోసం తమ ప్రణాళికలను సిద్ధం చేసుకోవడం ప్రారంభించాయి. అయితే ఈ లోపే సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు భారీ షాక్ తగిలే సూచనలు కనిపిస్తున్నాయి. ఎస్ఆర్‌హెచ్ కెప్టెన్, ఆస్ట్రేలియా స్టార్ పేసర్ ప్యాట్ కమిన్స్ ఐపీఎల్ 2027 సీజన్ నుంచి తప్పుకునే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై ప్యాట్ కమిన్స్ స్వయంగా చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకు 2027 అత్యంత కీలకం కానుంది. ఆ జట్టు షెడ్యూల్ ఎంతో బిజీగా సాగనుంది. ఈ ఏడాది ఆస్ట్రేలియా జట్టు ప్రతిష్టాత్మకమైన యాషెస్ సిరీస్, బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ, వన్డే ప్రపంచకప్ 2027 ఆడాల్సి ఉంది. ఒకవేళ వారు పాయింట్ల పట్టికలో నిలిస్తే ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ కూడా ఇదే ఏడాది జరగనుంది. ఆస్ట్రేలియా టెస్ట్, వన్డే జట్లకు కెప్టెన్‌గా ఉన్న ప్యాట్ కమిన్స్.. దేశం తరఫున ఈ పెద్ద టోర్నమెంట్లన్నింటికీ అందుబాటులో ఉండటం కోసం ఐపీఎల్ 2027కు దూరం కావాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం.

Pat Cummins Sunrisers Hyderabad Shock Will Australian Captain Skip IPL 2027 For Ashes and World Cup

ఈ విషయం గురించి 'ది ఏజ్' పత్రికతో ప్యాట్ కమిన్స్ మాట్లాడుతూ.. "వచ్చే ఏడాది ఏదో ఒక దశలో నేను ఖచ్చితంగా ఒక టోర్నీకి దూరం కావాల్సి ఉంటుంది. అయితే అది దేశం తరఫున ఆడే టెస్ట్ మ్యాచ్‌లు లేదా వన్డే ప్రపంచకప్ మాత్రం కాదని స్పష్టం చేయగలను. సమయం వచ్చినప్పుడు నేను నా ఐపీఎల్ ఫ్రాంచైజీతో మాట్లాడి సరైన నిర్ణయం తీసుకుంటాను. ప్రస్తుతానికైతే నేనేమీ కన్ఫర్మ్ చేయలేను, ఎందుకంటే పరిస్థితులు మారవచ్చు లేదా గాయాల బారిన పడవచ్చు" అని కమిన్స్ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.

భారత్‌తో జరిగే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ, యాషెస్, వన్డే వరల్డ్ కప్‌లలో అన్ని మ్యాచ్‌లు ఆడటమే తన మొదటి ప్రాధాన్యత అని కమిన్స్ పేర్కొన్నారు. ఒకవేళ భారత్‌తో అన్ని మ్యాచ్‌లు ఆడితే, ఆ వెంటనే జరిగే కఠినమైన యాషెస్ సిరీస్ కంటే ముందు తన శరీరానికి కొంత విశ్రాంతి అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. ఒకవేళ ప్యాట్ కమిన్స్ ఐపీఎల్ 2027 సీజన్‌కు పూర్తిగా దూరమైతే, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు సారథ్య బాధ్యతలను వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్‌కు అప్పగించే అవకాశం ఉంది. ఐపీఎల్ 2026 సీజన్‌ ప్రారంభంలో కూడా కమిన్స్ అందుబాటులో లేని కొన్ని మ్యాచ్‌లలో ఇషాన్ కిషనే ఎస్‌ఆర్‌హెచ్‌ జట్టును ముందుండి నడిపించిన సంగతి తెలిసిందే.

Story first published: Wednesday, June 3, 2026, 14:59 [IST]
Other articles published on Jun 3, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+