Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మొహాలి టెస్టుకు పార్దీవ్ పటేల్: ట్విట్టర్‌‌లో ఆశ్చర్యం

హైదరాబాద్: రెగ్యులర్ వికెట్ కీపర్ వృద్ధిమాన్‌ సాహా గాయపడడంతో భారత టెస్టు జట్టులోకి సీనియర్ వికెట్ కీపర్ పార్ధీవ్ పటేల్‌ ఎంపికయ్యాడు. అయితే ఈ ఎంపికపై సగటు క్రీడాభిమాని మాత్రం ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నాడు. 8 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత పార్ధీవ్ పటేల్‌ను ఊహించని విధంగా అవకాశం తలుపు తట్టింది.

దీంతో అతడు ఇంగ్లాండ్‌తో ఈనెల 26 నుంచి మొహాలిలో జరగనున్న మూడో టెస్టుతో టెస్టుల్లోకి పునరాగమనం చేయబోతున్నాడు. పార్థివ్‌ చివరిసారిగా 2008 ఆగస్టులో శ్రీలంకతో కొలంబొలో జరిగిన టెస్టు మ్యాచ్‌‌లో భారత జట్టు తరపున ఆడాడు. 31 ఏళ్ల పార్థివ్‌ ఇప్పటివరకు 20 టెస్టులు ఆడి 29.69 సగటుతో 683 పరుగులు చేశాడు.

ఇందులో నాలుగు అర్ధసెంచరీలు ఉన్నాయి. 17 ఏళ్ల వయసులో 2002లో ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌‌తో టెస్టుల్లో అరంగ్రేటం చేశాడు. ఆరేళ్ల కాలంలో పార్థీవ్ పటేల్‌ కేవలం 20 టెస్టులు మాత్రమే ఆడాడు. 2014లో టెస్టుల నుంచి ధోని రిటైరయ్యాక యువ ఆటగాళ్లకు అవకాశం దక్కడంతో పార్థివ్‌ రంజీలకే పరిమితమయ్యాడు.

రంజీల్లో చక్కగా రాణిస్తున్నా సెలక్టర్లు పార్ధీవ్ పటేల్‌ని పట్టించుకోలేదు. తాజాగా ఇప్పుడు యువ వికెట్‌ కీపర్‌ రిషబ్ పంత్‌ కూడా అందుబాటులో లేకపోవడంతో పార్ధీవ్ పటేల్‌ను అవకాశం వెతుక్కుంటూ వచ్చింది. మొహాలిలో జరిగే టెస్టులో పార్ధీవ్ రాణించినా అతడి కెరీర్‌‌కు ఉపయోగపడకపోవచ్చు.

ఆయాజ్ మీమమ్

మూడో టెస్టులోకి వికెట్ కీపర్‌గా పార్ధీవ్ పటేల్ ఎంపికవ్వడంతో అంతర్జాతీయ క్రికెట్‌లో పార్దీవ్ పటేల్ రోల్ రోలర్ కోస్టర్‌ మాదిరి తయారైందని ట్వీట్ చేశాడు.

పార్ధీవ్‌కు బదులు రిషబ్ పంత్

సీనియర్ వికెట్ కీపర్ పార్ధీవ్ పటేల్‌కు బదులుగా 19 ఏళ్ల రిషబ్ పంత్‌కు అవకాశం ఇస్తే బాగుంటుందని అంటున్నారు.

శివకాంత్ గౌతమ్

సీనియర్ ఆటగాడైన పార్దీవ్ పటేల్‌కు ఛాన్స్ ఇవ్వడంపై బీసీసీఐ నిర్ణయాన్ని పలువురు క్రికెటర్లు ప్రశ్నిస్తున్నారు.

గౌరవ్ కార్లా

ధోని కంటే మూడేళ్ల ముందే పార్దీవ్ పటేల్ అంతర్జాతీయ క్రికెట్ లోకి అరంగేట్రం చేశాడు. పటేల్ వయసు 31. సాహాకు రీప్లేస్ మెంట్ మీకు అతడే దొరికాడా అంటూ చమత్కరిస్తున్నారు.

పార్ధీవ్ సెలక్షన్‌పై ఆశ్చర్యం

సాహా స్ధానంలో పార్దీవ్ పటేల్‌ను ఎంపిక చేయడంపై ట్విట్టర్‌లో ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. విరాట్ కోహ్లీ అండర్-14కు ఆడిన సమయంలో పార్దీవ్ పటేల్ టెస్టు క్రికెట్ లోకి అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత మూడేళ్లకు ధోని వచ్చాడు. ధోని రిటైర్ కావడం, కోహ్లీ కెప్టెన్ అయ్యాడు.

నవనీత్ ముందారా

2002లో పార్దీవ్ పటేల్ అరంగేట్రం చేసినప్పుడు జట్టులో ఏ ఒక్క ఆటగాడు కూడా ఇప్పుటి జట్టులో లేకపోవడం విశేషం.

ఒమర్ అబ్దుల్లా

ఉర్జిత్ పటేల్ గవర్నర్ అయిన తర్వాత హార్ధిక్ పటేల్‌కు టీమిండియా తరుపున ఆడే అవకాశం వచ్చిందని ట్వీట్ చేశాడు.

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+