Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఫైనల్‌‌లో SRH: చరిత్ర సృష్టించిన కమిన్స్

సన్‌రైజర్స్ హైదరాబాద్ అదరగొట్టింది. చెపాక్ వేదికగా జరిగిన క్వాలిఫయిర్-2లో ఆల్ రౌండ్‌ షోతో సత్తాచాటి రాజస్థాన్ రాయల్స్‌పై 36 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఆరేళ్ల తర్వాత తొలిసారిగా ఫైనల్‌కు దూసుకెళ్లింది. టైటిల్ కోసం తుదిపోరులో ఆదివారం కోల్‌కతా నైట్ రైడర్స్‌తో తలపడనుంది.

తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్‌ఆర్‌హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లకు 175 పరుగులు సాధించింది. హెన్రిచ్ క్లాసెన్ (50; 34 బంతుల్లో, 4x6) అర్ధశతకంతో సత్తాచాటాడు. రాహుల్ త్రిపాఠి (37; 12 బంతుల్లో, 5x4, 2x6), ట్రావిస్ హెడ్ (34; 28 బంతుల్లో, 3x4, 1x6) ఫర్వాలేదనిపించారు. రాజస్థాన్ బౌలర్లలో అవేశ్ ఖాన్ (3/27), ట్రెంట్ బౌల్ట్ (3/45) చెరో మూడు, సందీప్ శర్మ (2/25) రెండు వికెట్లు తీశారు.

Pat Cummins Becomes Second Captain with Most Wickets in an IPL Season

అనంతరం ఛేదనలో రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 139 పరుగులకే పరిమితమైంది. ధ్రువ్ జురెల్ (56*; 35 బంతుల్లో, 7x4, 2x6), యశస్వీ జైస్వాల్ (42; 21 బంతుల్లో, 4x4, 3x6) పోరాడారు. స్లో పిచ్‌పై సన్‌రైజర్స్ స్పిన్నర్లు షాబాజ్ అహ్మద్ (3/23) మూడు, అభిషేక్ శర్మ (3/24) రెండు వికెట్లతో రాజస్థాన్‌ను చిత్తుచేశారు. నటరాజన్ (1/13), కమిన్స్ (1/30) చెరో వికెట్ తీశారు.

కాగా, ఈ సీజన్‌లో కమిన్స్‌కు ఇది 17వ వికెట్. ఈ క్రమంలో కమిన్స్ అరుదైన ఘనత సాధించాడు. ఓ ఐపీఎల్ సీజన్‌లో అత్యధిక వికెట్లు తీసిన రెండో కెప్టెన్‌గా కమిన్స్ చరిత్రకెక్కాడు. ఈ జాబితాలో అగ్రస్థానంలో షేన్ వార్న్ ఉన్నాడు. 2008 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్‌కు కెప్టెన్సీ చేసిన వార్న్ 19 వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాతి స్థానాల్లో కమిన్స్ (17 వికెట్లు; ఎస్‌ఆర్‌హెచ్-2024), అనిల్ కుంబ్లే (17 వికెట్లు; ఆర్సీబీ-2010), రవిచంద్రన్ అశ్విన్ (15 వికెట్లు; పంజాబ్ కింగ్స్-2019), షేన్ వార్న్ (14 వికెట్లు; రాజస్థాన్ రాయల్స్-2009) ఉన్నారు.

Story first published: Saturday, May 25, 2024, 7:33 [IST]
Other articles published on May 25, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+