For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

INDvsAUS : కెప్టెన్ లేకపోవడం ఆసీస్‌కు కలిసొచ్చేలా ఉందిగా.. మూడో టెస్టులో భారత్‌కు కష్టమే!

Pat Cummins absense may be good for Australia

భారత్‌తో జరుగుతున్న టెస్టు సిరీసులో ఆస్ట్రేలియా అత్యంత ఘోరంగా ఆడుతోంది. తొలి రెండు టెస్టుల్లో కనీసం పోటీ కూడా ఇవ్వలేకపోయింది. ఈ క్రమంలో ఆస్ట్రేలియా జట్టు మొత్తంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఇలాంటి సమయంలో తన తల్లికి అనారోగ్యం చేయడంతో ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఇంటికి వెళ్లిపోయాడు. దీంతో చివరి రెండు టెస్టులకు స్టీవ్ స్మిత్ కెప్టెన్సీ చేసే అవకాశం ఉంది. మూడో టెస్టులో అయితే అతనే కెప్టెన్ అని ఆస్ట్రేలియా చెప్పేసింది కూడా. ఇలా కెప్టెన్ కమిన్స్ జట్టుకు దూరం అవడం ఆసీస్‌కు కలిసొచ్చేలాగే కనిపిస్తోంది. ఎందుకంటే?

రాణించని కెప్టెన్..

రాణించని కెప్టెన్..

భారత్‌తో జరిగిన తొలి రెండు టెస్టుల్లో ఆస్ట్రేలియా కెప్టెన్ అంత గొప్పగా రాణించలేదు. కొత్త బంతితో భారత బ్యాటర్లను ఇబ్బంది పెట్టాల్సిన అతను ఈ విషయంలో దారుణంగా విఫలమయ్యాడు. వేయాల్సినన్ని ఓవర్లు బౌలింగ్ కూడా చెయ్యలేదు. ఈ రెండు మ్యాచుల్లో కలిపి 33.3 ఓవర్లు వేసిన కమిన్స్ మూడు వికెట్లు మాత్రమే తీసుకున్నాడు. ఢిల్లీ టెస్టు చివరి ఇన్నింగ్స్‌లో అసలు బౌలింగ్ చెయ్యలేదు. భారత పిచ్‌లపై వికెట్లు తీసుకోవడానికి అతను తెగ శ్రమిస్తున్నా ఫలితం దక్కడం లేదు.

సూపర్ కెప్టెన్ స్మిత్..

సూపర్ కెప్టెన్ స్మిత్..

గత దశాబ్దకాలంలో భారత జట్టు స్వదేశంలో కేవలం రెండు టెస్టులు మాత్రమే ఓడింది. వీటిలో ఆసీస్ చేతిలో ఓడిన మ్యాచ్‌లో ఆ జట్టుకు స్టీవ్ స్మిత్ కెప్టెన్సీ చేశాడు. పూణే వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో అద్భుతమైన కెప్టెన్సీతో ఆస్ట్రేలియాకు విజయం అందించాడీ స్టార్ బ్యాటర్. ఆ సిరీసులో ఆస్ట్రేలియా ఓడినా కూడా స్మిత్ నేతృత్వంలోని జట్టు మాత్రం భారత్‌కు గట్టి సవాల్ విసిరింది. భారత్‌లోని కఠిన పరిస్థితులను ఎదుర్కొని చాలా గట్టి పోటీ ఇచ్చింది. ఓవరాల్‌గా చూసుకున్న ఆసీస్‌కు 36 టెస్టుల్లో కెప్టెన్సీ వహించిన స్మిత్.. వీటిలో 20 మ్యాచుల్లో గెలిచాడు. పదింటిలో ఓడిపోగా, ఆరు మ్యాచులు డ్రా చేసుకున్నాడు. అతనికి కెప్టెన్సీ ఇవ్వడంతో ఆసీస్ మళ్లీ గట్టిపోటీ ఇచ్చే అవకాశం ఉంది.

 స్టార్క్ ఎంట్రీ క్లియర్..

స్టార్క్ ఎంట్రీ క్లియర్..

ఢిల్లీ వేదికగా జరిగిన టెస్టులో ఆసీస్ జట్టులో కేవలం ప్యాట్ కమిన్స్‌ను మాత్రమే పేసర్‌గా తీసుకుననారు. అతను ఈ మ్యాచ్‌లో కేవలం ఒక్క వికెట్ మాత్రమే తీసుకున్నాడు. కొత్త బంతితో సత్తా చాటే మిచెల్ స్టార్క్ వంటి సీనియర్ లేని లోటు ఆ జట్టులో స్పష్టంగా కనిపించింది. ఇప్పుడు కమిన్స్ లేకపోవడంతో స్టార్క్ కచ్చితంగా మూడో టెస్టులో ఆడతాడని తెలుస్తోంది. ఎడం చేతి వాటం స్పిన్నర్ కూడా కావడంతో ఆస్ట్రేలియా బౌలింగ్ దళంలో కొత్తదనాన్ని కూడా స్టార్క్ తీసుకొస్తాడు. దానికితోడు భారత టాపార్డర్ ఇలా ఎడం చేతి వాటం పేసర్లను ఎదుర్కోవడంలో కొంత తడబడుతుందని ఇప్పటికే చాలా మంది విశ్లేషకులు చెప్పిన సంగతి తెలిసిందే.

Story first published: Saturday, February 25, 2023, 21:13 [IST]
Other articles published on Feb 25, 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+