న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'కార్తీక్ కంటే పంతే బెటర్.. అవకాశమెందుకివ్వలేదు?'

Pant good enough to keep wickets in Tests then why not in T20s: Azharuddin

కోల్‌కతా: వెస్టిండీస్‌తో టీమిండియా తలపడిన తొలి టీ20లో కీపర్‌గా దినేశ్ కార్తీక్ వ్యవహరించడంపై పలు విమర్శలు వస్తున్నాయి. కార్తీక్ కీపింగ్ సరిగా చేయలేదని కాకుండా పంత్‌తో కీపింగ్ ఎందుకు చేయించారనే ప్రశ్న చక్కర్లు కొడుతోంది. ఈ క్రమంలోనే టీమిండియా మాజీ కెప్టెన్ మొహమ్మద్ అజారుద్దీన్.. పంత్ వెనకేసుకొస్తూ ఇంగ్లాండ్ పర్యటనలో వికెట్ కీపింగ్ చేసిన సంగతి గుర్తుకు తెస్తున్నాడు.

కీపింగ్ బాధ్యతల్ని కార్తీక్‌‌కి అప్పగించి:

కీపింగ్ బాధ్యతల్ని కార్తీక్‌‌కి అప్పగించి:

ఇంగ్లాండ్ గడ్డపై టెస్టుల్లో కార్తీక్ కంటే మెరుగ్గా పంతే కీపింగ్ బాధ్యతను చక్కగా నిర్వర్తించాడు. అలాంటిది టీ20ల్లో మాత్రం కీపర్‌‌గా టీమిండియా మేనేజ్‌మెంట్‌కి పనికిరాలేదా..? అని ప్రశ్నించాడు. వెస్టిండీస్‌తో కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఆదివారం ముగిసిన తొలి టీ20లో టీమిండియా మేనేజ్‌మెంట్ జట్టు కీపింగ్ బాధ్యతల్ని కార్తీక్‌‌కి అప్పగించింది. ధోనీని తప్పించి పంత్‌ని కీపర్‌గా జట్టులోకి తీసుకుంటానని చెప్పిన మేనేజ్‌మెంట్ కేవలం బ్యాట్స్‌మెన్‌గా మాత్రమే తుది జట్టులోకి తీసుకుంది.

పంత్‌కు ఎందుకు అవకాశమివ్వలేదు.

పంత్‌కు ఎందుకు అవకాశమివ్వలేదు.

‘వెస్టిండీస్‌తో టీ20ల్లో రిషబ్ పంత్‌కు ఎందుకు అవకాశమివ్వలేదు. ఇంగ్లాండ్‌పై టెస్టుల్లో రిషబ్ పంత్‌ అత్యుత్తమంగా కీపింగ్ చేశాడు. దినేశ్ కార్తీక్‌తో పోల్చి చూస్తే పంతే మెరుగైన ప్రదర్శన కనబర్చాడు. అందుకే.. తొలి టీ20లో కచ్చితంగా పంత్‌కి అవకాశమిచ్చి ఉండాల్సింది. బ్యాట్‌తో పంత్‌ చక్కగా పరుగులు రాబడుతున్నాడు. అలానే వికెట్ కీపర్‌గానూ.. రాణిస్తున్నాడు. అతనికి ఎన్ని అవకాశాలిస్తే.. వికెట్ల వెనుక అంత మెరుగవుతాడు' అని అజహరుద్దీన్ వెల్లడించాడు.

ఎంపిక సమయంలో ధోనీపై సెలక్టర్ల వేటు

ఎంపిక సమయంలో ధోనీపై సెలక్టర్ల వేటు

వాస్తవానికి టీ20 సిరీస్ కోసం జట్టుని ఎంపిక చేసే సమయంలో ధోనీపై వేటు వేసిన సెలక్టర్లు.. రెగ్యూలర్ వికెట్ కీపర్‌గా రిషబ్ పంత్‌‌నే ఎంపిక చేశారు. కానీ.. ఆదివారం జరిగే మ్యాచ్‌లో మాత్రం కీపింగ్ బాధ్యతల్ని దినేశ్ కార్తీక్‌కి అప్పగించారు. యువ వికెట్‌ కీపర్‌పై టీమిండియా వ్యవహరిస్తున్న తీరు సరిగాలేదని అజహరుద్దీన్ మండిపడ్డాడు. అతనితో పాటుగా నెటిజన్లు సైతం పంత్‌కు కీపింగ్ బాధ్యతలు ఇవ్వలేదు. ధోనీని తప్పించేందుకు కేవలం అతనిని సాకుగా చూపారంతేనంటూ ట్వీట్లు చేస్తున్నారు.

టీ20 ప్రపంచ కప్ సమయానికి కీపర్‌గా

టీ20 ప్రపంచ కప్ సమయానికి కీపర్‌గా

ఇంగ్లాండ్‌ గడ్డపై టెస్టుల్లో దినేశ్ కార్తీక్‌ విఫలమైయ్యాడు. దీంతో సిరీస్ మధ్యలోనే అతనిని తప్పించిన సెలక్టర్లు రిషబ్ పంత్‌కి కీపర్‌గా ఛాన్స్ ఇచ్చారు. ఆ సిరీస్ చివరి టెస్టులో సెంచరీ బాదిన రిషబ్ పంత్.. ఆ తర్వాత వెస్టిండీస్‌తో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌లలోనూ 92, 92 పరుగులతో సత్తాచాటాడు. ఈ క్రమంలోనే టీ20 ప్రపంచ కప్ సమయానికి కీపర్‌గా తయారుచేసేందుకు పంత్‌ను జట్టులోకి తీసుకుంటున్నామని సెలక్టర్లు చెప్పుకొచ్చారు.

Story first published: Monday, November 5, 2018, 16:31 [IST]
Other articles published on Nov 5, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X