సంతోషంగా ఉంది: ధోని రికార్డుని అధిగమించడంపై రిషబ్ పంత్

హైదరాబాద్: వ్యక్తిగా, క్రికెటర్‌గా టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని నుంచి తాను ఎంతో నేర్చుకున్నట్లు టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ చెప్పుకొచ్చాడు. నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా అడిలైడ్ వేదికగా జరిగిన తొలి టెస్టులో టీమిండియా 31 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.
ఈ మ్యాచ్ అనంతరం రిషబ్ పంత్ మాట్లాడుతూ "ధోని దేశానికి హీరో. అతని నుంచి వ్యక్తిగతంగా, ఆటగాడిగా ఎన్నో విషయాలు నేర్చుకున్నా. ధోని జట్టులో ఉంటే నా ఆత్మవిశ్వాసం మరింత పెరుగుతుంది. ఏదైనా ఇబ్బంది ఉంటే వెంటనే అతనితో మాట్లాడి పరిష్కరించుకునేవాడిని" అని తెలిపాడు.

ధోని రికార్డుని అధిగమిస్తానని అనుకోలేదు
"ఒత్తిడిలో ప్రశాంతంగా ఉంటూ, నీ పని నువ్వు చేసుకుపోవాలని సూచించాడు. ధోని రికార్డుని అధిగమిస్తానని అనుకోలేదు. అయితే, ఈ రికార్డు సాధించినందుకు చాలా సంతోషంగా ఉంది. ప్రస్తుతం, దీనిపై పెద్దగా ఆలోచించడం లేదు" అని రిషబ్ పంత్ అన్నాడు. ఈ టెస్టులో భారత యువ వికెట్‌కీపర్ రిషబ్ పంత్ అరుదైన రికార్డు సాధించాడు.

అడిలైడ్ టెస్టులో 11 క్యాచ్‌లు పట్టిన పంత్
ఈ మ్యాచ్‌లో మొత్తం 11 క్యాచ్‌లు పట్టిన రిషబ్ పంత్.. ఒక టెస్టులో అత్యధిక క్యాచ్‌లు అందుకున్న జాక్ రసెల్ (ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికాపై, 1995లో), ఏబీ డివిలియర్స్ (దక్షిణాఫ్రికా, పాకిస్థాన్‌పై, 2013లో) ప్రపంచ రికార్డును సమం చేశాడు. భారత్ తరఫున ఒక టెస్టులో అత్యధిక క్యాచ్‌లు అందుకున్న వృద్ధిమాన్ సాహా (10) రికార్డును కూడా బద్దలు కొట్టాడు.

సాహా గాయపడడంతో రిషబ్ పంత్‌కు ఛాన్స్
వృద్ధిమాన్ సాహా గాయపడడంతో అతని స్థానంలో జట్టులోకి వచ్చిన రిషబ్ పంత్‌కు ఇది ఆరో టెస్టు మాత్రం కావడం విశేషం. నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా అడిలైడ్ వేదికగా జరిగిన తొలి టెస్టులో కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా 31 పరుగులతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.

నాలుగు టెస్ట్‌ల సిరీస్‌లో టీమిండియా 1-0 ఆధిక్యం
దీంతో నాలుగు టెస్ట్‌ల సిరీస్‌లో టీమిండియా 1-0 ఆధిక్యంలో నిలిచింది. టీమిండియా నిర్దేశించిన 323 పరుగుల లక్ష్యఛేదన కోసం ఓవర్‌నైట్ స్కోరు 104/4తో ఆఖరి రోజు ఆట కొనసాగించిన ఆస్ట్రేలియా 291 పరుగులకు ఆలౌటైంది. ఈ సిరిస్‌లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య డిసెంబర్ 14 నుంచి రెండో టెస్టు జరగనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications