ఆర్సీబీకి మరో ఎదురుదెబ్బ: ఐసీయూలో పార్ధీవ్ పటేల్ తండ్రి


హైదరాబాద్: మూలిగే నక్కమీద తాటి పండు పడటం అంటే ఇదేనేమో! ఐపీఎల్ 2019 సీజన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఎంత మాత్రం కలిసి రావడం లేదు. ఈ సీజన్‌లో ఆ జట్టు ఆడిన 6 మ్యాచ్‌ల్లోనూ ఓటమిపాలై పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో ఉంది. ఇలాంటి సమయంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) జట్టుకు మరో షాక్ తగిలింది.
ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం
ఆర్సీబీ ఓపెనర్ పార్ధీవ్ పటేల్ తన వ్యక్తిగత సమస్య కారణంగా ఆటపై వందశాతం దృష్టి సారించలేకపోతున్నాడు. పార్థివ్ పటేల్ తండ్రి బ్రెయిన్ హోమరేజ్‌తో బాధపడుతూ ఆసుపత్రిలో చేరారు. ఇలాంటి పరిస్థితుల్లో అతడు మనస్సును ఆటపై నిలపగలడాననే సందేహాలను అభిమానులు వ్యక్తం చేశారు.

మీ ప్రార్థనల్లో మా తండ్రి పేరు తలచుకోండి
ఈ ఏడాది ఫిబ్రవరిలో ఐపీఎల్ ఆరంభం కాకముందు పార్థివ్ పటేల్ "మీ ప్రార్థనల్లో మా తండ్రి పేరు తలచుకోండి. ఆయన బ్రెయిన్ హోమరేజ్ వ్యాధితో బాధపడుతున్నాడు" అని ట్విట్టర్‌లో పేర్కొన్నాడు. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దీంతో ప్రతి మ్యాచ్ అనంతరం డ్రెస్సింగ్ రూమ్‌కి వెళ్లిన తర్వాత ఫోన్‌లో ఏదైనా డాక్టర్ల నుంచి బ్యాడ్ న్యూస్ వచ్చిందేమోనని చూసుకుంటున్నట్లు చెప్పాడు.

నా మైండ్‌లో ఆట మీదే ధ్యాస ఉంటుంది
"ఆడుతున్నంత సేపు నా మైండ్‌లో ఆట మీదే ధ్యాస ఉంటుంది. ఒక్కసారి మ్యాచ్ పూర్తి అయితే మళ్లీ నా కుటుంబం గురించే ఆలోచిస్తూ ఉంటా. డాక్టర్లతో టచ్‌లో ఉండటంతో పాటు నా తండ్రి ఆరోగ్యం గురించి క్షేమసమాచారాన్ని తెలుసుకుంటా. కొన్ని సార్లు నేను కొన్ని అత్యవసర నిర్ణయాలను తీసుకుంటా" అని పార్ధీవ్ పటేల్ చెప్పుకొచ్చాడు.

తుది నిర్ణయం తీసుకునేది మాత్రం నేనే
"నేనిక్కడ ఉన్నప్పటికీ... నా తల్లి, భార్య అక్కడి పరిస్థితులను చూసుకుంటూ ఉంటారు. అయితే ఏదైనా తుది నిర్ణయం తీసుకునేది మాత్రం నేనే. ప్రాథమిక ఫేజ్ ఎంతో కఠినం, కొన్ని రోజుల పాటు వెంటిలేటర్‌ను తొలగించారు. ఎంతమొత్తంలో ఆక్సిజన్ ఇస్తున్నారు లాంటి నిర్ణయాలను తీసుకోవడం కొంచెం కఠినమే" అని పార్ధీవ్ పటేల్ తెలిపాడు.

సడన్‌గా కిందపడిపోయిన రోజు నాకు గుర్తు
"ఆయన సడన్‌గా కిందపడిపోయిన రోజు నాకు గుర్తు. ఆ తర్వాత 12 రోజుల పాటు నేను ఐసీయూలో ఉన్నా. 10 రోజుల పాటు నేను ఇంటికి కూడా వెళ్లలేదు. ఆ సమయంలో సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ జరుగుతుంది. కొన్ని మ్యాచ్‌లకు కూడా దూరమయ్యాను. మేము మ్యాచ్‌లు ఆడేటప్పుడు మొబైల్ ఫోన్స్ కూడా లేవు. అయినా సరే.. రోజు మొదలయ్యేది.. పూర్తయ్యేది నా తండ్రి ఆరోగ్యం గురించి తెలుసుకున్నప్పుడే' అని పార్ధీవే చెప్పుకొచ్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications