For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ముంబైలో టేస్ట్ చేయాల్సిన వంటకం ఏంటనీ కమ్మిన్స్ డిబేట్.. ఫైనల్‌గా తేలిందేంటంటే?

Pat Cummins Asks Fans For Best Food To Choose in Mumbai Fans Say Pav Bhaji

ఆస్ట్రేలియా టెస్ట్ కెప్టెన్, కోల్‌కతా నైట్ రైడర్స్ స్టార్ ప్యాట్ కమిన్స్ ట్విట్టర్‌లో ఓ ఆసక్తికర చర్చ పెట్టాడు. గురువారం రాత్రి డిన్నర్ కోసం పావ్ బజ్జీని ఎంచుకున్నాడు. ఇందుకోసం ట్విట్టర్‌లో తన అభిమానులు, ఫాలోవర్ల సహాయం తీసుకున్నాడు. ఇక ముంబైలో టేస్ట్ చేయాల్సిన ఉత్తమ వంటకం ఏంటో చెప్పాలని తన అభిమానులను ప్యాట్ కమ్మిన్స్ ట్విట్టరులో కోరాడు. దీంతో అతని కామెంట్లలో వేల సంఖ్యలో అభిమానులు తమ సిఫార్సులను పంపారు.

అంతమంది రిప్లే ఇచ్చేసరికి కమ్మిన్స్ వాటిలో ఓ నాలుగు వంటకాలను ఫైనలైజ్ చేసి.. ఇందులో ఒకదాన్ని ఎంచుకోవాలంటూ మరో పోల్ పెట్టాడు. వడ పావ్, మిసల్ పావ్ పావ్ బజ్జీలను షార్ట్ లిస్ట్ చేయగా చివరికి పావ్ బజ్జీ బెస్ట్ అని తేలింది. దీంతో అతను పావ్ బజ్జీ ఆర్డర్ చేసుకుని తిన్నాడు. ఈ మేరకు పావ్ బజ్జీ ఫోటోను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అయితే అతనికి ప్రముఖ జర్నలిస్ట్ రాజ్‌దీప్ సర్దేశాయ్ కూడా పావ్ బజ్జీ బెస్ట్.. తప్పకుండా ట్రై చేయాలని సూచించడం గమనార్హం.

తను పావ్ బజ్జీని ఆర్డర్ చేసుకున్న తర్వాత ఆ ఫోటోను పోస్ట్ చేసిన కమ్మిన్స్ ట్విట్టరులో స్పందించాడు. కమ్మిన్స్ తాను 11ఏళ్లుగా ఇండియాకు వస్తున్నానని కానీ ఎప్పుడూ ఇంత రుచికరమైన వంటకాన్ని టేస్ట్ చేయలేదని తెలిపాడు. 'వావ్, నేను 11 సంవత్సరాలుగా భారతదేశానికి వస్తున్నాను. నేను ఇంతకు ముందెన్నడూ పావ్ బజ్జీని టేస్ట్ చేయలేదు. చాలా రుచికరంగా ఉంది.' అని కమిన్స్ పేర్కొన్నాడు.

ఇక ఐపీఎల్లో కేకేఆర్ తరఫున కమ్మిన్స్ ఆడుతున్నాడు. ఈ సీజన్‌లో అతనికి ఎక్కువ అవకాశాలు రావట్లేదు. ఇక ఆస్ట్రేలియా టెస్టు జట్టు కెప్టెన్‌గాను కమ్మిన్స్ కొనసాగుతున్నాడు. పాకిస్థాన్ తో ఇటీవల జరిగిన టెస్ట్ సిరీస్‌లో 1-0 తేడాతో ఆస్ట్రేలియా గెలుపొందిన సంగతి తెలిసిందే. కమిన్స్ 3 టెస్టుల్లో 12వికెట్లు తీశాడు. పాక్‌తో సిరీస్ విజయం వల్ల ఆస్ట్రేలియా ప్రపంచ టెస్ట్ క్రికెట్‌లో తన నంబర్ 1 స్థానాన్ని నిలుపుకుంది. ఇక పాకిస్థాన్ పర్యటన వల్ల కమ్మిన్స్ లేటుగా కేకేఆర్ జట్టులో చేరాడు.

Story first published: Friday, May 6, 2022, 16:23 [IST]
Other articles published on May 6, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+