న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2023: దేశం కోసం ఐపీఎల్‌కు దూరమైన స్టార్ పేసర్.. భారత స్టార్లు సిగ్గు పడాలంటున్న ఫ్యాన్స్..!

Pat Cummins decided to not be part of IPL 2023 because of Australia team schedule

ప్రపంచకప్‌లో దేశాన్ని గెలిపించాలనే లక్ష్యంతో ఐపీఎల్ వంటి లీగులకు కొందరు స్టార్ ప్లేయర్లు దూరంగా ఉండటం తెలిసిందే. గతేడాది ఆసీస్ స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ అదే పని చేశాడు. ఇప్పుడు ఆ జట్టు టెస్టు, వన్డే సారధి ప్యాట్ కమిన్స్ కూడా ఇదే నిర్ణయం తీసుకుంటున్నట్లు వెల్లడించాడు. ఈ షాకింగ్ డెసిషన్ ఫ్యాన్స్‌కు ఆశ్చర్యం కలిగించినా కొందరు మాత్రం మెచ్చుకుంటున్నారు.

కఠిన నిర్ణయమే..

కఠిన నిర్ణయమే..

ఐపీఎల్‌కు దూరంగా ఉండాలని అనుకోవడం కఠిన నిర్ణయమేనని, కానీ తప్పనిసరి పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకుంటున్నానని కమిన్స్ చెప్పాడు. 'వచ్చే ఏడాది ఐపీఎల్‌కు దూరంగా ఉండాలనే కఠిన నిర్ణయం తీసుకున్నా. వచ్చే ఏడాది వన్డే, టెస్టు మ్యాచులతో షెడ్యూల్ చాలా బిజీగా ఉంది. అందుకే యాషెస్ సిరీస్, వన్డే వరల్డ్ కప్ ముందు కొంత విశ్రాంతి తీసుకోవాలని అనుకుంటున్నా' అని కమిన్స్ స్పష్టం చేశాడు.

వచ్చే ఏడాది బిజీ బీజీ..

వచ్చే ఏడాది బిజీ బీజీ..

వచ్చే ఏడాది క్రికెటింగ్ షెడ్యూల్ చాలా బిజీగా ఉండనుంది. వన్డే ప్రపంచకప్‌తోపాటు వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ కూడా జరుగుతుంది. దీనికితోడు ఆస్ట్రేలియా జట్టుకు అత్యంత ప్రతిష్ఠాత్మకమైన యాషెస్ సిరీస్ ఉండనే ఉంది. అందుకే ఆ జట్టు షెడ్యూల్ చాలా బిజీగా ఉంది. ఈ బిజీ షెడ్యూల్‌లో మళ్లీ ఐపీఎల్ ఆడటం కష్టమని భావించడంతోనే కమిన్స్ ఈ కఠిన నిర్ణయం తీసుకున్నాడు.

శభాష్ అంటున్న నెటిజన్లు

కమిన్స్ నిర్ణయం తెలుసుకున్న క్రికెట్ అభిమానులు అతన్ని శభాష్ అంటూ మెచ్చుకుంటున్నారు. డబ్బు కన్నా దేశాన్ని గెలిపించడం ముఖ్యమని కమిన్స్ నిరూపించాడని, మన ఆటగాళ్లు కూడా ఈ పద్ధతిని అవలంబించాలని డిమాండ్ చేస్తున్నారు. కొందరు మాత్రం టీమిండియా ఆటగాళ్లపై సెటైర్లు వేస్తున్నారు. 'గాయంతో జట్టుకు దూరమై ప్రపంచకప్ కూడా ఆడని బుమ్రా కూడా ఐపీఎల్ ఆడతాడు చూడండి' అంటూ వెటకారం ఆడుతున్నారు. భారత ఆటగాళ్లకు దేశం అంటే గౌరవం లేదని, డబ్బు మీదనే ఎక్కువ ప్రేమ అని తిట్టిపోస్తున్నారు.

Story first published: Tuesday, November 15, 2022, 15:35 [IST]
Other articles published on Nov 15, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X