మొహాలి: ఎనిమిదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత భారత టెస్టు జట్టులో చోటు దక్కించుకున్న వికెట్ కీపర్ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య మొహాలిలో మూడో టెస్టు శనివారం ప్రారంభమైంది.
రెగ్యులర్ కీపర్ సాహా స్ధానంలో తుది జట్టులో చోటు సంపాదించిన పార్ధీవ్ పటేల్ వికెట్ కీపర్‌గా 50 మందిని ఔట్ చేసిన అరుదైన ఘనతను సాధించాడు. 50 అంతకన్నా ఎక్కువ మందిని ఔట్ చేసిన భారత వికెట్ కీపర్లలో పార్థివ్ ఎనిమిదో వికెట్ కీపర్‌గా రికార్డు సృష్టించాడు.
ఎనిమిదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మొహాలి టెస్టులో చోటు దక్కించుకున్న పార్ధీవ్ పటేల్ ఇంగ్లాండ్ కెప్టెన్ అలెస్టర్ కుక్‌ను ఔట్ చేయడంతో ఈ ఘనతను సాధించాడు. మొహాలి టెస్టు మ్యాచ్‌కు ముందు పార్దీవ్ పటేల్ 41 క్యాచ్‌లు, 8 స్టంపింగ్‌లు చేశాడు.

ఇదిలా ఉంటే పార్దీవ్ పటేల్ భారత టెస్టు జట్టులో చోటు కోల్పోయిన ఈ ఎనిమిదేళ్లలో టీమిండియా 83 టెస్టు మ్యాచ్‌లాడింది. కాగా, 50 కన్నా పైగా మ్యాచ్‌ల్లో జట్టులో చోటు కోల్పోయిన ఏ ఆటగాడు మళ్లీ తిరిగి జట్టులోకి వచ్చిన దాఖలు లేకపోవడం విశేషం.
ఇది కేవలం పార్ధీవ్ పటేల్ విషయంలో మాత్రమే చోటు చేసుకుంది. లంచ్ విరామ సమయానికి 29 ఓవర్లకు గాను ఇంగ్లాండ్ 4 వికెట్లు కోల్పోయి 92 పరుగులు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ ప్రారంభంలో దూకుడుగా ఆడింది. ఆ తర్వాత కుక్, హమీద్ జోరుకు ఉమేష్ యాదవ్ బ్రేక్ వేశాడు.
ఓపెనర్ హషిబ్ హమిద్(9)ను ఉమేశ్ యాదవ్ పెవిలియన్‌కు పంపించగా, ఆ తర్వా జో రూట్(15)ను జయంత్ యాదవ్ పెవిలియన్‌కు పంపాడు. వెంటనే కెప్టెన్ కుక్ (27)ను అశ్విన్ పెవిలియన్‌కు పంపడంతో ఇంగ్లాండ్ కష్టాల్లో పడింది. ఇక నాలుగో వికెట్‌గా మొయిన్ అలీ(16)ని షమీ పెవిలియన్‌కు పంపాడు. దీంతో 65 ఓవర్లకు గాను 5 వికెట్లను కోల్పోయిన ఇంగ్లాండ్ 208 పరుగులు చేసింది.