Paris Olympics 2024: ఒలింపిక్స్‌లో బెస్ట్ మూమెంట్స్ (Video)
పారిస్ ఒలింపిక్స్ ఆసక్తికరంగా సాగుతోంది. భారత్ ఖాతాలో ఇప్పటివరకు మూడు కాంస్య పతకాలు చేరాయి. ఆ మూడూ షూటింగ్‌లోనే రావడం విశేషం. అయితే విశ్వక్రీడలు ఆరంభమై ఏడు రోజులు పూర్తయ్యాయి. ఈ వారంలో ఎన్నో సంచలనాలు, రికార్డులు నమోదయ్యాయి. అలాగే నెట్టింటిని షేక్ చేసే బెస్ట్ మూమెంట్స్ ఉన్నాయి. వాటిని ఓ లుక్ వేద్దాం..
షార్ప్ షూటర్ కిమ్ యేజీ
దక్షిణ కొరియా షార్ప్ షూటర్ కిమ్ యే జీకి సోషల్ మీడియాలో విపరీతమైన పాపులారిటీ పెరిగింది. జేమ్స్ బాండ్ తరహాలో కాన్ఫిడెంట్‌తో స్టైలిష్‌గా బుల్లెట్లను దించుతూ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మహిళల ఈవెంట్‌లో రజతం సాధించింది. ఈ 31 ఏళ్ల సుందరి షూటింగ్ వీడియోలు నెట్టింట షేక్ చేస్తున్నాయి. ఆమెకు గత మే నుంచి ఆదరణ పెరిగింది. అజర్‌బైజాన్‌లో జరిగిన ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్ ఫెడరేషన్ వరల్డ్ కప్ నుంచి ఆమె ఫేమస్ అయ్యింది.

అతడు లాంటి 'ఆమె'తో బాక్సింగ్
పారిస్ ఒలింపిక్స్‌లో 66 కేజీల ప్రిక్వార్టర్స్ హాట్ టాపిక్‌గా మారింది. పురుష లక్షణాలున్న అల్జీరియా బాక్సర్ ఇమానె ఖెలిఫ్‌ను ఇటలీ బాక్సర్ ఏంజెలా కెరాని ఒక్క నిమిషం కూడా ఎదుర్కోలేకపోయింది. ముక్కు విరిగిపోయిందనే అనుమానంతో, ఖెలిఫ్ పంచ్‌లను భరించలేక 46 సెకన్లలోనే బౌట్ నుంచి తప్పుకుంది. గతేడాది జరిగిన ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో ఫైనల్‌కు ముందు ఖెలిఫ్‌పై అంతర్జాతీయ బాక్సింగ్ సమాఖ్య వేటు వేసింది. ఆమెలో ఎక్స్‌వై క్రొమోజోమ్స్, టెస్టోస్టిరాన్‌లు పురుషుల స్థాయిలో ఉన్నాయని డీఎన్‌ఏ పరీక్షల్లో తేలింది. కానీ భిన్న నిబంధనలు కలిగిన అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ మాత్రం ఖెలిఫ్‌కు ఈ విశ్వక్రీడల్లో పోటీపడే అవకాశం కల్పించడం గమనార్హం.
చరిత్రలో నిలిచే ఫొటో
పారిస్ ఒలింపిక్స్‌లో తొలిసారి నిర్వహిస్తున్న సర్ఫింగ్ పోటీలలో చరిత్రలో నిలిచే ఫొటో క్యాప్చర్ అయ్యింది. బ్రెజిల్‌కు చెందిన గాబ్రియేల్ మదీనా చేసిన విన్యాసం ఆకట్టుకుంది. తహిటి దీవులలో జరుగుతున్న ఈ పోటీలో గాబ్రియెల్, అతడు వినియోంచిన సర్ఫింగ్ బోర్డ్ అలల తాకిడికి ఒకేసారి సమాంతరంగా గాల్లోకి లేచాయి. ఆ క్షణంలో చేయి పైకి లేపి వేలును చూపిసస్తున్నప్పుడు జెరోమ్ బ్రోలెట్టె తన కెమెరాను క్లిక్‌మనిపించాడు. దీన్ని 'పిక్చర్ ఆఫ్ ది ఒలింపిక్స్' అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా, గాబ్రియెల్ 9.90 రికార్డు స్కోరు నమోదు చేశాడు.
వయసు అయిపోలేదు!
పారిస్ ఒలింపిక్స్‌లో టర్కీ షూటర్ యుసుఫ్ డికెక్ మెడల్ సాధించిన తీరు అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. 10 మీటర్ల మిక్స్‌డ్ ఎయిర్ పిస్టల్ ఈ వెంట్‌లో యుసుఫ్ డికెక్-సెవ్వల్ ఇలాదా తర్హాన్ జోడీ రజతం సాధించింది. అయితే సాధారణంగా షూటింగ్ ఈవెంట్లలో షూటర్స్ చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. మెరుగైన గురి కోసం సన్‌గ్లాసెస్, బయట నుంచి వచ్చే శబ్దాల నుంచి రక్షణ కోసం ఇయర్ ప్రొటక్టర్లను వాడుతుంటారు. కానీ, 51 ఏళ్ల యూసఫ్ ఇవేవి లేకుండా వచ్చి పతకం గెలిచేశాడు. ఓ టీషర్ట్ వేసుకొని కాజువల్‌గా ఈ పోటీలో నిలిచాడు.
శత్రువులు కాదు.. మిత్రులు
ఉత్తరకొరియా-దక్షిణ కొరియా దేశాలకు చెందిన క్రీడాకారులు ఒకే వేదికపై సెల్ఫీలు తీసుకున్నారు. ఇరు దేశాల మధ్య సాధారణంగా పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితులు ఉంటాయి. కానీ దేశ గొడవలను సరిహద్దులకే పరిమితం చేసి విశ్వవేదికపై ఆటగాళ్లు ప్రేమను పంచుకున్నారు. మిక్స్‌డ్ టేబుల్ టెన్నిస్ ఈవెంట్ అనంతరం ఈ మధుర క్షణాలు చోటు చేసుకున్నాయి. చైనా జట్టుతో కలిసి ఉత్తర-దక్షిణ కొరియా ఆటగాళ్లు సెల్పీలు దిగారు.
అమ్మకు వందనం
ఈ విశ్వక్రీడల్లో గర్భిణి అయి కూడా ఇద్దరు క్రీడాకారిణులు పతక లక్ష్యంగా బరిలోకి దిగడం విశేషం. ఈజిప్ట్ ఫెన్సర్ నడా హఫీజ్, అజార్‌బైజాన్ ఆర్చర్ యైలగుల్ రమజనోవా ప్రత్యర్థులతో పోటీపడ్డారు. నడా హఫీజ్ ఏడు నెలల గర్భిణి కాగా, రమజనోవా ఆరున్నెర నెలల బిడ్డను మోస్తోంది. మూడో సారి ఒలింపిక్స్‌లో ఆడుతున్న నడా సాబెర్ ఈవెంట్లో ప్రిక్వార్టర్స్‌కు చేరింది. ఇక రమజనోవా చైనీస్ ఆర్చర్‌పై ఉత్కంఠభరిత పోరులో గెలిచింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications