Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

పార్ధీవ్ పటేల్ సంచలనం: 'సెలక్టర్ల కోసం క్రికెట్ ఆడటం లేదు'

హైదరాబాద్: ఇటీవల ముగిసిన ఐపీఎల్ పదో సీజన్‌లో బ్యాట్‌తో మెరుగ్గా రాణించిన పార్థీవ్ పటేల్ ముంబయి జట్టు టైటిల్ గెలవడంలో క్రియాశీలక పాత్ర పోషించాడు. జూన్ 1 నుంచి ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీలో వికెట్ కీపర్, బ్యాట్స్‌మెన్ పార్దీవ్ పటేల్‌కు చోటు దక్కని సంగతి తెలిసిందే. దీనిపై ఏమైనా అసంతృప్తిగా ఫీలయ్యారా..? అని ప్రశ్నించగా తనదైన శైలిలో ఈ వికెట్ కీపర్ సమాధానమిచ్చాడు.

టీమిండియాలో చోటు కోసం సెలెక్టర్ల దృష్టిలో పడేందుకు తాను క్రికెట్‌ ఆడటంలేదని పార్థివ్‌ పటేల్‌ స్పష్టం చేశాడు. ఆదివారం ముగిసిన ఐపీఎల్‌ ఫైనల్లో విజేతగా నిలిచిన ముంబై ఇండియన్స్‌ జట్టులో పార్దీవ్ పటేల్ సభ్యుడిగా ఉన్న సంగతి తెలిసిందే.

తాజాగా ఛాంపియన్స్‌ ట్రోఫీ కోసం ఎంపికైన భారత తుది జట్టులో చోటు దక్కనందుకు తనకు ఎలాంటి బాధ లేదని తేల్చి చెప్పాడు. 'నిజం చెప్పాలంటే సెలక్షన్స్‌ గురించి ఆలోచించను. అది నా పని కాదు. సెలెక్టర్ల దృష్టిలో పడేందుకే క్రికెట్‌ ఆడను. చాలా ఏళ్లుగా ఈ ఆటలో ఉన్నా. క్రికెట్‌ ఆడటాన్ని ఆస్వాదిస్తా' అని చెప్పాడు.

నా ప్రదర్శనతో సంతృప్తిగా ఉన్నా

నా ప్రదర్శనతో సంతృప్తిగా ఉన్నా

'ఈ ఏడాది నా ప్రదర్శనతో సంతృప్తిగా ఉన్నా. రంజీ ట్రోఫీ గెలవడంతో పాటు టెస్టుల్లో పునరాగమనం, టైటిల్‌ విజేత ముంబై ఇండియన్స్‌లో భాగమవడం చాలా ఆనందాన్నిచ్చింది. నా ప్రదర్శనను ఇలాగే కొనసాగిస్తా జరగాల్సినవన్నీ అవే జరుగుతాయి' అని పార్దీవ్ పటేల్ చెప్పడం విశేషం.

పాండే స్థానంలో దినేశ్ కార్తీక్

పాండే స్థానంలో దినేశ్ కార్తీక్

గాయం కారణంగా ఛాంపియన్స్ టోర్నీ నుంచి వైదొలిగిన యువ క్రికెటర్ మనీశ్ పాండే స్థానంలో తమిళనాడుకు చెందిన వికెట్ కీపర్, బ్యాట్స్ మెన్ అయిన దినేశ కార్తీక్‌ను బీసీసీఐ ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. ఈ ఐపీఎల్‌లో గుజరాత్‌ లయన్స్‌కు ప్రాతినిధ్యం వహించిన కార్తీక్‌ ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్నాడు.

జస్ ప్రీత్ బుమ్రాపై షేన్ బాండ్

జస్ ప్రీత్ బుమ్రాపై షేన్ బాండ్

14 మ్యాచ్‌ల్లో 36.10 సగటుతో 361 పరుగులు చేశాడు. అంతకుముందు విజయ్‌ హజారే ట్రోఫీ, దేవ్‌ధర్‌ ట్రోఫీ ఫైనల్స్‌లో సెంచరీలు చేసి మ్యాన ఆఫ్‌ ద మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ముంబై విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించిన డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ జస్ ప్రీత్ బుమ్రాపై ముంబై బౌలంగ్ కోచ్, న్యూజిలాండ్ మాజీ పేసర్ షేన్ బాండ్ ప్రశంసలు కురిపించాడు.

బుమ్రాకు మొదటి 50 ఓవర్ల టోర్నీ

బుమ్రాకు మొదటి 50 ఓవర్ల టోర్నీ

ఛాంపియన్స్ ట్రోఫీకి బీసీసీఐ ప్రకటించిన 15 మంది జట్టు సభ్యుల్లో జస్ ప్రీత్ బుమ్రా ఒకడు. రాబోయే రోజుల్లో బుమ్రా విజయవంతమైన బౌలర్‌గా రాణిస్తాడని తెలిపాడు. బుమ్రాకు ఇది మొట్టమొదటి 50 ఓవర్ల టోర్నమెంట్ అని, అయితే కొంచెం ఇబ్బంది తప్పదని పేర్కొన్నాడు.

Story first published: Monday, November 13, 2017, 12:15 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+