Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Parthiv Patel : రవిచంద్రన్ అశ్విన్‌కు ఆ అవకాశమే లేదు.. అతని కంటే వాళ్లే బెటర్

Parthiv Patel : Ravichandran Ashwin is not Going To Select For T20 World Cup Squad

భారత టీ20 ప్రపంచకప్ జట్టులో రవిచంద్రన్ అశ్విన్‌కు చోటు దక్కే అవకాశమే లేదని మాజీ భారత క్రికెటర్ పార్థివ్ పటేల్ పేర్కొన్నాడు. ఎనిమిది నెలల తర్వాత వెస్టిండీస్‌‌తో టీ20 సిరీస్‌ కోసం అశ్విన్‌ తిరిగి భారత జట్టు తరఫున ఆడుతున్నాడు. అతను ఇంగ్లాండ్‌తో రీషెడ్యూల్డ్ టెస్ట్ సిరీస్‌కు ఎంపికైనప్పటికీ.. తుది జట్టులో మాత్రం చోటు దక్కించుకోలేకపోయాడు. ప్రస్తుతం వెస్టిండీస్‌తో జరుగుతున్న టీ20 సిరీస్ తొలి మ్యాచ్‌లో అతను తుది జట్టులో చోటు పొందాడు. ఆఫ్-స్పిన్నర్ అయిన అశ్విన్ ఈ ఏడాది జరిగిన ఐపీఎల్ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున మంచి ప్రదర్శన కనబర్చాడు. అతను బ్యాటింగ్లో విలువైన పరుగులు చేయడంతో పాటు బౌలింగ్లోనూ మంచి ఎకానమీ కనబరిచాడు. తాజాగా విండీస్‌తో జరిగిన తొలి టీ20 అశ్విన్ నాలుగు ఓవర్లలో కేవలం 22 పరుగులిచ్చి రెండు వికెట్లు తీసుకున్నాడు.

అయితే ఈ అక్టోబరులో టీ20 ప్రపంచకప్ జట్టులో అశ్విన్ ఆడకపోవచ్చని పార్థివ్ పటేల్ అభిప్రాయపడ్డాడు. వెస్టిండీస్‌తో జరగబోయే తదుపరి టీ20 మ్యాచ్‌‌లో (ఒకవేళ ఇద్దరు స్పిన్నర్లనే తీసుకుంటే) అశ్విన్‌కు చోటు దక్కడం కష్టమేనని.. అతని కంటే రవి బిష్ణోయ్ ఆడ్డానికే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని పార్థివ్ చెప్పాడు. టీ20 ప్రపంచకప్ జట్టుకు ఒకవేళ అశ్విన్ ఎంపికైన రాణించడం కష్టమేనని.. అతని కంటే బిష్ణోయ్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్ లాంటి మణికట్టు స్పిన్నర్లు వైవిధ్యమైన బంతులతో రాణించగలరని పార్థివ్ చెప్పాడు. మణికట్టు స్పిన్నర్లు ఆట మధ్యలో అటాకింగ్ ఆప్షన్‌ను అందించగలరని, అశ్విన్ ఆ పని చేయలేడని పార్థివ్ చెప్పాడు.

వెస్టిండీస్ పర్యటనలో వ్యూహాత్మకంగా భారత్ అద్భుతంగా ఆడుతుందని పార్థివ్ పటేల్ అభిప్రాయపడ్డాడు. వన్డే సిరీస్లోని చివరి వన్డేలో కూడా వర్షం తర్వాత బ్యాటింగ్‌కు వచ్చినప్పుడు మళ్లీ వర్షం వస్తుందని భావించి కాస్త దూకుడుగా ఆడారని.. అది డక్ వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం లాభించిందని పేర్కొన్నాడు. అలాగే తొలి టీ20లో వ్యూహాత్మకంగా ముగ్గురు స్పిన్నర్లను బరిలోకి దించి టీం డిఫెరెంట్ ప్రయోగం చేసిందన్నాడు. రోహిత్ శర్మ బౌలింగ్లో వేరియేషన్లను సమర్థంగా వినియోగించుకున్నాడని ప్రశంసించాడు.

Story first published: Sunday, July 31, 2022, 18:28 [IST]
Other articles published on Jul 31, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+