Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

జాక్ పాట్ కొట్టిన ప్యాట్ కమిన్స్‌: 66 కోట్లతో డీల్..?

ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు (CA) తమ జట్టు కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌కు ఏడాదికి సుమారు 22 కోట్ల రూపాయల భారీ కాంట్రాక్టును ఆఫర్ చేసింది. ఐపీఎల్ వంటి ఫ్రాంచైజీ లీగ్‌ల వైపు వెళ్లకుండా అడ్డుకోవడమే ఈ భారీ ఆఫర్ వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశ్యం. ఒకవేళ ఈ ఒప్పందం కుదిరితే 2029 వరకు కమిన్స్ మొత్తం 66 కోట్ల రూపాయల వరకు సంపాదిస్తారు. రాబోయే ఏడాదిలో ఆస్ట్రేలియా ఏకంగా 21 టెస్ట్ మ్యాచ్‌లు ఆడాల్సి ఉన్నందున కమిన్స్‌పై పెరిగే భారాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ డీల్‌ను ప్రతిపాదించారు.

నేను తప్పు చేసిన మాట నిజమే: డేవిడ్ వార్నర్ సంచలనం..!!

నేను తప్పు చేసిన మాట నిజమే: డేవిడ్ వార్నర్ సంచలనం..!!

ప్రస్తుతం ఐపీఎల్ 2026లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు కమిన్స్ నాయకత్వం వహిస్తున్నారు. గత ఏడాది 18 కోట్ల రూపాయలకు కమిన్స్‌ను రిటైన్ చేసుకుంది SRH. అతని సారథ్యంలో సన్‌రైజర్స్ జట్టు 2024లో ఫైనల్‌కు చేరుకోవడమే కాకుండా ఈ ఏడాది కూడా పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతూ అద్భుతమైన ప్రదర్శన చేస్తోంది. క్రికెట్ ఆస్ట్రేలియాతో ఒకవేళ ఈ ఒప్పందం జరిగితే ప్యాట్ కమిన్స్‌ ఎన్ని మ్యాచ్‌లు ఆడినా లేకపోయినా ఆయనకు వచ్చే భారీ ఆదాయానికి ఎటువంటి డోకా ఉండదు.

Pat Cummins Reportedly Offered 66 Crore Deal By Cricket Australia Find Out Complete Details Here

వెన్ను గాయం వల్ల ఈ సీజన్ IPLలో మొదటి ఏడు మ్యాచ్‌లకు దూరమైనా తిరిగి వచ్చాక ప్యాట్ కమిన్స్ బాల్‌తో అద్భుతంగా రాణిస్తున్నాడు. 32 ఏళ్ల ఈ ఫాస్ట్ బౌలర్ తన అద్భుతమైన ఫామ్‌తో ఆరెంజ్ ఆర్మీని విజయపథంలో నడిపిస్తున్నాడు. ముఖ్యంగా పవర్‌ప్లేలో బౌలింగ్ చేసే విధానం అందరినీ ఆకట్టుకుంటోంది. ఆడిన కేవలం నాలుగు మ్యాచ్‌ల్లోనే నాలుగు వికెట్లు తీసి జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు.

విజయ్ విక్టరీ వెనుక ధోనీ మేనియా...వీడియో వైరల్..!!

విజయ్ విక్టరీ వెనుక ధోనీ మేనియా...వీడియో వైరల్..!!

నిన్న పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కమిన్స్ తన ప్రతాపం చూపించాడు. భారీ స్కోర్లు నమోదైన ఆ ఉత్కంఠ పోరులో కీలక వికెట్లు తీసి సన్‌రైజర్స్‌కు విజయాన్ని అందించాడు. తన అద్భుతమైన కెప్టెన్సీతో జట్టును నడిపించినందుకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. అటు దేశం తరపున, ఇటు ఐపీఎల్‌లోనూ అదరగొడుతున్న కమిన్స్‌ను వదులుకోవడం ఇష్టం లేక, ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ఆయనకు ఈ భారీ ఆఫర్‌ను ప్రకటించింది.

Story first published: Thursday, May 7, 2026, 17:59 [IST]
Other articles published on May 7, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+