For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

క్రికెట్ ఆస్ట్రేలియా సంచలన నిర్ణయం: ఫాస్ట్ బౌలర్ చేతికి పగ్గాలు: 55 ఏళ్ల తరువాత తొలిసారిగా

Pat Cummins is appointed as the Australias New Test Captain and Steve Smith as Vice Captain

మెల్‌బోర్న్: క్రికెట్ ఆస్ట్రేలియా సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. టెస్ట్ కేప్టెన్సీ పగ్గాలను ఎవరికి అప్పగించాలనే విషయంపై కొద్దిరోజులుగా సాగుతోన్న అనిశ్చిత పరిస్థితులకు తెర దించింది. టిమ్ పెయిన్ కేప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకొన్న తరువాత జట్టులో నెలకొన్న గందరగోళానికి పుల్‌స్టాప్ పెట్టింది. ఇంగ్లాండ్‌తో తలపడనున్న ప్రతిష్ఠాత్మక యాషెస్ టెస్ట్ సిరీస్ కోసం సన్నద్ధమౌతోన్న ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకు కొత్త సారథులను ఎంపిక చేసింది. కేప్టెన్, వైస్ కేప్టెన్‌ల పేర్లను కొద్దిసేపటి కిందటే ప్రకటించింది.

ఫాస్ట్ బౌలర్ చేతికి..

ఫాస్ట్ బౌలర్ చేతికి..

ఫాస్ట్ బౌలర్ పాట్ కమ్మిన్స్ చేతికి కేప్టెన్సీ పగ్గాలను అప్పగించింది క్రికెట్ ఆస్ట్రేలియా. స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్‌ను వైస్ కేప్టెన్‌గా అపాయింట్ చేసింది. ఈ ఇద్దరిలో ఒకరు కేప్టెన్‌గా నియమితుడు కావచ్చంటూ కొద్దిరోజులుగా వార్తలు వెలువడుతున్నాయి. వారిలో ఎవరి పేరును ఖాయం చేయాలనే విషయం మీద కొంత గందరగోళ పరిస్థితలు నెలకొన్నాయి. అనిశ్చితి ఏర్పడింది. కేప్టెన్, వైస్ కేప్టెన్సీల బాధ్యతలను అప్పగించడానికి ఇటీవలే క్రికెట్ ఆస్ట్రేలియా అధికారులు ఇంటర్వ్యూ సైతం నిర్వహించారు.

47వ కేప్టెన్‌గా

47వ కేప్టెన్‌గా

ఇద్దరినీ వేర్వేరుగా పిలిపించి మాట్లాడారు. వారి అభిప్రాయాలను సేకరించారు. కేప్టెన్‌, వైస్ కేప్టెన్ పేర్లను అధికారికంగా ప్రకటించారు. పాట్ కమ్మిన్స్‌కు జట్టు కేప్టెన్సీ పగ్గాలను అప్పగించడం ద్వారా క్రికెట్ ఆస్ట్రేలియా ఓ నూతన శకానికి నాంది పలికినట్టయింది. జాతీయ జట్టు కేప్టెన్‌గా ఓ ఫాస్ట్ బౌలర్‌ను నియమించడం ఇదే తొలిసారి. మొత్తంగా ఆస్ట్రేలియా జాతీయ జట్టు 47వ సారథిగా పాట్ కమ్మిన్స్ నియమితుడయ్యాడు. త్వరలోనే అతను బాధ్యతలను తీసుకుంటాడు.

వరల్డ్ క్లాస్ ఫాస్ట్ బౌలర్..

వరల్డ్ క్లాస్ ఫాస్ట్ బౌలర్..

పాట్ కమ్మిన్స్ ఫాస్ట్ బౌలర్. ఆస్ట్రేలియా బౌలింగ్ విభాగానికి అతనే వెన్నెముక. ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలర్‌గా గుర్తింపు పొందాడు. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. నిలకడగా రాణిస్తున్నాడు. టెస్ట్, టీ20 ఇంటర్నేషనల్స్, వన్డే ఇంటర్నేషనల్స్‌లో తిరుగులేని మేటి బౌలర్‌గా పేరు తెచ్చుకున్నాడు. ఆస్ట్రేలియా జాతీయ జట్టు కేప్టెన్‌గా ఓ ఫాస్ట్ బౌలర్ అపాయింట్ కావడం అనేది 55 సంవత్సరాల తరువాత ఇదే తొలిసారి.

1957 తరువాత..

1957లో రే లిండ్‌వాల్ అనే ఫాస్ట్ బౌలర్ ఆస్ట్రేలియా జట్టుకు సారథ్యాన్ని వహించాడు. ఆ తరువాత బౌలర్ల చేతికి కేప్టెన్సీ పగ్గాలు ఎప్పుడూ వెళ్లలేదు. ఆ రికార్డును బ్రేక్ చేశాడు పాట్ కమ్మిన్స్. ఈ కుడిచేతి వాటం ఫాస్ట్ బౌలర్ ఇప్పటిదాకా 34 టెస్ట్ మ్యాచ్‌లల్లో 65 ఇన్నింగులను ఆడాడు. 164 వికెట్లను పడగొట్టాడు. బెస్ట్ బౌలింగ్ ఫిగర్స్ 6/23. ఒకే మ్యాచ్‌లో 10 వికెట్లను పడగొట్టిన ఘనతను సాధించాడు. అయిదుసార్లు అయిదు వికెట్ల హాల్‌‌ను అందుకున్నాడు.

వైస్ కేప్టెన్‌గా

వైస్ కేప్టెన్‌గా

కాగా- స్టార్ బ్యాటర్ స్టీవెన్ స్మిత్.. వైస్ కేప్టెన్‌గా అపాయింట్ అయ్యాడు. పాట్ కమ్మిన్స్ కంటే ఎక్కువ టెస్ట్ మ్యాచ్‌లను ఆడిన అనుభవం స్టీవ్‌కు ఉంది. ఇప్పటిదాకా అతను 77 మ్యాచ్‌లల్లో 139 ఇన్నింగులను ఆడాడు. 7,540 పరుగులు చేశాడు. ఇందులో 27 సెంచరీలు, 31 అర్ధసెంచరీలు ఉన్నాయి. అతని హయ్యెస్ట్ స్కోర్ 239. ఇంటర్వ్యూ సందర్భంగా-ఈ అనుభవాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా పరిగణనలోకి తీసుకోలేదనేది స్పష్టమైంది. ఈ ఇద్దరిలో ఉన్న వ్యూహాలను పరిగణనలోకి తీసుకుని- పాట్ కమ్మిన్స్‌ వైపు మొగ్గు చూపారు.

Story first published: Friday, November 26, 2021, 9:40 [IST]
Other articles published on Nov 26, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+