తల్లి కాబోతున్న స్టార్ క్రికెటర్‌ కాబోయే భార్య.. శుభాకాంక్షలు చెప్పిన కేకేఆర్‌!!

సిడ్నీ: ఆస్ట్రేలియా స్టార్ పేసర్, కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ ఆటగాడు పాట్ కమిన్స్‌ తండ్రి కాబోతున్నాడు. కమిన్స్‌ ప్రేయసి, కాబోయే భార్య బెకీ బోస్టన్‌ త్వరలోనే ఓ పండంటి బిడ్డకు జన్మనివ్వనున్నారు. ఆదివారం 'మదర్స్‌ డే' సందర్భంగా బేబీ బంప్‌తో ఉన్న బెకీ ఫొటోను కమిన్స్‌ షేర్‌ చేసి అభిమానులతో అసలు విషయాన్ని పంచుకున్నాడు. 'తొలి మాతృదినోత్సవం.. మినీ బంప్‌తో' అంటూ కమిన్స్‌ సంతోషం వ్యక్తం చేశారు. దీంతో కాబోయే తల్లిదండ్రులకు సోషల్‌ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. 'మదర్స్‌ డే రోజు ఎంత గొప్ప శుభవార్త చెప్పారు' అని కేకేఆర్‌ ట్వీట్ చేసింది.

మాల్దీవుల్లో కమిన్స్‌

కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఐపీఎల్ 2021 గత మంగళవారం నిరవధికంగా వాయిదా పడినప్పటికీ.. ఆస్ట్రేలియా ప్రభుత్వ నిబంధనల కారణంగా పాట్ కమిన్స్‌ ఇప్పటికీ స్వదేశానికి వెళ్లలేకపోయాడు. తాజాగా మాల్దీవులు చేరుకొని అక్కడ క్వారంటైన్ అయ్యాడు. ఆపై ఆసీస్ చేరుకొని మరోసారి క్వారంటైన్ అవుతాడు. ఐపీఎల్‌ 2021 సీజన్‌లో భాగంగా కేకేఆర్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న కమిన్స్‌.. కరోనాపై భారత్‌ సాగిస్తున్న పోరులో భాగంగా తన వంతు విరాళం అందించి పెద్దమనసు చాటుకున్న సంగతి తెలిసిందే. ఆడిన ఏడు మ్యాచుల్లో కమిన్స్‌ ఆకట్టుకున్నాడు.

మానసికంగా సిద్ధమైనపుడే పెళ్లి

మానసికంగా సిద్ధమైనపుడే పెళ్లి

నిజానికి ఐపీఎల్‌ 2021 ఆడుతున్న సమయంలోనే పాట్ కమిన్స్‌, బెకీ బోస్టన్‌ తాము తల్లిదండ్రులం కాబోతున్నామన్న శుభవార్తను పంచుకున్నారు. 'ఈ సంతోషాన్ని ఇక దాచి ఉంచటం నావల్ల కాదు. బేబీ బోస్టన్‌ కమిన్స్‌ రాబోతోంది. నిన్ను కలవడానికి మేమెంతో ఆతురతగా ఎదురుచూస్తున్నాం' అంటూ గుడ్‌న్యూస్‌ షేర్‌ చేసుకున్నారు. ఈ నేపథ్యంలో కమిన్స్‌ మాట్లాడుతూ.. 'మేం సంతోషంగా, ఆరోగ్యంగా ఉన్నాం. మేం మానసికంగా సిద్ధమైనపుడే పెళ్లి చేసుకుంటాం. ఈలోపే చిన్నారి మా జీవితాల్లోకి రావడం ఎంతో ఆనందంగా ఉంది. బెకీ, బేబీ బాగున్నారు' అని పేర్కొన్నాడు.

Piyush Chawla: కరోనాతో టీమిండియా స్పిన్నర్ తండ్రి మృతి!!

ఫిబ్రవరిలో నిశ్చితార్థం

ఫిబ్రవరిలో నిశ్చితార్థం

ఫిబ్రవరిలో పాట్ కమిన్స్‌-బెకీ బోస్టన్‌ నిశ్చితార్థం జరిగింది. అంగరంగ వైభవంగా ఈ వేడుక జరిగింది. అయితే కరోనా కారణంగా కొద్ది మంది మాత్రమే హాజరయ్యారు. ఇక సుమారు తొమ్మిదిన్నర మిలియన్‌ డాలర్లతో సిడ్నీలో విలాసవంతమైన ఇల్లు కొనుగోలు చేసిన ఈ జంట త్వరలోనే వివాహ బంధంతో ఒక్కటి కానున్నారు. ఆసీస్‌ జట్టులో కమిన్స్‌ కీలక ఆటగాడిగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కమిన్స్‌ ఆసీస్ తరఫున 34 టెస్టులు, 69 వన్డేలు, 30 టీ20లు ఆడాడు.

యూఏఈకి తరలించడం మంచిది

యూఏఈకి తరలించడం మంచిది

ఈ ఏడాదిలో భారత్‌ ఆతిథ్యం ఇవ్వనున్న ఐసీసీ టీ20 ప్రపంచకప్‌పై పాట్ కమిన్స్ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. కరోనా తీవ్రంగా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రపంచకప్‌ను భారత్‌లో నిర్వహించకపోవడమే మంచిదన్నాడు. భారతీయులకు ఏది మంచిదో ఆలోచించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలని సూచించాడు. కరోనా మహమ్మారి వేగంగా విజృంభిస్తున్న పరిస్థితుల్లో మెగా టోర్నీని యూఏఈకి తరలించడం మంచిదని కమిన్స్ పేర్కొన్నాడు. ఈ ఏడాది చివరలో జరగబోయే టీ20 ప్రపంచకప్‌నకు భారత్ ఆతిథ్యం ఇవ్వనున్న విషయం తెలిసిందే.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Monday, May 10, 2021, 13:25 [IST]
Other articles published on May 10, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X