For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'బాబర్ నా ప్రాణం, అతడిని విమర్శిస్తే నా గుండె ముక్కలవుతుంది!': ప్రముఖ మోడల్

పాకిస్థాన్ క్రికెట్ లో ఎంతో మంది లెజెండరీ ప్లేయర్స్ ఉన్నప్పటికీ, వారిలో కొంతమంది మాత్రమే ప్రజల, క్రికెట్ ఫ్యాన్స్ అభిమానాన్ని చూరగొన్నారు. అలాంటి వారిలో స్టార్ బ్యాటర్ బాబర్ ఆజం ముందు వరుసలో ఉంటాడు. అతడు మైదానంలో దూకుడుగా ఆడూతూ.. ఆఫ్ ఫీల్డ్ లో డీసెంట్ అండ్ కామ్ గా ఉంటూ ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. అయితే తాజాగా అతడు మరోసారి వార్తల్లో నిలిచాడు. అందుకు కారణం ఓ అందమైన స్టార్ మోడల్ ఎమోషనల్ లవ్ కామెంట్స్.

ఎమోషనల్ గా..
పాకిస్థానీ మోడల్ జహ్రా (Dua Zahra) కు అక్కడ యూత్ లో ఫుల్ క్రేజ్ ఉంది. సోషల్ మీడియాలో ఆమెకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తాజాగా ఓ షోలో పాల్గొన్న ఈ బ్యూటీఫుల్ భామ బహిరంగంగానే బాబర్ ఆజం అంటే తనకు ఎంత ఇష్టమో వివరించింది. అతడిని తానెంతగా అభిమానిస్తుందో ఎమోషనల్ అవుతూ చెప్పింది.

Pakisthani Star Model Dua Zahra love propose to cricketer Babar Azam video goes viral

"బాబర్ ఆజం నాకు మాత్రమే సొంతం. నాకు అతడిపై విపరీతమైన ప్రేమ, అభిమానం ఉంది. అతడు నా క్రష్. అతడిని ఎవరైనా విమర్శించినా, ట్రోల్ చేసినా దానిని అస్సలు సహించను, అంగీకరించను. ఎవరైనా బాబర్ గురించి తప్పుగా మాట్లాడితే.. అది నన్నెంతగానో బాధిస్తుంది. ఇంకా చెప్పాలంటే నన్ను చంపేసినట్టుగా ఉంటుంది. నా హృదయం ముక్కలైపోయినట్టుగా అనిపిస్తుంది." అని బాగా ఎమోషనల్ అయిపోయింది. అతడు లేకపోతే తాను లేనని అన్నట్టుగా తీవ్ర భావోద్వేగంతో మాట్లాడింది. ప్రస్తుతం ఈ మోడల్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి. మరికొంతమందైతే బాబర్ ఆజంకు అంత పాపులారిటి ఉందా అని చూసి షాకవుతున్నారు.

మనసు గెలుచుకున్న బాబర్ ఆజం
అంత అందమైన జహ్రా ఎంతో ఎమోషనల్ గా, నిజాయతీగా తన ప్రేమను బహిరంగంగా చెప్పినప్పటికీ.. బాబర్ ఆజం మాత్రం అస్సలు స్పందించకుండా కేవలం తన క్రికెట్ పై మాత్రమే ఫోకస్ చేయడాన్ని క్రికెట్ అభిమానులు ప్రశంసిస్తున్నారు. అతడు ఛాంపియన్స్ ట్రోఫీ కోసం తీవ్రంగా శిక్షణ చేయడం, శ్రమించడం చూసి అభినందిస్తున్నారు.

Story first published: Thursday, February 6, 2025, 16:50 [IST]
Other articles published on Feb 6, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+