'పంతాస్టిక్! అద్భుతమైన సెంచరీ సాధించావు'

సిడ్నీ: ఆసీస్ గడ్డపై రిషబ్ పంత్ చేసిన సెంచరీ రికార్డులను తిరగరాసింది. దూకుడైన ఇన్నింగ్స్‌తో చెలరేగిపోయిన పంత్.. అంతకుముందు పూజారాకు చక్కని భాగస్వామ్యం అందిస్తూనే పరుగులను కొనసాగించాడు. పూజారా అవుట్ తర్వాత రవీంద్ర జడేజాతో కలిసి అదే పరుగుల వరదను కొనసాగించాడు. ఈ క్రమంలో సెంచరీకి మించిన స్కోరుతో చెలరేగిన పంత్‌ను అందరూ ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. తొలి వికెట్ కీపర్‌గా సెంచరీ అందుకోవడం పట్ల ట్విట్టర్ వేదికగా అభినందనలు తెలుపుతున్నారు.
దూకుడైన ఆటను ప్రదర్శించి వంద పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. కేవలం 137 బంతుల్లో సెంచరీ చేయడం గమనార్హం. ఇప్పటి వరకూ తొమ్మిది టెస్టులు ఆడిన పంత్‌కు ఇది రెండో టెస్టు సెంచరీ. ఇలా భారత వికెట్ కీపర్లలో సెంచరీ సాధించిన తొలి వికెట్ కీపర్‌గా చరిత్ర సృష్టించాడు. గతంలో ఫారూఖ్ ఇంజినీర్ 1967వ సంవత్సరంలో టీమిండియాకు ప్రాతినిధ్యం వహిస్తూ ఆస్ట్రేలియా పర్యటన చేశాడు. ఈ పర్యటనలో 89 పరుగులు చేసి అత్యధిక పరుగులు చేసిన కీపర్‌గా రికార్డులకెక్కాడు.
రెండు పర్యటనలలోనూ సెంచరీ చేసిన పంత్
ఈ రికార్డు మాత్రమే కాకుండా.. పర్యాటక జట్లలో సెంచరీ చేసిన రెండో వికెట్ కీపర్‌గా నిలిచాడు రిషబ్ పంత్. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా పర్యటనలు చేసిన పంత్.. రెండు పర్యటనలలోనూ సెంచరీ దాటేశాడు. వెస్టిండీస్ మాజీ క్రికెటర్ జెప్ఫెరీ డుజోన్ మాంచెస్టర్ వేదికగా, పెర్త్‌లోనూ 1984వ సంవత్సరంలో సెంచరీలు నమోదు చేశాడు.
పంతాస్టిక్! రిషబ్ పంత్
పంతాస్టిక్! రిషబ్ పంత్ నుంచి అద్భుతమైన సెంచరీ. రెండో పర్యాటక సెంచరీ అందుకన్నాడు. సిరీస్‌లో రెండో అత్యధిక పరుగులు అందుకున్న ఆటగాడిగా నిలిచాడు. అవును. బేబీ సిట్టర్! అంటూ వీరేంద్ర సెహ్వాగ్ తన అధికారిక ట్విట్టర్ ద్వారా పంత్‌కు శుభాకాంక్షలు తెలిపాడు.
భార్యను సినిమాకు తీసుకెళ్తా
బాక్సింగ్ డే టెస్టులో ఇరు జట్లకు చెందిన ఆటగాళ్లు ఒకరిపై మరొకరు వ్యక్తిగతంగా కూడా విమర్శలు చేసుకున్నారు. క్రీజులో పాతుకుపోయిన నిలకడగా ఆడుతోన్న టీమిండియా యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్‌ను ఆస్ట్రేలియా కెప్టెన్ టిమ్ పైన్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత పంత్ సైతం పైన్ బ్యాటింగ్‌కు వచ్చినప్పుడు స్లెడ్జింగ్‌కు పాల్పడ్డాడు. మెల్‌బోర్న్ వేదికగా జరిగిన బాక్సింగ్ డే టెస్టులో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 'పంత్.. నా పిల్లలను ఆడించు.. నేను నా భార్యను సినిమాకు తీసుకెళ్తా' అని సరదాగా అన్న వ్యాఖ్యలను పంత్ సీరియస్‌గా తీసుకున్నాడో ఏమో కానీ అతను అన్నట్లే టిమ్ పైన్ భార్య బొనీ పైన్‌ను కలిసి వారి పిల్లలను ఆడించాడు. ఈ విషయాన్ని బొనీ పైన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొంది.
మాకు పంత్ దొరికాడు
మాకు పంత్ దొరికాడు. అంటూ పాట పాడుతూ ఓ సంగీత కచేరీ బృందం సిడ్నీ స్టేడియంలో సందడి చేసింది. మాకు పంత్ దొరికాడు. రిషబ్ పంత్. మీకిప్పటికే అర్థమై ఉంటుంది. అతను సిక్సులు కొడతాడు. మీ పాపల్ని ఆడిస్తాడు. మాకు పంత్ దొరికాడు.' అంటూ కాసేపు అభిమానులందరికీ వినోదాన్ని పంచింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications