పారిస్ ఒలింపిక్స్‌లో బరిలోకి దిగుతున్న భారత క్రీడాకారులకు మద్దతు ఇవ్వాలని అభిమానులకు పిలుపునిచ్చిన స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లికి ఒలింపిక్ పతక విజేత నీరజ్ చోప్రా ధన్యవాదాలు తెలిపాడు. మరో పది రోజుల్లో పారిస్ ఒలింపిక్స్-2024 ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. జులై 26 నుంచి మొదలయ్యే ఈ విశ్వక్రీడలు ఆగస్టు 11 వరకు కొనసాగుతాయి.
అయితే ఈ అతి పెద్ద క్రీడా ఈవెంట్‌లో బరిలోకి దిగుతున్న భారత క్రీడాకారుల గురించి విరాట్ కోహ్లి స్పెషల్ వీడియా చేశాడు. పతకాలు సాధించాలని శుభాకాంక్షలు చెబుతూ వీడియో విడుదల చేశాడు. ''ఒకప్పుడు భారత్‌ను ఏనుగులు, పాములు ఆడించేవారిగా ప్రపంచం భావించింది. కానీ ఇప్పుడు అంతా మారింది. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా, గ్లోబల్ టెక్ హబ్‌గా భారత్ అవతరించింది. క్రికెట్, బాలీవుడ్, స్టార్టప్ యునికార్న్స్‌తో ఆర్థిక రంగంలో దూసుకెళ్తోంది''

''ఇక భారత్ ఏదైనా సాధించాల్సి ఉందంటే.. అది ఒలింపిక్స్‌లో మరిన్ని పతకాలే. ఈసారి గతంలో కంటే ఎక్కువ పతకాలు భారత అథ్లెట్లు సాధించాలి. మన సోదర సోదరీమణులు పారిస్‌కు బయల్దేరారు. మెడల్స్ కోసం ఆకలితో పయనమయ్యారు. సగర్వంగా ప్రపంచవేదికపై మువన్నెల జెండాను ఎగరవేయాలని సంకల్పంతో పతకాలు అందుకోవడానికి సిద్ధమైన వాళ్ల ముఖాలను గుర్తుంచుకుందాం. జైహింద్, గుడ్ లక్ ఇండియా'' అని విరాట్ కోహ్లీ వీడియోలో పేర్కొన్నాడు.
దీనికి జావెలిన్ త్రో స్టార్ నీరజ్ చోప్రా రిప్లై ఇచ్చాడు. ఒలింపిక్ అథ్లెట్లకు మద్దతు ఇవ్వాలని తన అభిమానులకు పిలుపునివ్వడంపై బదులచ్చాడు. విరాట్ కోహ్లికి ధన్యవాదాలు తెలిపాడు. కోహ్లికి థ్యాంక్స్ చెబుతూ ప్రపంచ వేదికగా త్రివర్ణ పతకాన్ని ఎరుగవేస్తామని సింబాలిక్‌గా పోస్ట్ చేశాడు. టోక్నో ఒలింపిక్స్‌లో స్వర్ణాన్ని గెలిచి చరిత్ర సృష్టించిన చోప్రా ఈసారి కూడా పసిడిపై గురిపెట్టాడు. అథ్లెటిక్స్‌లో బంగారు పతకం సాధించిన తొలి భారత ప్లేయర్‌గా నీరజ్ చోప్రా నిలిచిన విషయం తెలిసిందే. పారిస్ ఒలింపిక్స్‌లోనూ సత్తాచాటాలని పట్టుదలతో బరిలోకి దిగుతున్నాడు.