Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

పార్ధీవ్‌కు చపాతీ గ్లౌజులు: ఆశ్చర్యంలో ముంచెత్తిన సెహ్వాగ్ ట్వీట్‌

 Parthiv Patel has big hands? Twitterati go ROFL when Patel turns down Virender Sehwag's UNIQUE offer

హైదరాబాద్: టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ మరోసారి తన ట్వీట్‌తో అభిమానులను ఆశ్చర్యంలో ముంచెత్తాడు. తాజాగా సెహ్వాగ్‌ ట్వీట్ దక్షిణాఫ్రికా టెస్టు సిరిస్‌కు ఎంపికైన వికెట్‌ కీపర్‌ పార్దీవ్‌ పటేల్‌ వైపు మల్లింది. అయితే సెహ్వాగ్ చేసిన సరదా ట్వీట్‌కు పార్ధీవ్‌ పటేల్ కూడా అదే రీతిలో రిప్లై ఇవ్వడం విశేషం.

కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా ప్రస్తుతం మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్ కోసం దక్షిణాఫ్రికాలో పర్యటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ టెస్టు సిరిస్ కోసం టీమిండియా సెలక్టర్లు పార్దీవ్ పటేల్‌ను రెండో వికెట్ కీపర్‌గా ఎంపిక చేశారు. ఈ నేపథ్యంలో సెహ్వాగ్‌ చేతి గ్లౌజ్‌ల ఆకారంలో చేసిన రెండు చపాతీలతో కూడిన ఫోటోను తన ట్విట్టర్‌లో పోస్టు చేశాడు.

'పార్దీవ్‌ భయ్యా.. నీకు అక్కడ వికెట్‌ కీపింగ్‌ చేసేందుకు గ్లౌజులు ఉన్నాయా లేక నన్ను వీటిని పంపించమంటావా' అని కామెంట్ పెట్టాడు.

సెహ్వాగ్ ట్వీట్‌కు పార్టీవ్ పటేల్ తనదైన శైలిలో జవాబిచ్చాడు. 'నాకు ఇక్కడ కరెక్ట్‌ సైజుతో మంచి చేతి గ్లౌజులు ఉన్నాయి. అవి నీ దగ్గరే అట్టిపెట్టుకో. ఎందుకంటే ఢిల్లీలో చలి ఎక్కువగా ఉంది కదా. మీ ఇంట్లో ఎవరికో ఒకరికి ఉపయోగపడతాయి' అని బదులిచ్చాడు.

తొలుత ఈ ఫొటోను పంచుకున్న సెహ్వాగ్‌..'కొత్తగా పెళ్లైన వ్యక్తి తన భార్యను ప్రేమతో నీ చేతి చపాతీ తినాలని ఉంది అని అడగ్గా.. ఆమె ఇలా చేసింది' అంటూ సరదాగా పేర్కొన్నాడు. మరోవైపు సెహ్వాగ్ ట్వీట్‌కు గాను నెటిజన్లు కూడా తమైదైన శైలిలో స్పందిస్తూ పెద్ద ఎత్తున ట్వీట్లు పోస్టు చేశారు.

ఇదిలా ఉంటే గతేడాది న్యూజిలాండ్‌ జట్టు భారత్‌లో పర్యటించిన సమయంలో ఆ దేశ ఆటగాడు రాస్ టేలర్‌ను టైలర్‌తో పోలుస్తూ వీరేంద్ర సెహ్వాగ్ చేసిన ట్వీట్లు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.

Story first published: Wednesday, January 10, 2018, 17:57 [IST]
Other articles published on Jan 10, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+