హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 10వ సీజన్‌లో హార్దిక్, క్రునాల్ పాండ్యాలు ముంబై ఇండియన్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తాజాగా ఈ సోదరులు ఓ ఇంటి వారయ్యారు. ప్రముఖులు నివాసం ఉండే అంధేరి సబర్బన్, వెర్సోవాలో విలాసవంతమైన డబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్‌ను వీరిద్దరూ కలసి ఖరీదు చేశారు.
ప్లాట్ కొనుగోలు చేసిన తర్వాత తమ తల్లిదండ్రుల కోసమే ఈ ఫ్లాట్‌ను కొనుగోలు చేసినట్టు తెలిపారు. గుజరాత్‌లోని బరోడాలో ఉంటున్న తమ తల్లిదండ్రులు ఐపీఎల్ మ్యాచ్ వీక్షించేందుకు తాము ఈ ప్లాట్‌ను కొనుగోలు చేసినట్లు చెప్పుకొచ్చారు.

ముంబైలో ఇంటిని కొనుగోలు చేయడంపై పాండ్యా బ్రదర్స్ తండ్రి హిమాన్షు పాండ్యా సంతోషం వ్యక్తం చేశారు. ముంబైలో ఇది మాకు మొట్టమొదటి ఇల్లు అని, ఇటీవలే గృహ ప్రవేశం చేసినట్టు తెలిపారు. అయితే ఇప్పటి ఇప్పుడే బరోడా నుంచి తాము షిప్ట్ చేసే ఆలోచనలో లేమని చెప్పారు. త్వరలో క్రునాల్ వివాహం చేయనున్నట్టుగా కూడా సమాచారం.