For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సిడ్నీ వన్డేకు పాండ్యా, రాహుల్ దూరం: తొలి వన్డేకు భారత జట్టిదే!

India vs Australia 1st ODI : Pandya,Rahul To Miss First ODI,May Miss The Entire Series | Oneindia
Pandya, Rahul to miss first ODI, may miss the entire series against Australia

హైదరాబాద్: టీమిండియా క్రికెటర్లు హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్‌లపై సస్పెన్షన్ వేటు పడింది. 'కాఫీ విత్ కరణ్' టాక్ షోలో మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న వీరిద్దరిని సిడ్నీ వేదికగా శనివారం నుంచి ఆస్ట్రేలియాతో జరగనున్న తొలి వన్డే‌కు పక్కన పెట్టినట్లు తెలుస్తోంది.

బీసీసీఐ ఈ ఇద్దరిపై తదుపరి చర్యలు తీసుకోనున్న నేపథ్యంలో జట్టు మేనేజ్‌మెంట్ రిస్క్ తీసుకోలేదు. ఇందులో భాగంగా తొలి వన్డే‌‌కి భారత్ దాదాపు తుది జట్టుని ఖరారు చేసింది. కేఎల్ రాహుల్ పేరును అసలు పరిశీలించలేదని, గాయం నుంచి ఇటీవల కోలుకుని జట్టులోకి పునరాగమనం కోసం ఎదురుచూస్తున్న పాండ్యా విషయానికి వస్తే తొలి వన్డేలో మాత్రం ఉండబోడని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.

బోర్డు నుంచి తుది నిర్ణయం కోసం వేచి చూస్తున్న కారణంగా తుది జట్టులో నిన్ను తీసుకోవడం లేదని పాండ్యాకు ఇప్పటికే టీమ్ మేనేజ్‌మెంట్ స్పష్టం చేసింది. మరోవైపు రాహుల్ పేరుని అసలు పరిగణనలోకి తీసుకోలేదని బోర్డు వర్గాలు తెలిపాయి. దీంతో ఈ ఇద్దరు క్రికెటర్లూ తొలి వన్డే‌లో ఆడే అవకాశాలు లేవని తెలుస్తోంది.

ఈ ఇద్దరిపై సస్పెన్షన్ విధిస్తారా? వాళ్లను తిరిగి ఇండియాకు పంపించాలా అన్న అంశంపై బోర్డు నుంచి అధికారిక సమాచారం కోసం మేనేజ్‌మెంట్ వేచి చూస్తోంది. దీంతో ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరిస్‌కు ఈ ఇద్దరూ దూరమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

మహిళలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఈ ఇద్దరినీ రెండు వన్డేల పాటు నిషేధించాలని సీఓఏ చైర్మన్ వినోద్ రాయ్ సిఫారసు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మరో సభ్యురాలు డయానా ఎడుల్జీ కూడా ఈ ఇద్దరిపై సస్పెన్షన్ విధించడమే సరైందని చెప్పిన సంగతి తెలిసిందే.

పాండ్యా, రాహుల్‌లను తొలి వన్డేలో పక్కన పెట్టడంతో కేదార్ జాదవ్, దినేశ్ కార్తీక్‌కు మార్గం సుగమం అయింది. ఓపెనర్లుగా రోహిత్ శర్మ, శిఖర్ ధావన్.. మూడో స్థానంలో విరాట్ కోహ్లీ, నాలుగులో అంబటి రాయుడు, ఆ తర్వాత దినేశ్ కార్తీక్, కేదార్ జాదవ్, ధోనీ బ్యాటింగ్ ఆర్డర్‌లో వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.

ఇక బౌలింగ్ విభాగంలో భువనేశ్వర్, ఖలీల్ అహ్మద్, మహ్మద్ షమీ లేదా సిరాజ్‌తో పాటు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఉండే అవకాశం ఉంది.

భారత వన్డే జట్టు ఇదే!
విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, శిఖర్ ధావన్, అంబటి రాయుడు, దినేశ్ కార్తీక్, కేదార్ జాదవ్, మహేంద్రసింగ్ ధోని (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్య, కుల్దీప్ యాదవ్, చాహల్, రవీంద్ర జడేజా, భువనేశ్వర్ కుమార్, ఖలీల్ అహ్మద్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్

Story first published: Friday, January 11, 2019, 17:37 [IST]
Other articles published on Jan 11, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+