డేవిడ్ వార్నర్‌కు బిగ్ షాక్ - ఆరోన్ ఫించ్‌కూ: ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డ్ సంచలన నిర్ణయం..!!

మెల్‌బోర్న్: క్రికెట్ ఆస్ట్రేలియా సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. టీ20 ప్రపంచ కప్ 2022 టోర్నమెంట్‌కు ఆతిథ్యాన్ని ఇస్తోన్న వేళ.. ఈ నిర్ణయం వెలువడటం ప్రాధాన్యతను సంతరించుకుంది. వన్డే ఇంటర్నేషనల్ ఫార్మట్ కేప్టెన్సీ పగ్గాలను ఎవరికి అప్పగించాలనే విషయంపై కొద్దిరోజులుగా సాగుతోన్న అనిశ్చిత పరిస్థితులకు తెర దించింది. ఆరోన్ ఫించ్ వారసుడిని ఎంపిక చేసింది. ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకు కొత్త సారథిని ఎంపిక చేసింది. కేప్టెన్ పేరును కొద్దిసేపటి కిందటే ప్రకటించింది.

ఫాస్ట్ బౌలర్ చేతికి..
ఫాస్ట్ బౌలర్ పాట్ కమ్మిన్స్ చేతికి కేప్టెన్సీ పగ్గాలను అప్పగించింది క్రికెట్ ఆస్ట్రేలియా. కమ్మిన్స్‌ను వన్డే ఫార్మట్ కేప్టెన్‌గా అపాయింట్ చేసినట్లు ప్రకటించింది. ఇప్పటికే టెస్ట్ ఫార్మట్‌కు కేప్టెన్‌గా ఉంటోన్నాడు కమ్మిన్స్. టెస్టుల్లో అంచనాలకు తగ్గట్టుగా రాణిస్తోండటంతో క్రికెట్ ఆస్ట్రేలియా ఈ నిర్ణయాన్ని తీసుకుంది. వైస్ కేప్టెన్ ఎవరనేది ఇంకా వెల్లడించలేదు. స్టీవెన్ స్మిత్‌ను వైస్ కేప్టెన్‌గా అపాయింట్ చేయొచ్చనే అంచనాలు ఉన్నాయి.
27వ కేప్టెన్‌గా
పాట్ కమ్మిన్స్‌కు వన్డే ఇంటర్నేషనల్స్ ఫార్మట్ కేప్టెన్సీ పగ్గాలను అప్పగించడం ద్వారా క్రికెట్ ఆస్ట్రేలియా ఓ నూతన శకానికి నాంది పలికినట్టయింది. జాతీయ జట్టు కేప్టెన్‌గా ఓ ఫాస్ట్ బౌలర్‌ను నియమించడం ఇదే తొలిసారి. మొత్తంగా ఆస్ట్రేలియా జాతీయ జట్టు 27వ సారథిగా పాట్ కమ్మిన్స్ నియమితుడయ్యాడు. త్వరలోనే అతను బాధ్యతలను తీసుకుంటాడు. టీ20 ఫార్మట్ కేప్టెన్‌గా ఆరోన్ ఫించ్‌ను కొనసాగించింది క్రికెట్ ఆస్ట్రేలియా.
టెస్ట్ కేప్టెన్‌గా..
గత ఏడాది మార్చిలో పాట్ కమ్మిన్స్ ఆస్ట్రేలియా టెస్ట్ కేప్టెన్‌గా అపాయింట్ అయ్యాడు. 1957లో రే లిండ్‌వాల్ అనే ఫాస్ట్ బౌలర్ ఆస్ట్రేలియా జట్టుకు సారథ్యాన్ని వహించాడు. ఆ తరువాత బౌలర్ల చేతికి కేప్టెన్సీ పగ్గాలు ఎప్పుడూ వెళ్లలేదు. ఆ రికార్డును బ్రేక్ చేశాడు పాట్ కమ్మిన్స్. అతని కేప్టెన్సీలో ప్రతిష్ఠాత్మక యాషెస్ సిరీస్‌ను గెలుచుకుంది ఆస్ట్రేలియా.

వరల్డ్ క్లాస్ ఫాస్ట్ బౌలర్..
పాట్ కమ్మిన్స్ కుడిచేతి వాటం ఫాస్ట్ బౌలర్. ఆస్ట్రేలియా బౌలింగ్ విభాగానికి అతనే బ్యాక్ బోన్. ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలర్‌గా గుర్తింపు పొందాడు. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. నిలకడగా రాణిస్తున్నాడు. టెస్ట్, టీ20 ఇంటర్నేషనల్స్, వన్డే ఇంటర్నేషనల్స్‌లో తిరుగులేని మేటి బౌలర్‌గా పేరు తెచ్చుకున్నాడు. ఇప్పటివరకు 73 వన్డే మ్యాచ్‌లను ఆడాడు పాట్ కమ్మిన్స్. 119 వికెట్లను పడగొట్టాడు. బెస్ట్ బౌలింగ్ ఫిగర్స్ 5/70.

డేవిడ్ వార్నర్‌కు..
వన్డే ఫార్మట్ కేప్టెన్‌గా క్రికెట్ ఆస్ట్రేలియా డాషింగ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్‌ను నియమించవచ్చనే అంచనాలు వెలువడ్డాయి. కేప్టెన్‌గా వార్నర్‌పై విధించిన నిషేధ సమయం పూర్తి కావడంతో ఇక అతని చేతికే పగ్గాలు అందుతాయని అంచనా భావించారు గానీ.. ఫలితం మరోలా వెలువడింది. డేవిడ్ వార్నర్ పేరును పరిగణనలోకి కూడా తీసుకోలేదు. అలాగే- ఫామ్ కోల్పోయి సతమతమౌతోన్న స్టీవెన్ స్మిత్ పేరును కూడా పరిశీలించలేదు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications