అవమానాన్ని అధిగమించి టీ20లో చోటు: ఎవరీ పర్వేజ్ రసూల్?
హైదరాబాద్: ఇంగ్లాండ్‌తో గురువారం నుంచి కాన్పూర్‌లో ప్రారంభం కానున్న టీ20 సిరిస్‌కు టీమిండియా సీనియర్ స్పిన్నర్లు రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్‌లకు విశ్రాంతి నిచ్చి వారి స్ధానాల్లో అమిత్ మిశ్రా, పర్వేజ్ రసూల్‌లకు చోటు కల్పించిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో పర్వేజ్ రసూల్ జమ్మూ కాశ్మీర్ నుంచి భారత జట్టుకు ఎంపికైన ఏకైక ఆటగాడు కావడంతో అతడి పేరు సామాజిక మాధ్యమాల్లో మారుమ్రోగి పోతుంది. జింబాబ్వే సిరీస్‌లో భారత్ తరుపున ఏకైక వన్డే ఆడాడు. ఐపీఎల్‌లో పూణే వారియర్స్, సర్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్లకు ప్రాతినిథ్యం వహించాడు.
భారత్ తరుపున త్వరలో టీ20 మ్యాచ్ ఆడనున్నాడు. అయితే 2009లో పర్వేజ్ రసూల్ జీవితంలో ఓ విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. ది టెలిగ్రాఫ్ రిపోర్ట్ ప్రకారం అండర్-22 ట్రోఫీలో భాగంగా
గతంలో కర్ణాటక జట్టుపై బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్ ఆడేందుకు పర్వేజ్ వెళ్లాడు.

రసూల్‌ని అడ్డుకున్న చిన్నసామి స్టేడియం భద్రతా సిబ్బంది
ఆ సమయంలో చిన్నసామి స్టేడియంలో ఎంటర్ అయ్యే ముందు భద్రతా సిబ్బంది రసూల్‌ని ఆపారు. అతని క్రికెట్ కిట్ బ్యాగ్‌లో పేలుడు పదార్థాలు ఉన్నాయని అనుమానిస్తూ తనిఖీలు చేశారు. అయితే వారి తనిఖీల్లో ఎలాంటి పేలుడు పదార్థాలు దొరకలేదు.

ఈ అవమానంతో పట్టుదల పెరిగింది
దీంతో అతడిని లోపలికి పంపారు. ఇంత అవమానం మరెవరికైనా జరిగిఉంటే ఎలా ఉండేదో కానీ, రసూల్‌లో మాత్రం పట్టుదల పెరిగింది. ఆరోజు మ్యాచ్‌లో 69 పరుగులతో సత్తా చాటాడు. ఆ తర్వాత వాత 2012-13 సీజన్‌లో జమ్మూ కాశ్మీర్ జట్టులో ఆల్‌రౌండర్‌గా రాణించాడు.

594 పరుగులతో టాప్ స్కోరర్
594 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అంతేకాదు 33 వికెట్లు తీసుకుని తానెంటో నిరూపించుకున్నాడు. ఆ తర్వాత జరిగిన రంజీ సీజన్‌లో 663 పరుగులతో పాటు 27 వికెట్లు తీశాడు. దేశీయ క్రికెట్‌లో బెస్ట్ ఆల్ రౌండర్‌గా నిలిచాడు. దీంతో టీమిండియా అవకాశం అతడి తలుపుతట్టింది.

జాతీయ జట్టులో చోటు: గ్రామంలో సంబరాలు
తాజాగా ఇంగ్లాండ్‌తో గురువారం నుంచి ప్రారంభం కానున్న టీ20 సిరీస్‌లో పర్వేజ్ రసూల్ చోటు దక్కించుకోవడంపై రసూల్ గ్రామంలో సంబరాలు జరుపుకుంటున్నారు. రసూల్ దక్షిణ కశ్మీర్‌లోని బిజ్‌బెహరా పట్టణంలో నివాసం ఉంటున్నాడు.

రసూల్‌ను ఎంపిక చేయడం ఆనందంగా ఉంది
టీమిండియాలో రసూల్‌కు చోటు దక్కడంతో స్థానికులంతా తెగ సంబర పడిపోతున్నారు. ఈ విషయంపై కాశ్మీర్ చెందిన అహ్మద్ భట్ మాట్లాడుతూ ‘ఇంగ్లాండ్‌తో సిరీస్ కోసం పర్వేజ్ రసూల్‌ను ఎంపిక చేయడం చాలా ఆనందంగా ఉంది. జింబాబ్వేతో సిరీస్‌కు ఎంపికైనప్పటికీ తుది జట్టులో అతనికి అవకాశం రాలేదు. కానీ ఈసారి ఎలాగైనా తుది జట్టులో ఉంటాడన్న నమ్మకం ఉంది' అని ఆయన అన్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications