ఆ పరాటా మేకర్: ఇప్పుడు సూపర్ క్రికెటర్ అయ్యాడు!
ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లో ఇటీవల చాయ్‌వాలా సోషల్ మీడియా ద్వారా ప్రచారం పొంది ఇప్పుడు ఏకంగా మోడల్ అయిపోయాడు. ఇప్పుడు ఓ పరాటా మేకర్ పాకిస్థాన్ క్రికెట్‌లో సంచలనంగా మారుతున్నాడు. తన లక్ష్యం పాక్ జాతీయ జట్టుకు ఆడటమేనంటున్నాడు.
వివరాల్లోకి వెళితే.. బలూచిస్థాన్‌కు చెందిన హనన్ ఖాన్ అనే యువకుడు స్థానిక రెస్టారెంట్లో పరాటా మేకర్‌గా పనిచేస్తూ క్రికెట్ ఆడుతున్నాడు. హోటల్‌లో వచ్చే డబ్బులతోనే క్రికెట్ కిట్ కొని ప్రాక్టీస్ చేసేవాడు. జిల్లా స్థాయిలో లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్స్ మన్‌గా అతని ప్రతిభ గురించి తెలుసుకున్న క్రికెట్ పెద్దలు క్వెట్టా డొమెస్టిక్ గ్రేడ్-2 మ్యాచ్‌లో అవకాశం కల్పించారు.
అక్కడ చక్కటి ప్రదర్శన కనబర్చడంతో క్వెట్టా గ్లాడియేటర్స్ జట్టుకు ఎంపికై పాకిస్థాన్ సూపర్ లీగ్(పీఎస్‌ఎల్)లో ఆడాడు. ఇటీవలే పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అతనికి బంపర్ ఆఫర్ ఇచ్చింది. అదేంటంటే.. జాతీయ క్రికెట్ అకాడమీ జట్టుకు అతడ్ని ఎంపిక చేసింది.

జనవరి 14 నుంచి పాక్ నేషనల్ క్రికెట్ అకాడమీ(ఎన్‌సీఏ), మలేసియా జట్ల మధ్య లాహోర్‌లో టీ20 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ సిరీస్‌లోగానీ హనన్ ఖాన్ మెరిస్తే గనుక, నేరుగా జాతీయ జట్టులో చోటు దక్కించుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.
'ఎన్‌సీఏ జట్టులోకి ఎంపిక చేసినందుకు క్రికెట్ బోర్డుకు ధన్యవాదాలు. ఈ అవకాశం ఇంత తొందరగా వస్తుందనుకోలేదు. అంతా అల్లా దయ. ఎప్పటికైనా జాతీయ జట్టులో ఆడాలన్నదే నా కల' అని క్రికెటర్‌గా ఎదుగుతున్న ఈ పరాటా మేకర్ హనన్ ఖాన్ చెప్పుకొచ్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications