Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మా జట్టు ఓటమికి కారణం అదే:ప్యాట్ కమిన్స్

IPL 2025: అజింక్య రహానే కెప్టెన్సీలో కోల్‌కతా నైట్ రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను 80 పరుగుల తేడాతో ఓడించడం ద్వారా ఐపీఎల్ 2025లో తమ రెండో విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్ డిఫెండింగ్ ఛాంపియన్ కేకేఆర్, రన్నరప్ ఎస్ఆర్‌హెచ్ మధ్య జరిగింది. టాస్ గెలిచిన సన్ రైజర్స్ హైదరాబాద్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నైట్ రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లో 6 వికెట్లు కోల్పోయి 200 పరుగులు చేసింది. జట్టు తరపు వెంకేటేష్ అయ్యర్ 60 పరుగులతో అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. లక్ష్యాన్ని ఛేదించడానికి దిగిన హైదరాబాద్ 16.4 ఓవర్లలో కేవలం 120 పరుగులకే ఆలౌట్ అయింది. కేకేఆర్ బౌలర్లు అద్భుతంగా రాణించారు. ముఖ్యంగా వైభవ్ అరోరా తన బౌలింగ్ తో అందరినీ ఆకట్టుకున్నాడు. ఈ మ్యాచ్ లో ఓటమి తర్వాత సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్ ఓటమిపై తన నిరాశను వ్యక్తం చేశాడు.

ఓటమి గురించి కమిన్స్ ఏం చెప్పాడంటే?

ఓటమి తర్వాత సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ మాట్లాడుతూ.. "ఈ మ్యాచ్ మాకు మంచిది కాదు. వికెట్ ఆడటానికి బాగానే ఉంది, కానీ ఫీల్డింగ్‌లో మేము చాలా అవకాశాలను కోల్పోయాము. చివరికి మ్యాచ్ మా చేతుల్లో నుంచి జారిపోయింది" అని కమిన్స్ అన్నాడు. వరుసగా మూడు పరాజయాలు జట్టుకు మంచిది కాదని కమిన్స్ అంగీకరించాడు. ఈ మ్యాచ్‌లో ఏం తప్పు జరిగిందనే ప్రశ్నకు కమిన్స్ సమాధానమిస్తూ.."జట్టు ఫీల్డింగ్ బలహీనంగా ఉందని, బౌలింగ్ బాగానే ఉందని, కానీ కొన్ని క్యాచ్‌లు మిస్ అయ్యాయి " అని ప్యాట్ కమిన్స్ చెప్పుకొచ్చాడు.

Pat Cummins on SRH Loss We Lost Opportunities in the Field

ఆడమ్ జంపాను ఆడించకపోవడంపై అడిగిన ప్రశ్నకు.. బంతి పిచ్‌పై తిరగకపోవడంతో మేము 3 ఓవర్లు మాత్రమే స్పిన్ బౌలింగ్ చేశామని ఆయన అన్నారు. అందుకే ఆడమ్ జంపాకు అవకాశం ఇవ్వలేదని వెల్లడించాడు. "ఈ ఓటమి నుండి మేము నేర్చుకుంటాము, కానీ ఎక్కువగా ఆలోచించము. మాకు బాగా తెలిసిన మైదానంలో తదుపరి మ్యాచ్ ఆడతాము" అని కమ్మిన్స్ అన్నాడు.

Story first published: Friday, April 4, 2025, 0:16 [IST]
Other articles published on Apr 4, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+