Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

పప్పా.. నీకు వయస్సు పెరిగిపోతోంది: జీవా ధోనీ

Papa you are getting older: Ziva wishes daddy MS Dhoni on birthday in adorable video

హైదరాబాద్: భారత సీనియర్ క్రికెటర్ మహేంద్రసింగ్ ధోనీ, తన కూతురు జీవా మధ్య అప్యాయత అందరినీ ఆకట్టుకుంటుంది. తండ్రిపై తనకున్న ప్రేమాభిమానాన్ని జీవా చాటిన తీరు కట్టిపడేస్తుంది. ఇంగ్లాండ్‌తో రెండో టీ20 మ్యాచ్ పూర్తయిన తర్వాత తన భార్య సాక్షి, పాప జీవాతో పాటు సహచర క్రికెటర్లతో కలిసి ధోనీ పుట్టిన రోజు వేడుకలు చేసుకున్నాడు. కోహ్లీ భార్య అనుష్కశర్మ కూడా ఇందులో పాల్గొంది. మహీ పుట్టినరోజును పురస్కరించుకుని విరాట్, రోహిత్‌శర్మ, రైనా, రాహుల్, మాజీ క్రికెటర్లు సచిన్, సెహ్వాగ్, లక్ష్మణ్, కైఫ్ సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.

ఇంగ్లండ్‌తో రెండో టీ20 మ్యాచ్ పూర్తయిన తర్వాత తన భార్య సాక్షి, పాప జివాతో పాటు సహచర క్రికెటర్లతో కలిసి ధోనీ పుట్టిన రోజు వేడుకలు చేసుకున్నాడు. కోహ్లీ భార్య అనుష్కశర్మ కూడా ఇందులో పాల్గొంది. మహీ పుట్టినరోజును పురస్కరించుకుని విరాట్, రోహిత్‌శర్మ, రైనా, రాహుల్, మాజీ క్రికెటర్లు సచిన్, సెహ్వాగ్, లక్ష్మణ్, కైఫ్ సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.

శనివారం 37వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన ధోనీకి తన గారాల పట్టి ముద్దులొలికే పాటతో పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది. 'హ్యాపీ బర్త్‌ డే పాపా.. యూ ఆర్‌ గెటింగ్‌ ఓల్డ్‌. ఐ లవ్ యూ పాప (నాన్న నీకు వయస్సు మీరుతోంది)' అని ముద్దుగా పాట పాడి మరీ జీవా విష్ చేయడం విశేషం. ఇప్పుడీ ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌‌గా మారింది. ఈ వీడియో చూసిన ధోనీ అభిమానులు భలే చెప్పిందే అని తెగ మురిసిపోతున్నారు.

భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్‌ ఎం.ఎస్.ధోనీ పుట్టిన రోజు పురస్కరించుకుని బీసీసీఐ శనివారం క్యూట్ సర్‌ప్రైజ్ ఇచ్చింది. అది మరేదో కాదు.. ధోనీ కుమార్తె జీవా విషెస్. ఇంగ్లాండ్ టూర్‌లో ఉన్న ధోని అక్కడే తన పుట్టిన రోజు జరుపుకున్నారు. ఇందులో ధోనీ కుటుంబ సభ్యులతో పాటు భారత క్రికెట్ జట్టు సభ్యులంతా పాల్గొని ధోనీకి శుభాకాంక్షలు తెలిపారు. బీసీసీఐ అధికారిక ట్విట్టర్ ద్వారా టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లీతో పాటు రోహిత్‌ శర్మ, కేఎల్‌. రాహుల్‌, శిఖర్‌ ధావన్‌, హార్దిక్‌ పాండ్య, సురేశ్‌ రైనా, దినేశ్‌ కార్తిక్‌, జీవా తదితరులు ప్రత్యేక వీడియోలో ధోనీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. చివరిలో ధోనీ కుమార్తె జీవా చెప్పిన విధానం ప్రత్యేకంగా నిలిచింది.

Story first published: Tuesday, July 17, 2018, 16:45 [IST]
Other articles published on Jul 17, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+