హైదరాబాద్‌లో కోహ్లీ సందడి: ట్విట్టర్‌లో ఫోటో వైరల్
హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ హైదరాబాద్‌లో సందడి చేశాడు. బంగ్లాదేశ్‌తో జరిగే ఏకైక టెస్టు కోసం కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా హైదరాబాద్ చేరుకున్న సంగతి తెలిసిందే. ఇరు జట్ల మధ్య ఫిబ్రవరి 9 నుంచి 13 వరకు టెస్టు మ్యాచ్ ప్రారంభంకానుంది.

ఈ నేపథ్యంలో హైదరాబాద్ చేరుకున్న కోహ్లీ, తన తోటి క్రికెటర్లు కేఎల్ రాహుల్, పాండ్యా, జయంత్ యాదవ్‌తో కలిసి దిగిన ఓ ఫొటోను ట్విట్టర్‌లో అభిమానులతో పంచుకున్నాడు. సహచరులతో కలిసి బ్రేక్‌ఫాస్ట్ చేశానని, హైదరాబాద్‌లో ఈ ఉదయం ఎంతో బాగుందని కోహ్లీ ట్విట్టర్‌లో ట్వీట్ చేశాడు.
కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్య, జయంత్ యాదవ్‌తో పాటు అభిమానులందరికీ ఈ రోజు శుభదినం కావాలని కోరుకుంటున్నట్లు కోహ్లీ ట్వీట్ చేశాడు.
Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications