Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

WTC Final: అశ్విన్‌కి ఛాన్స్ ఇచ్చి.. జడేజాపై వేటు వేయాలి: పార్థీవ్ పటేల్

Parthiv Patel says India Should Play Ravichandran Ashwin Instead of Ravindra Jadeja in WTC Final
Parthiv Patel Feels India Should Play Ravichandran Ashwin Instead of Ravindra Jadeja

ముంబై: భారత్-న్యూజిలాండ్‌ జట్ల మధ్య సౌథాంప్టన్‌ వేదికగా జూన్‌ 18న ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. టెస్ట్ క్రికెట్ చరిత్రలో తొలిసారి డబ్ల్యూటీసీ ఫైనల్‌ జరగనున్న నేపథ్యంలో అందరి దృష్టి దీనిపైనే ఉంది. అభిమానులే కాకుండా మాజీ క్రికెటర్లు కూడా ఈ సమరంపై ఆసక్తికనబరుస్తున్నారు. అంతేకాదు కొందరు మాజీలు ఇరు జట్లకు పలు సూచనలు, సలహాలు ఇస్తున్నారు. ఈ క్రమంలోనే టీమిండియా మాజీ వికెట్ కీపర్ పార్థీవ్ పటేల్.. భారత కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఓ సలహా సూచించాడు.

గ్రీన్ పిచ్‌పై నిర్వహిస్తే

గ్రీన్ పిచ్‌పై నిర్వహిస్తే

న్యూజిలాండ్‌ జట్టుతో డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్‌కి పచ్చికతో నిండిన పిచ్‌ని సిద్ధం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇంగ్లండ్ పిచ్‌లు కూడా పేసర్లకు అనుకూలం. ఈ నేపథ్యంలో భారత తుది జట్టు కూర్పుపై పార్థీవ్ పటేల్ తాజాగా స్పందించాడు. ముగ్గురు పేసర్లు, ఒక స్పిన్నర్‌‌తో టీమిండియా బరిలోకి దిగాలని మాజీ వికెట్ కీపర్ పార్థీవ్ పటేల్ సూచించాడు. ముగ్గురు పేసర్లు, ఒక స్పిన్నర్‌‌తో టీమిండియా బరిలోకి దిగాలని సూచించాడు. ఒకవేళ ఫైనల్‌‌ మ్యాచ్‌ని గ్రీన్ పిచ్‌పై నిర్వహిస్తే.. స్టార్ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజాని పక్కన పెట్టి స్పెషలిస్ట్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ని మాత్రమే ఆడిస్తే సరిపోతోందని పార్థీవ్ పేర్కొన్నాడు.

అశ్విన్‌ని మాత్రమే ఆడిస్తే సరిపోతోంది

అశ్విన్‌ని మాత్రమే ఆడిస్తే సరిపోతోంది

పార్థీవ్ పటేల్ స్టార్ స్పోర్ట్స్‌లో మాట్లాడుతూ... 'ఒకవేళ డబ్ల్యూటీసీ ఫైనల్‌‌ మ్యాచ్‌ని గ్రీన్ పిచ్‌పై నిర్వహిస్తే.. రవీంద్ర జడేజాని పక్కన పెట్టి ఆర్ అశ్విన్‌ని మాత్రమే ఆడిస్తే సరిపోతోంది. జడేజా స్థానంలో అదనపు బ్యాట్స్‌మెన్‌ని తీసుకోవాలి. గత కొంతకాలంగా భారత్ జట్టు ఎక్కువగా టెస్టు మ్యాచ్‌లు ఆడలేదు. కాబట్టి బ్యాటింగ్‌ లోతుని పెంచుకోవడం ఎంతో మంచిది. ముగ్గురు ఫాస్ట్ బౌలర్లు, ఒక స్పిన్నర్‌‌ చాలు. వారు పనిని పూర్తి చేయగలరు. పిచ్‌పై పచ్చిక ఎక్కువగా ఉంటే.. రెండో స్పిన్నర్ అవసరం లేదు' అని అన్నాడు. అశ్విన్ వికెట్ల పతనాన్ని అడ్డుకుంటాడు కానీ జడేజాలా వేగంగా పరుగులు చేయలేడు. అయితే బౌలింగ్‌లో జడేజా కంటే అశ్విన్ ప్రభావితం చేయగలడు.

కోహ్లీ సాహసం చేస్తాడా?

కోహ్లీ సాహసం చేస్తాడా?

గతంలో హార్దిక్‌ పాండ్యా, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చహల్‌ రావడంతో రవీంద్ర జడేజాకు జట్టులో చోటు లేకుండా పోయింది. రెండేళ్లు జడేజాకు పరిమిత ఓవర్ల క్రికెట్లో సరైన అవకాశాలు లభించలేదు. టెస్టు జట్టులో ఉన్నప్పటికీ రిజర్వు బెంచీపైనే ఉన్నాడు. ఎప్పుడైతే వెన్నెముక గాయంతో హార్దిక్ జట్టుకు దూరమయ్యాడో జడ్డూ కీలకంగా మారాడు. మూడు ఫార్మాట్లలో దుమ్మురేపుతున్నాడు.

బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో తనదైన ముద్ర వేశాడు. ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లోని 10 మ్యాచుల్లో జడేజా 469 పరుగులు చేశాడు. ఇక బంతితో 28 వికెట్లు పడగొట్టాడు. మరి పార్థీవ్ పటేల్ సూచించినట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ.. జడేజాపై వేటు వేసే సాహసం దాదాపు చేయకపోవచ్చు.

ప్రాక్టీస్‌ చేస్తున్న ప్లేయర్స్

ప్రాక్టీస్‌ చేస్తున్న ప్లేయర్స్

న్యూజిలాండ్‌తో ప్రతిష్టాత్మక ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్ జూన్‌ 18 నుంచి ఆరంభంకానున్న నేపథ్యంలో విరాట్‌ కోహ్లీ సారథ్యంలోని భారత ఆటగాళ్లు ఆదివారం మైదానంలోకి అడుగుపెట్టారు. అందరూ ప్రాక్టీస్‌లో పూర్తిగా నిమగ్నమయ్యారు. దాదాపు మూడు వారాల తర్వాత టీమిండియాకు తొలి ట్రైనింగ్‌ సెషన్‌ కావడంతో.. ఆటగాళ్లంతా హుషారుగా ప్రాక్టీస్‌లో పాల్గొన్నారు. ఛాంపియన్‌షిప్‌ అనంతరం భారత జట్టు రూట్ సేనతో టెస్ట్ సిరీస్ ఆడనున్న విషయం తెలిసిందే.

Story first published: Tuesday, June 8, 2021, 14:42 [IST]
Other articles published on Jun 8, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+