Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ప్రేయసిని పెళ్లాడిన ఆస్ట్రేలియా టెస్ట్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్.. పెళ్లికి ముందే వీరి జంటకు పాప

Pat Cummins Married His Fiancee Becky Boston and He Posted Wedding Pic

ఆస్ట్రేలియా టెస్ట్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ తన పియాన్సీ బెకీ బోస్టన్‌ను పెళ్లాడాడు. కమిన్స్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ మేరకు తన వివాహ ఫోటోను పోస్ట్ చేశాడు. అతను తన పోస్ట్‌కి క్యాప్షన్ "జస్ట్ మ్యారీడ్." అంటూ ఇచ్చాడు. కమిన్స్‌కు ఇన్‌స్టాలో అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. అతని సహచరుడు డేవిడ్ వార్నర్ "కంగ్రాట్స్ మేట్." అంటూ అభినందనలు తెలిపాడు. కమిన్స్ ఐపీఎల్లో ప్రాతినిధ్యం వహించే ఫ్రాంచైజీ కోల్‌కతా నైట్ రైడర్స్ కూడా కొత్త జంటకు అభినందనలు తెలియజేసింది. ఇకపోతే వీరిద్దరి జంటకు ఇప్పటికే తొమ్మిది నెలల పాప కూడా ఉంది. ఆ పాపాయి పేరు ఆల్బీ. పెళ్లి కాకున్న ముందే వీరిద్దరు సహజీవనం చేశారు.

శ్రీలంకతో జరిగిన రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో కమిన్స్ చివరిసారిగా కనిపించాడు. ఆ టెస్ట్ సిరీస్ 1-1తేడాతో ముగిసింది. ఈ సిరీస్లో ఆస్ట్రేలియా కెప్టెన్ అయిన కమిన్స్ 47పరుగులు చేయడంతో పాటు రెండు వికెట్లు పడగొట్టాడు. అంతకుముందు శ్రీలంకతో జరిగిన మూడు వన్డేల్లో కమిన్స్ ఎనిమిది వికెట్లు తీశాడు. అలాగే బ్యాటింగ్లో 39పరుగులు చేశాడు. ఈ పేసర్ ప్రస్తుతం టెస్టు ఫార్మాట్‌లో నెంబర్ 1 బౌలర్‌గా కొనసాగుతున్నాడు. అతని తర్వాత రెండో స్థానంలో రవిచంద్రన్ అశ్విన్ ఉన్నాడు. అశ్విన్ కంటే కమిన్స్ 49పాయింట్లు ఆధిక్యంలో ఉన్నాడు.

అలాగే ఆల్రౌండర్ల ర్యాంకింగ్స్ లో కూడా కమ్మిన్స్ టాప్ 10లో ఉన్నాడు. టెస్ట్ ఆల్ రౌండర్ ర్యాంకింగ్స్‌లో ఏడో స్థానంలో కొనసాగుతున్నాడు. కెప్టెన్‌గా ఈ సంవత్సరం ప్రారంభంలో జరిగిన యాషెస్‌ టెస్ట్ సిరీస్లో ఆస్ట్రేలియా ఇంగ్లాండ్‌పై అద్భుత విజయాన్ని అందుకుంది. పాకిస్థాన్లో జరిగిన టెస్ట్ సిరీస్‌ను కూడా ఆస్ట్రేలియా గెలుపొందింది. కెప్టెన్‌గా ప్యాట్ కమిన్స్ ప్రస్తుతం విజయవంతంగా కొనసాగుతున్నాడు. ఆస్ట్రేలియా ప్రస్తుతం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. తొలి స్థానంలో దక్షిణాఫ్రికా ఉండగా.. 3వ స్థానంలో శ్రీలంక, 4వ స్థానంలో భారత్, 5వ స్థానంలో పాకిస్థాన్ కొనసాగుతున్నాయి.

Story first published: Monday, August 1, 2022, 15:59 [IST]
Other articles published on Aug 1, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+