For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

హార్ధిక్ పాండ్యా భారత్ జట్టుకి దొరికిన గొప్ప ఆస్తి

By Nageshwara Rao
Pandya could develop into a fantastic asset: Klusener

హైదరాబాద్: టీమిండియా ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యాపై దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు క్లూసెనర్ ప్రశంసల వర్షం కురిపించాడు. కేప్‌టౌన్ వేదికగా జరిగిన తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత టాపార్డర్ పూర్తిగా విఫలమైన వేళ పాండ్యూ 93 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడిన సంగతి తెలిసిందే.

అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో సఫారీ ఓపెనర్లని వరుస ఓవర్లలో పెవిలియన్‌కు చేర్చాడు. కానీ, 208 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా దక్షిణాఫ్రికా చేతిలో 72 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఇరు జట్ల మధ్య రెండో టెస్టు శనివారం సెంచూరియన్ వేదికగా జరగనుంది.

ఈ నేపథ్యంలో క్లూసెనర్ మీడియాతో మాట్లాడుతూ తొలి టెస్టులో టీమిండియా ఓటమి పాలైనప్పటికీ హార్దిక్ పాండ్యా ఇన్నింగ్స్‌ మాత్రం తనను ఎంతగానో ఆకట్టుకుందని అన్నాడు. 'తొలి ఇన్నింగ్స్‌లో పాండ్యా 93 పరుగుల ఇన్నింగ్స్ అద్భుతం. పాండ్యా బ్యాటింగ్ సూపర్. అతడి బ్యాటింగ్ వల్ల దక్షిణాఫ్రికానే ఒత్తడిని ఎదుర్కొనేలా చేశాడు' అని అన్నాడు.

'భారత తరుపున అతడు ఎదుగుతున్న తీరు అద్భుతం. హార్దిక్ పాండ్యా దూకుడైన ఇన్నింగ్స్‌తో భారత్ మళ్లీ మ్యాచ్‌లోకి రాగలిగింది. అతని బ్యాటింగ్ అమోఘం.. క్రీజులో పాతుకుపోయి దక్షిణాఫ్రికా బౌలర్లు వెనుకంజ వేసేలా చేశాడు. అతను భారత్ జట్టుకి దొరికిన ఆస్తి. బంతితోనూ మెరుస్తూ కెరీర్‌లో మరో అడుగు ముందుకేశాడు' అని పేర్కొన్నాడు.

'అతను అత్యుత్తమ ఆల్‌రౌండర్‌గా రోజురోజుకీ ఎదుగుతున్నాడు. జట్టు అవసరాలకి అనుగుణంగా కొన్నిసార్లు దూకుడుగా ఆడుతున్నాడు. ఈ క్రమంలో ఒకవేళ ఔటైనా.. హార్దిక్‌ని విమర్శించకండి.. అలా ఆడమనే ప్రోత్సహించండి. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌కు ఆడుతున్నా లేదా భారత జట్టులో ఆడుతున్నా అతడికి మంచి కంపెనీ ఉంది. అతడి చుట్టూ మంచి మనుషులు ఉన్నారు' అని క్లూసెనర్ చెప్పుకొచ్చాడు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Wednesday, January 10, 2018, 15:54 [IST]
Other articles published on Jan 10, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+