Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

‘పెళ్లైందని తెలుసు.. కానీ నువ్వంటే పిచ్చి’- అందాల యాంకర్‌కు ప్యాట్ కమిన్స్ క్రేజీ ఆన్సర్ (వీడియో)

క్రికెటర్స్ కు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఫ్యాన్స్ ఉండటం సహజమే. కొంతమంది ప్లేయర్స్ కైతే లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా కాస్త ఎక్కువగానే ఉంటుంది. ఆ ఆటగాళ్ల గ్లామర్ కు, ఆటతీరుకు.. అమ్మాయిలు ఫిదా అవ్వడంతో పాటు వారిపై విపరీతంగా క్రష్ ఫీలింగ్ ను పెంచేసుకుంటారు. వారితో ఒక్కసారి మాట్లాడితే చాలు, ఒక్క ఫొటో దిగితే చాలు అని తెగ ఆరాటపడిపోతుంటారు.

అయితే తాజాగా 'డేట్ విత్ ఏ సూపర్ స్టార్' అనే షోలో పాల్గొన్న ఆస్ట్రేలియా టెస్ట్ కెప్టెన్ పాట్ కమిన్స్ తనపై ఉండే ఫీమేల్ అటెన్షన్ ను ఎలా డీల్ చేస్తాడో చెప్పుకొచ్చాడు. తనపై అమ్మాయిలు చూపించే క్రష్ ఫీలింగ్ ను తాను ఎలా ఫీల్ అవుతాడో తెలిపాడు.

Pat Cummins comments on Indian Lady Fans in Date with a Superstar show

'మీకు ఇండియాలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా మహిళల్లో మీకు విశేష అభిమానగణం ఉంది. చాలా మంది అమ్మాయిలకు, మహిళలకు మీరంటే చాలా ఇష్టం. నాతో సహా నా బెస్ట్ ఫ్రెండ్, మిగతా మహిళలకు మీపై క్రష్ ఫీలింగ్ ఉంది. 'ఓ నువ్వు ప్యాట్ కమిన్స్ ను కలుస్తున్నావా. నేను జెలసీగా ఫీలవుతున్నా' అని నా ఫ్రెండ్ నాతో మెసేజ్ కూడా చేసింది. మీకు పెళ్లి అయిందని ప్రతిఒక్కరికీ తెలుసు. కానీ మీరు ఇంతమంది అమ్మాయిల అభిమానాన్ని, ప్రేమను ఎలా సంపాదించుకోగలిగారు' అని హోస్ట్ సాహిబా బలి అడిగింది.

దానికి కమిన్స్ ఆసక్తికరమైన సమాధానం చెప్పాడు. తనకు ఈ విషయాన్ని ఎక్కడి నుంచి మొదలుపెట్టాలో తెలియట్లేదని అన్నాడు. కేవలం తన పని మాత్రమే తాను చేస్తానని చెప్పుకొచ్చాడు. అంతకుమించి ఎక్కువ ఆలోచించనని వెల్లడించాడు. "దీని గురించి ఎక్కడి నుంచి మొదలుపెట్టాలో తెలీదు. కేవలం నా పని నేను చేసుకుంటూ ముందుకెళ్తాను అంతే. అంతకుమించి ఇంకేం లేదు" అని అన్నాడు.

'మీరు ఫీమేల్ అటెన్షన్ ను ఎలా ఆస్వాదిస్తారు' అని మళ్లీ అడగగా.. ఇండియాలో ఫ్యాన్స్ చాలా క్రేజీగా ఉంటారని చెప్పాడు కమిన్స్. "ఫన్నీగా చెబుతున్నాను. భారత్ లో అభిమానులు చాలా క్రేజీగా ఉంటారు. ప్లేయర్స్ దాదాపుగా ఎక్కువ సమయాన్ని తమ జట్టుతో పాటు హోటల్ లోనే గడుపుతారు. ప్లేయర్స్ ఫ్యామిలీలు కూడా తమతో పాటే ఉంటాయి. కాబట్టి చాలా సందర్భాల్లో వేరే వాళ్లతో పర్సనల్ గా మాట్లాడటం కూడా కుదరదు." అని పేర్కొన్నాడు.

కాగా, ఆస్ట్రేలియా జట్టు విషయానికొస్తే, బోర్డర్ గావస్కర్ ట్రోఫీని పదేళ్ల తర్వాత సొంతం చేసుకుంది. గత రెండు పర్యాయాలు ఆస్ట్రేలియాలో టీమిండియా 2-1తో సిరీస్‌ను దక్కించుకుంది. అయితే ఈసారి కూడా విజయంతోనే సిరీస్‌ ప్రారంభించినా, ఆ తర్వాత గాడి తప్పింది. దీంతో ఆస్ట్రేలియా గావస్కర్ ట్రోఫీని గెలవడంతో పాటు ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్‌ 2025కు అర్హత సాధించింది. ఇప్పటికే దక్షిణాఫ్రికా ఫైనల్‌ చేరుకున్న సంగతి తెలిసిందే. దీంతో దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఇంగ్లాండ్‌లోని లార్డ్స్ వేదికగా ఫైనల్ జరగనుంది. రెండేళ్ల క్రితం జరిగిన తుది పోరులో ఆస్ట్రేలియా జట్టు టీమిండిను ఓడించి, ట్రోఫీని ముద్దాడింది. వరుసగా ఇప్పుడు రెండోసారి ఫైనల్ కు చేరింది.

Story first published: Tuesday, January 7, 2025, 17:30 [IST]
Other articles published on Jan 7, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+