SRH కెప్టెన్సీ నుంచి ఇషాన్ ఔట్.. స్టార్ ఆల్‌రౌండర్ రీఎంట్రీ!
IPL 2026: సన్‌రైజర్స్ హైదరాబాద్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం వచ్చేసింది. ఎస్ఆర్‌హెచ్ రెగ్యులర్ కెప్టెన్, ఆస్ట్రేలియా వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఎట్టకేలకు మైదానంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమయ్యాడు. గత కొంతకాలంగా వీపు గాయంతో సతమతమవుతున్న కమిన్స్.. తాజాగా నిర్వహించిన ఫిట్‌నెస్ టెస్టులో ఉత్తీర్ణుడయ్యాడు. దీంతో ఐపీఎల్ 2026 సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ శిబిరంలో కొత్త ఉత్సాహం నెలకొంది. ఈ సీజన్ ప్రారంభానికి ముందే కమిన్స్ భారత్ చేరుకున్నా.. గాయం తీవ్రత దృష్ట్యా ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేకపోయాడు. కమిన్స్ రాకతో కెప్టెన్సీ బాధ్యతల నుంచి ఇషాన్ కిషన్ తప్పుకోనున్నాడు.
సిడ్నీలో క్లియరెన్స్.. భారత్‌కు పయనం!
ఏప్రిల్ 2న కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన ఉత్కంఠ పోరు తర్వాత, కమిన్స్ తన వీపు గాయానికి సంబంధించి తదుపరి వైద్య పరీక్షల కోసం హుటాహుటిన ఆస్ట్రేలియాకు పయనమయ్యాడు. సిడ్నీలో జరిగిన తాజా 'బ్యాక్ స్కాన్' నివేదికల్లో కమిన్స్ గాయం పూర్తిగా నయమైందని వైద్యులు ధ్రువీకరించారు. ఈ శుభవార్తను కమిన్స్ స్వయంగా సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూ.. "మళ్ళీ బరిలోకి దిగేందుకు సిద్ధంగా ఉన్నాను" అని ప్రకటించాడు. వచ్చే శుక్రవారం అతను ఆస్ట్రేలియా నుంచి భారత్‌కు బయలుదేరి, తన ఆరెంజ్ ఆర్మీతో కలవనున్నాడు.

రాజస్థాన్‌తో మ్యాచ్ ద్వారా ఎంట్రీ..
ప్యాట్ కమిన్స్ తన రీఎంట్రీ కోసం ఏప్రిల్ 25న జైపూర్‌లో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగే మ్యాచ్‌ను ముహూర్తంగా ఫిక్స్ చేసుకున్నాడు. గతేడాది జరిగిన యాషెస్ సిరీస్ తర్వాత ప్యాట్ కమిన్స్ మళ్లీ పోటీ క్రికెట్ ఆడలేదు. ఆ గాయం కారణంగానే కమిన్స్ ఇటీవలే ముగిసిన టీ20 ప్రపంచకప్ 2026కు కూడా దూరమయ్యాడు. కమిన్స్ లేని ఆస్ట్రేలియా జట్టు ఆ టోర్నీలో గ్రూప్ దశలోనే వెనుదిరగడం గమనార్హం. ఇప్పుడు పూర్తి ఫిట్‌నెస్‌తో ఐపీఎల్‌లోకి వస్తున్న కమిన్స్.. రాజస్థాన్ వంటి బలమైన జట్టుపై తన సత్తా చాటాలని పట్టుదలతో ఉన్నాడు.
ఇషాన్ కిషన్ నాయకత్వంలో ఆరెంజ్ ఆర్మీ..
కమిన్స్ లేని సమయంలో భారత యువ వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ సన్‌రైజర్స్‌ను సమర్థవంతంగా నడిపిస్తున్నాడు. ఇషాన్ సారథ్యంలో ఆడిన ఐదు మ్యాచ్‌లలో సన్‌రైజర్స్ హైదరాబాద్ రెండింటిలో గెలిచి,.. పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. ముఖ్యంగా గత మ్యాచ్‌లో టేబుల్ టాపర్ రాజస్థాన్‌ను ఓడించి సన్‌రైజర్స్ ఫామ్‌లోకి వచ్చింది. ప్రస్తుతం నాలుగో స్థానంలో ఉన్న హైదరాబాద్.. తన తదుపరి మ్యాచ్‌లో ఐదుసార్లు ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ (CSK)తో తలపడనుంది. కీలకమైన టోర్నీ మలిదశలో కమిన్స్ జట్టులోకి రావడం బౌలింగ్‌తో పాటు నాయకత్వ పరంగా కూడా ఎస్ఆర్‌హెచ్‌కు కొండంత బలాన్ని ఇవ్వనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications