Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Wasim Jaffer's Playing 11 : పంత్ నాట్ ఓకే.. డీకే ఓకే.. ఆసీస్‌తో తొలి టీ20కి జాఫర్ పేర్కొన్న భారత జట్టు ఇదే!

Pant Out, Dinesh Karthik in.. Wasim Jaffer predicted His Indias Playing 11 for 1st T20 Against Aussies

టీమిండియా మాజీ బ్యాటర్, క్రికెట్ విశ్లేషకుడు వసీం జాఫర్ టీమిండియా ఆడే మ్యాచ్‌లకు ముందే తన ప్లేయింగ్ 11 ప్రెడిక్ట్ చేస్తాడనే సంగతి తెలిసిందే. ఇకపోతే ఆస్ట్రేలియాతో నేడు మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. ఇక మొహాలీ వేదికగా జరగబోయే తొలి టీ20 ఎన్‌కౌంటర్‌కు ముందు తన ప్లేయింగ్ ఎలెవన్‌‌ను వసీం జాఫర్ పేర్కొన్నాడు.

ఇక విరాట్ కోహ్లీని తన ప్లేయింగ్ 11లో నంబర్ 3 స్థానంలో ఆడే ప్లేయర్‌గానే జాఫర్ పేర్కొన్నాడు. ఇక ఓపెనర్లుగా ఇన్నింగ్స్‌ను ప్రారంభించేందుకు కేఎల్ రాహుల్, కెప్టెన్ రోహిత్ శర్మను పేర్కొన్నాడు. జాఫర్ తన జట్టులో రిషబ్ పంత్‌కు చోటివ్వలేదు. బదులుగా వికెట్ కీపర్ కం బ్యాటర్‌ అయిన దినేష్ కార్తీక్‌ను ఇంక్లూడ్ చేశాడు.

అర్షదీప్, ఉమేష్ యాదవ్ వద్దు..

ఇక నంబర్ 4స్థానంలో సూర్యకుమార్ యాదవ్‌ను, అయిదో స్థానంలో స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాను అతను సూచించాడు.వసీం జాఫర్ తన జట్టు బౌలింగ్ విభాగంలోనూ కాస్త డిఫరెంట్ ఛాయిస్ చూపించాడు. పేస్ విభాగంలో భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రాలను ఇంక్లూడ్ చేసిన జాఫర్.. మూడో ఛాయిస్‌గా అర్షదీప్ సింగ్‌ను, ఉమేష్ యాదవ్‌ను పట్టించుకోలేదు. గాయం నుంచి కోలుకుని తిరిగి జట్టులోకి వచ్చిన హర్షల్ పటేల్ వైపే మొగ్గుచూపడు. ఇకపోతే స్పిన్ ఛాయిస్లో రవిచంద్రన్ అశ్విన్‌కు బదులు అక్షర్ పటేల్‌ను పేర్కొన్నాడు. టాప్ స్పిన్నర్‌గా యుజ్వేంద్ర చాహల్‌ పేరును తెలిపాడు.

కోహ్లీ మాకు ఛాలెంజింగ్ టాస్క్

కోహ్లీ మాకు ఛాలెంజింగ్ టాస్క్

ఇకపోతే ఆస్ట్రేలియా జట్టు స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ లేకుండానే బరిలోకి దిగబోతుంది. గాయం కారణంగా స్టార్క్, మార్ష్, వార్నర్ ఈ సిరీస్‌కు మిస్సయ్యారు. ఇది సిరీస్‌లో ఆస్ట్రేలియా విజయావకాశాలను దెబ్బతీయొచ్చు. అయితే సెలక్షన్ కమిటీ బిగ్ హిట్టర్ టిమ్ డేవిడ్‌ను జట్టులోకి చేర్చింది. మొహాలీ వేదికగా జరిగే తొలి టీ20లోనే డేవిడ్ అరంగేట్రం చేయొచ్చు. ఈ సిరీస్లో విరాట్ కోహ్లీ తమకు ఛాలెంజింగ్ టాస్క్ అంటూ ఆస్ట్రేలియా ఎక్స్‌ప్రెస్ పేసర్ పాట్ కమిన్స్ పేర్కొన్న సంగతి తెలిసిందే. 'నేను ఆసియా కప్ టోర్నీని ఫాలో కాలేదు. శ్రీలంక గెలిచిందని మాత్రమే తెలుసు. కానీ నేను ఓ మ్యాచ్ హైలెట్స్‌లో మాత్రం విరాట్ కోహ్లీ విశ్వరూపం చూశాడు. అతను సెంచరీతో కదం తొక్కాడు. అతను ఇప్పుడు మళ్లీ భీకర ఫామ్‌లోకి వచ్చేశాడు. ఈ వారం మాకు అతనో పెద్ద సవాల్ కానున్నాడు.' అని కమిన్స్ తెలిపాడు.

మొదటి టీ20కి వసీం జాఫర్ ప్రెడిక్ట్ చేసిన భారత తుది జట్టు

మొదటి టీ20కి వసీం జాఫర్ ప్రెడిక్ట్ చేసిన భారత తుది జట్టు

టాపార్డర్ : కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లీ

మిడిలార్డర్ : సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా,

లోయర్ ఆర్డర్ : దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్,

టెయిలెండర్లు : భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, యుజ్వేంద్ర చాహల్, హర్షల్ పటేల్

Story first published: Tuesday, September 20, 2022, 8:42 [IST]
Other articles published on Sep 20, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+